breaking news
Lakhipur
-
అసోంలో ఇద్దరు వారసులు గెలుపు
గుహవాటి: అసోంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇద్దరు 'వారసులు' విజయం సాధించారు. రెండు రాజకీయ పార్టీలకు చెందిన వారసులు గెలుపొందారు. జనముఖ్ స్థానం నుంచి పోటీ చేసిన అబ్దుర్ రహీం అజ్మాల్ గెలుపొందారు. ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) బద్రుద్దీన్ తనయుడైన అబ్దుర్ రహీం తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి నెగ్గారు. లఖీపూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రాజ్‌దీప్ గోయల కూడా బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. తన తండ్రి దినేష్ ప్రసాద్ మరణంతో రాజ్‌దీప్ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. -
అసోంలో ఏఐయూడీఎఫ్ ముందంజ
గౌహతి : అసోం రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అయితే రెండు స్థానాలలో ఏఐయూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉండగా మరో స్థానంలో బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోని మూడు శాసనసభ నియోజకవర్గాలైన సిల్చెర్, జమునాముఖ్, లక్ష్మీపూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ మూడు నియోజకవర్గాలలో మొత్తం 25 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మరికాసేపట్లో ఎవరి భవితవ్యం ఏమిటనేది తేలనుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలోని మూడు పార్లమెంట్ స్థానాలకు, 33 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఈ నెల 13న నిర్వహించారు. అందులోభాగంగా మంగళవారం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.