breaking news
Land grabbed
-
ఎంపీ కేశినేని చిన్ని భారీ భూ దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హైదరాబాద్‌లో భారీ భూదోపిడీకి తెర లేపారని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. కూకట్పల్లి సమీపంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఈ భూకబ్జాను అడ్డుకుని, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. పదవిని దుర్వినియోగం చేస్తున్నారు.. ‘మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండల పరిధిలోని షంషీగూడ గ్రామ సర్వే నంబర్ 57లో ఉన్న 112.72 ఎకరాల విలువైన భూమిని అక్రమంగా చేజిక్కించుకోవడానికి కేశినేని చిన్ని ఒక పెద్ద సిండికేట్‌ను నడుపుతున్నారు. టీజీఐఐసీ ఐటీ పార్క్ కోసం ప్రతిపాదించిన ఈ ప్రభుత్వ భూమిని కాజేయడానికి ఎంపీ తన కుమారుడు కేశినేని వెంకట్ చౌదరిని (ఎక్సెల్లా ప్రాపరీ్టస్ మేనేజింగ్ పార్టనర్) ప్రాక్సీగా వాడుకుంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్తులను చేజిక్కించుకోవడానికి ఢిల్లీ నుండి తన రాజ్యాంగ పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భూమిపై అక్రమంగా హక్కులు పొందడానికి నాగమ్మ గుడి ఎదురుగా భారీ ఎర్త్ మూవర్లను, బారికేడ్లను మోహరించారు..’అని నాని తన లేఖలో తెలిపారు. కోర్టును మోసం చేస్తున్నారు.. ‘ఈ భూమిపై ఎలాంటి ప్రైవేట్ యాజమాన్య హక్కులు లేవని 2026 మార్చి 19 నాటి కౌంటర్ అఫిడవిట్లో జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎంపీ సిండికేట్ సుప్రీంకోర్టులో ఆర్టికల్ 142 కింద మోసపూరిత ప్రైవేట్ రాజీ దరఖాస్తులను దాఖలు చేసింది. సర్వే నంబర్ 57లోని మొత్తం 274.33 ఎకరాలు (కబ్జాకు ప్లాన్ చేసిన 112.72 ఎకరాలతో కలిపి) ’పోరంబోకు సర్కారీ’ భూమిగా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. పైగా అస్మాన్ జాహి వారసుల ప్రైవేట్ క్లెయిమ్‌లను అతియాత్ కోర్టు (25.11.1957న), రెవెన్యూ బోర్డు (06.05.1976న) తిరస్కరించాయి. 1959 నాటి ప్రాథమిక రాజీ డిక్రీ (దీనిలో ప్రభుత్వం భాగస్వామి కాదు) కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతిపై ఆధారపడి ఉంది. కానీ అది ఎప్పుడూ జరగలేదు. అంతేకాకుండా ఈ ఆస్తి వెనుక పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణానికి సంబంధించిన నిధుల మళ్లింపు ఉందనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలోనే కాషన్ నోటీసు ఇచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్టే ఆర్డర్ కూడా ఉంది. ఈ విషయాలన్నింటినీ దాచిపెట్టి కోర్టును సైతం మోసం చేస్తున్నారు. ప్రైవేట్ రాజీ ద్వారా వీటిని దాటవేయడం పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం)లోని తీవ్రమైన నేరాలు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ (నమ్మకద్రోహం) కిందకు వస్తుంది..’అని నాని పేర్కొన్నారు. నకిలీ ప్రీ–లాంచ్ స్కామ్‌లు ‘ఈ సిండికేట్ కేవలం భూకబ్జాలకే పరిమితం కాకుండా టీఎస్–రెరా అనుమతులు లేకుండా కేశినేని డెవలపర్స్, ఎక్సెల్లా ప్రాపర్టీస్ పేరుతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12, గచ్చిబౌలి, ప్రగతినగర్, శంకర్పల్లి, పటాన్చెరు, దుండిగల్ వంటి ప్రాంతాలలో నకిలీ ప్రీ–లాంచ్ స్కామ్‌లకు పాల్పడింది. ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. లేని ప్లాట్లను చూపిస్తూ వందలాది మధ్యతరగతి కుటుంబాల నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ నిధులను భూకబ్జా కార్యకలాపాలకు మళ్లించారు..’అని కేశినేని నాని ఆరోపించారు. ఖాతాలను ఫ్రీజ్ చేయండి.. ‘తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను, సామాన్య పౌరుల కష్టార్జితాన్ని కాపాడటానికి సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టులో ఎంపీ సిండికేట్ వేసిన ప్రైవేట్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేలా చర్యలకు అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించాలి. వివాదాస్పద 112.72 ఎకరాల భూమిని తక్షణమే హైడ్రా ఆధీనంలోకి తీసుకుని, అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన కుమారుడు వెంకట్ చౌదరి, ఇతరులపై క్రిమినల్ ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. సీఐడీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్, టీఎస్–రెరా ద్వారా సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు న్యాయం జరిగేలా సదరు కంపెనీలు, నిందితుల బ్యాంక్ ఖాతాలను తక్షణమే స్తంభింపజేయాలి..’అని నాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను హైడ్రా కమిషనర్, టీజీఐఐసీ ఎండీ, తెలంగాణ డీజీపీ, రెరా చైర్మన్లకు కూడా తదుపరి చర్యల కోసం పంపినట్లు నాని తెలిపారు. -
ఏపీలో మంత్రుల ఆండదండలతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
-
కబ్జా చేసి ప్రభుత్వానికే అమ్మేశారు..!
