last warning
-
కేంద్రానికి ఇదే నా చివరి హెచ్చరిక: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంట్లో గనుక డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే, తమిళనాడులో ఇప్పటివరకు చూడని స్థాయిలో భారీ ఉద్యమాన్ని చేపడతానని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం తన సోషల్ మీడియాలో స్వయంగా సీఎం స్టాలిన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘అదే గనుక జరిగితే నా రాష్ట్ర ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయిస్తాను. 1960 నాటి డీఎంకే ఉద్యమాన్ని మళ్లీ పరిచయం చేస్తాను. కేంద్రానికి, ప్రధానికి ఇదే నా చివరి హెచ్చరిక’’ అని ప్రకటించారాయన. ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన. ఈ ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఉత్తర రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం లభిస్తుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో.. తమిళనాడు ప్రజల హక్కులను కాపాడేందుకు తాను వెనుకాడబోనని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ అంశంపై తమిళనాడులో ఇప్పటికే డీఎంకే కార్యకర్తలు, మిత్రపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టాలిన్ హెచ్చరికతో ఉద్యమానికి మరింత ఊపిరి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Hon’ble Prime Minister, this is Tamil Nadu’s final warning.மாண்புமிகு பிரதமர் அவர்களே, இது தமிழ்நாட்டின் இறுதி எச்சரிக்கை!#TNwillFightTNwillWin pic.twitter.com/v9wkYYM6MO— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 14, 2026 -
ఇదే నా చివరి హెచ్చరిక.. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హమాస్‌పై భగ్గుమన్నారు. తమ అదుపులో ఉన్న మిగిలిన బందీలను తక్షణమే విడుదల చేయాలని.. లేకుంటే అంతు చూస్తానని హమాస్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలో ఇదే తన చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు. హమాస్(Hamas) విడుదల చేసిన ఎనిమిది మందితో వైట్హౌజ్తో తాజాగా ట్రంప్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘హలోనా? గుడ్‌బైనా?.. ఏదో మీరే ఎంచుకోండి. బందీలందరిని వెంటనే విడుదల చేయండి. అలాగే మీరు చంపిన వాళ్ల మృతదేహాలను తిరిగి అప్పగించండి. లేకుంటే మీ పని ఖతమే. మానసికంగా మూర్ఖులైనవాళ్లు మాత్రమే ఇలా మృతదేహాలను తమ వద్ద ఉంచుకుంటారు. అందుకే.. పని పూర్తి చేసేందుకు అవసరమైనవన్నీ ఇజ్రాయెల్‌కు పంపుతున్నా. నేను చెప్పింది చేయకుంటే.. ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగలడు. ‘‘మీరు చిధ్రం చేసిన కొందరు బందీలను నేను కలిశా. ఇదే మీకు నా చివరి హెచ్చరిక. గాజానుప్పుడే వీడండి. ఇదే మీకు చివరి అవకాశం. గాజా ప్రజల్లారా.. మీ కోసం అందమైన భవిష్యత్తు ఎదురు చూస్తోంది. ఒకవేళ బందీలను గనుక విడుదల చేయకుంటే.. అది మీకు దక్కదు. బందీలందరినిప్పుడే విడుదల చేయండి.. లేదంటే తర్వాత అనుభవించాల్సి ఉంటుంది అని పదే పదే హెచ్చరిక జారీ చేశారాయన. "'Shalom Hamas' means Hello and Goodbye - You can choose. Release all of the Hostages now, not later, and immediately return all of the dead bodies of the people you murdered, or it is OVER for you. Only sick and twisted people keep bodies, and you are sick and twisted! I am… pic.twitter.com/88EjVAyWAe— President Donald J. Trump (@POTUS) March 5, 20252023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం(Gaza War) మొదలైన సంగతి తెలిసిందే. తొలుత హమాస్ జరిపిన మెరుపు క్షిపణుల దాడుల్లో 1,200 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఆ సమయంలోనే కొందరు ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని హమాస్ ఎత్తుకెళ్లి తమ చెరలో బంధీలుగా ఉంచుకుంది. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో.. ఇప్పటిదాకా 46 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. ఇందులో పిల్లలే ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో లక్షల మంది ప్రాణభయంతో గాజాను విడిచిపెట్టి పోయారు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచే హమాస్‌ను బందీల విడుదల విషయంలో హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పాలస్తీనా ఖైదీలు, యుద్ధ ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్-హమాస్ పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అమలు నిదానంగా జరుగుతుండడం.. ఒకానొక దశలో హమాస్ బందీల విడుదలను నిలుపుదల చేయడంతో ట్రంప్ ఇలా చివరి హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. గాజా నుంచి పాలస్తీనా ప్రజలను వెళ్లగొట్టి పునర్ నిర్మిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించడం.. ఓ ఏఐ జనరేటెడ్ వీడియో పోస్ట్ చేయడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
'లాస్ట్ వార్నింగ్': సీఎం కొడుకా మజాకా!
పణాజీ: గోవా ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రమాణం చేసి ఒక్క రోజు కూడా పూర్తికాకముందే ఆయన కుమారుడు ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ నేతను హెచ్చరించాడు. తనపై ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేతకు ఫేస్బుక్లో 'లాస్ట్ వార్నింగ్' ఇచ్చాడు. గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ కుమారుడు రిషి(21)పై కాంగ్రెస్ నేత దుర్గాదాస్ కామత్ ఫేస్బుక్లో ఆరోపణలు చేశారు. రిషి తన తండ్రి నియోజకవర్గమైన మండ్రేమ్లో అక్రమంగా నిర్వహించిన బుల్ ఫైట్స్‌లో పాల్గొన్నాడని రెండు ఫొటోలను ఫేస్బుక్లో పెట్టారు. దీనికి 'సీఎం కుమారుని సమక్షంలో బుల్‌ఫైట్' అని శీర్షిక పెట్టారు. అయితే ఈ ఫొటోల్లో రిషి ఎక్కడా లేడు. దీనిపై మంగళవారం రాత్రి రిషి ఫేస్బుక్లో వివరణ ఇచ్చాడు. తాను అసలు అక్కడ లేనని, కావాలంటే అన్ని ఫొటోలను ఫేస్బుక్లో పెట్టాలని దుర్గాదాస్‌ను డిమాండ్ చేశారు. ఇటువంటి ఆరోపణలను సహించబోనని, సరైన సమాచారం తెలుసుకున్న తరువాతే ఫేస్బుక్లో పెట్టాలని సూచించాడు. 'ఇది అతనికి లాస్ట్ వార్నింగ్. ఇలాగే మళ్లీ చేస్తే, నేను సమయం వృధా చేసుకోను. అసలు నేనేంటో చూపిస్తా' అని హెచ్చరించాడు. చివరన సీఎం కుమారుడు అని కూడా పేర్కొన్నాడు. **


