breaking news
	
		
	
  lepakshi junior college
- 
      
                    
గ్రామీణ విద్యార్థులే తెలివైన వారు : ఆర్ఐఓ

 లేపాక్షి : పట్టణ ప్రాంత విద్యార్థుల కన్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులే తెలివైనవారని వైఎస్సార్ జిల్లా ఆర్ఐఓ రవి అన్నారు. ఆయన గురువారం ఉదయం లేపాక్షి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అక్కడ వసతి, తరగతి గదులు, సిలబస్ తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివినప్పుడే లక్ష్యాన్ని సాధించగలుగుతారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటర్ స్థాయిలోనే లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఇన్చార్జి ప్రిన్సిపల్ మురళీమోహన్ ఉన్నారు. - 
      
                    
‘పర్యవేక్షణ విషయంలో రాజీ లేదు’

 అనంతపురం ఎడ్యుకేషన్ : తాను ఏ క్యాడర్లో ఉన్నా పర్యవేక్షణ విషయంలో రాజీ ప్రసక్తే లేదని ఇంటర్ విద్య ఆర్జేడీ వెంకటరమణ అన్నారు. లేపాక్షి జూనియర్ కళౠశాల ప్రిన్సిపల్‌గా ఉంటున్న ఆయనకు జిల్లా వత్తి విద్యాశాఖ అధికారిగా, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో పర్యవేక్షణ ఇబ్బందిగా మారుతోందంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆయన మంగళవారం స్పందించారు. తాను ఎంత బిజీగా ఉన్న వారానికోసారి కళాశాలకు వెళ్తున్నానని, ఇన్‌చార్జ్‌తో తరచూ సమన్వయం చేసుకుంటూ కళాశాలను ఆదర్శంగా నిలిపేలా ప్రయత్నిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. 