సాక్షి, చెన్నై: ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేయడమే కాకుండా రహదారి పనులకు ఆ స్థలాల్ని అప్పగించి నష్ట పరిహారంగా రూ. 200 కోట్లను ఓ రియల్టర్ మింగేశాడు. ఇద్దరు అధికారుల చేతి వాటంతో ఈ వ్యవహారం సాగి ఉండటంతో కేసును సీబీఐకు సిఫారసు చేస్తూ రెవెన్యూ కమిషనర్ పంకజ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. చెన్నై నుంచి పూందమల్లి– శ్రీపెరంబదూరు – కాంచీపురం – వేలూరు మీదుగా బెంగళూరు వైపు జాతీయ రహదారి సాగుతున్న విషయం తెలిసిందే. ఈ రహదారి పనులకు గతంలో స్థల సేకరణ జరిగింది. స్థలాల్ని ఇచ్చిన వారి నష్ట పరిహారాల చెల్లింపులు కూడా జరిగాయి. ఇందులో ఓ రియల్టర్ అధికారులతో కలిసి మాయాజాలం చేసి ఉండటం తాజాగా వెలుగులోకి వచ్చింది. రహదారి పనులకు, ఆ తదుపరి విస్తరణ పనులకు అంటూ సాగిన స్థల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున మోసం జరిగి ఉన్నట్టు తాజాగా బయట పడింది. శ్రీపెరంబదూరు ఆర్టీఓగా ఇటీవల చార్జ్ తీసుకున్న వెంకటేషన్ పరిశీలనలో స్థల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికే అమ్మి రూ. 200 కోట్లు శ్రీపెరంబదూరు సమీపంలోని బీమన్ తాంగల్ వద్ద ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికే అమ్మి ఉండటం ఆ పరిశీలనలో తేలింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ రహస్యంగానే సాగింది. శ్రీపెరంబదూరులో ఆర్టీఓగా పనిచేసి పదవీ విరమణ పొందిన రాధాకృష్ణన్, పూందమల్లి సెటిల్మెంట్ అధికారి షణ్ముగం గారడి బయట పడింది. ఈ ఇద్దరి రియల్టర్ అశీష్ మెహత ద్వారా తమ వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేయడమే కాకుండా, వాటిని ఆశీష్ మెహత పేరిట మార్చేసి, సెటిల్ మెంట్ సమయంలో సర్వే నెంబర్లను మార్చేసి పెద్ద మాయాజాలమే సృష్టించి ఉండడం బయట పడింది. అంతే కాదు, శ్రీ పెరంబదూరు పరిధిలో జాతీయ రహదారి ఆశీష్ మెహత అనేక చోట్ల స్థలాల్ని కేటాయించి ఉండటం, తద్వారా రూ. 200 కోట్లను నష్ట పరిహారంగా ప్రభుత్వం నుంచి తీసుకుని ఉండటం వెలుగు చూసింది. దీంతో ఈ వ్యవహాన్ని సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విచారణలో తమకు లభించిన ఆధారాలు, సమగ్ర వివరాలను సీబీఐకి పంపుతూ, ఈ కేసు విచారణకు స్వీకరించాలని రెవెన్యూ కమిషనర్ పంకజ్‌కుమార్ కోరడం గమనార్హం. చదవండి: చెన్నైలో రూ.70 కోట్ల హెరాయిన్ స్వాధీనం -
భూరాబంధులు
రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఈనాం, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పలుకుబడి ఉన్నవారు దొంగ సర్వే నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించి దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఇదేవిధంగా నగరం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విలువైన భూములపై భూ రాబందులు స్వైరవిహారం చేస్తున్నాయి. నకిలీ దస్తావేజులతో కోట్లాది రూపాయల విలువైన భూములను హస్తగతం చేసుకున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిస్తున్న దాఖలాలు కానరావడంలేదు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆవ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చదరపు గజం ధర ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉంది. ఇక్కడే వెంకటేశ్వర హోల్‌సేల్ మార్కెట్ కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూమి బంగారంతో సమానం. దీంతో కొంతమంది బడాబాబుల కన్ను ఈ భూములపై పడింది. అంతే.. సర్వే నంబర్ 327గా ఉన్న ఈ భూములకు అనుబంధంగా 612, 613, 614, 617, 618 సర్వే నంబర్లతో నకిలీ దస్తావేజులు సృష్టించి ఈ భూములను ఆక్రమించారు. వీరిలో ఓ మాజీ శాసనసభ్యుడు, నగరంలోని ప్రముఖ ఎముకల డాక్టర్, రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు, ఇతర ‘పెద్దలు’ ఉన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 87.87 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ వందల కోట్లు ఉంటుంది. వీటిల్లో అత్యధిక భాగం ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది. వెంకటేశ్వర జనరల్ మార్కెట్ వెనక ఆక్రమణలో ఉన్న భూములు ఆ భూముల కథ ఇదీ.. బ్రిటిషు వారి హయాంలో సర్వే నంబర్ 327, 330, 332, 465తో పాటు ఇంకా అనేక సర్వే నంబర్లలోని భూములను దేవాదాయ, ఈనాం కింద పలువురికి కేటాయించారు. ఈ సర్వే నంబర్లలో దాదాపు 22 ఎకరాలను షాహీ ఈనాం కింద ప్రథమ ఈనాందారు ఖాజా జహురుల్లా కుమారుడు దబీర్ మహ్మద్ గాలబ్, ఆయన కుమారులకు శాశ్వత వంశపారంపర్యంగా వచ్చింది. 1902 వరకూ రెవెన్యూ పత్రాల్లో వారి పేర్లున్నాయి. గోదావరికి పలుమార్లు వచ్చిన వరదల వల్ల ఆ భూములు మునిగిపోయాయి. బీఎస్ నంబర్లు 315, 316, 317, 318, 319, 332ఏ, 334, 342లలోని టైటిల్ డీడ్ భూములు, బీఎస్ నంబరు 333బి జిరాయితీ డ్రై, 317ఏ కాలువ, 315 కుంట, 333ఎ, బి ఆవ వెరసి.. 87.87 ఎకరాల భూమిలో దుబ్బు పెరిగిపోయింది. దీంతో వాటిని కొలవడానికి వీలులేదని విలేజ్ నంబర్ 66 డైగ్లాడ్(పాత రికార్డు)లో స్పష్టంగా పేర్కొన్నారు. అందుచేత ఈ సర్వే నంబర్లలోని 87.87 ఎకరాల భూమిని సర్వే నంబర్ 327గా నమోదు చేసినట్లు చూపారు. ఇదే ఆక్రమణదారులకు అవకాశంగా మారింది. ఆ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి, రకరకాల డివిజన్లు సృష్టించి, ఆ భూములను యథేచ్ఛగా ఆక్రమించారు. సర్వే నెంబర్ 327/11లో 2.2 ఎకరాల భూమి తమవని హెచ్చరిక బోర్డు పెట్టిన ఆక్రమణదారులు కల్లుగీత సొసైటీ భూముల కబ్జా సర్వే నంబర్ 327లో సుమారు 16 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో కల్లుగీత కార్మికుల సొసైటీకి కేటాయించారు. వాటిపై దాదాపు 20 కుటుంబాలు ఆధారపడి జీవించేవి. అయితే ఈ భూములను ఓ మాజీ శాసనసభ్యుడు ఆక్రమించాడు. ఆయా భూములను క్రమబద్ధీకరించుకునేందుకు వివిధ కోర్టుల్లో దావాలు వేయగా అవన్నీ సదరు మాజీ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో సొసైటీ వారు, వారి వారసులు తమకు కేటాయించిన 16 ఎకరాలూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. కొంతమంది అధికారులు ఆ మాజీ శాసనసభ్యుడికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై సొసైటీ సభ్యులు, ఈనాం భూముల వారసుదారులు కలిసి ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా అతీగతీ లేదు. తమకే ఇవ్వాలంటున్న బాధితులు 1902 రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 327లో 8.88 ఎకరాలు దబీర్ ఇమామ్ మొహిద్దీన్, కాశిమ్ సాహెబ్, ఫకీర్ సాహెబ్, మరో ముగ్గురికి కేటాయించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూములను సర్వే చేసి తమకు అప్పగిచాలని 1998లో వారి వారసులు జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్ ఏడున ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా దీనిపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 2000 సంవత్సరంలో చలనా కూడా తీశారు. వారసుల వద్ద పత్రాలు తీసుకున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. 2015లో ‘మీ ఇంటికి – మీ భూమి’లో దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి పురోగతీ లేదు. ఆక్రమణదారుల నుంచి ఈనాం, దేవాదాయ భూములను కాపాడాలని, తమ భూములను తమకు కేటాయించాలని హక్కుదారులు విజ్జప్తి చేస్తున్నారు. భూ రికార్డులు గందరగోళం ఆవలో మొత్తం విస్తీర్ణం 87.87 ఎకరాలు. ఆ భూమిలో నీరు చేరి ఉండడం వల్ల కొలవడానికి వీలు లేకుండా ఉందంటూ రికార్డుల్లో ఉంది. అక్కడ అనేక వివాదాలున్నాయి. సర్వే నంబర్లు సబ్ డివిజన్ అయ్యాయి. సర్వే నంబర్ 327లో 19.20 ఎకరాలు వెబ్లాండ్ రికార్డు ప్రకారం ఇళ్లస్థలాలుగా కనిపిస్తోంది. 87.87 ఎకరాలపై పూర్తిస్థాయిలో సర్వే చేస్తేనే కానీ ఎవరి భూమి ఎవరిదో చెప్పలేం. అక్కడ ఒక్కో సర్వే నంబర్లోని భూమిపై నాలుగైదు యాజమాన్య హక్కు పత్రాలున్నాయి. – కె.పోశయ్య, తహసీల్దార్, రాజమహేంద్రవరం రూరల్ -
పరిహారం చెల్లించకపోతే.. రైలు వారిదే..
సొంతంగా కార్లు, బస్సులు, విమానాలు ఉన్నావారిని చూశాం. సొంతంగా రైలు ఉన్న వారినెక్కడైనా చూశారా. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మేలా రాం, మదన్ లాల్ అనే ఇద్దరు రైతులకు సర్కారీ రైలును దక్కించుకునే ఛాన్స్ వచ్చింది. అయితే వారి ట్రైన్ దక్కుతుందా, లేదా అనేది రైల్వేశాఖపై అధారపడివుంది. అన్నీ సవ్యంగా జరగకపోతే ఈ ఇద్దరు రైతులకు రైలు యోగం పట్టనుంది. అవును నిజమే... ఏప్రిల్ 16వ తేదీలోపు బాధిత రైతులిద్దరికీ పరిహారం చెల్లించడంలో రైల్వే శాఖ విఫలమైతే ఢిల్లీ - యున జనశతాబ్ది రైలు వారి సొంతమవుతుందని కోర్టు తీర్పు చెప్పింది. రైల్వేట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు సుమారు రూ. 35 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒక వేళ గడుపులోపు ఆ మొత్తాన్ని చెల్లించడంలో రైల్వే శాఖ విఫలమైతే ఢిల్లీ - యున జనశతాబ్ది రైలును ఆ ఇద్దరి రైతులకు అప్పగించాలని చేయాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెడితే యునా జిల్లాకు వీరు 1998 లో జరిగిన రైల్వే ట్రాక్ నిర్మాణంలో రామ, మదన్ లాల్ భూములను కోల్పోయారు. దీంతో తమ భూములను కోల్పోయామని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతో కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై 2009లో రామ్ కు ఎనిమిది లక్షలు, మదన్ లాల్ కు సుమారు 27 లక్షల పరిహారం చెల్లించాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇంత భారీ పరిహారం చెల్లించలేమంటూ రైల్వే అధికారులు అప్పీలు కెళ్లారు. దీంతో పరిహారాన్ని తగ్గిస్తూ 2011లో తీర్పు వెలువడింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు కెళ్ళారు రైతులు. అయితే ఈ తీర్పుపై స్టే విధించిన హైకోర్టు , దీనిపై మూడు నెలల్లోపు అప్పీలు చేసుకునే అవకాశంతో పాటు, ఆరువారాల్లో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా 2013లో రైల్వే శాఖను ఆదేశించింది. కానీ ఇప్పటికీ ఆ డబ్బును డిపాజిట్ చేయడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.దీంతో ఆగ్రహించిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించడంలో జరుగుతున్న జాప్యంపై మళ్ళీ కోర్టుకెళ్లారు. దీనిపై స్పందించిన యునా జిల్లా అడిషనల్ , సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ బన్సాల్ ఈ అరుదైన తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 16 వ తేదీలోపు సుమారు రూ. 35 లక్షల పరిహారం రైల్వే శాఖ చెల్లించాలని లేనిపక్షంలో ఏప్రిల్ 16 నుంచి రైలు ను నిలిపివేయాలని ఆదేశించింది. ఢిల్లీ - యున జనశతాబ్ది రైలు ఆ ఇద్దరి రైతుల సొంతమవుతుందని కోర్టు తేల్చి చెప్పింది.


