breaking news
Kurdish fighters
-
ఐసిస్ అధీనంలోని చివరి పట్టణం స్వాధీనం
బగ్దాద్: సంకీర్ణ సేనలతో పాటు కుర్దిష్ దళాల దాడులతో దెబ్బతిన్న ఉగ్రసంస్థ ఐసిస్‌కు మరో షాక్ తగిలింది. దేశంలో ఐసిస్ అధీనంలో ఉన్న చివరి పట్టణమైన ‘రవా’ను శుక్రవారం ఇరాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ‘భద్రతా బలగాలు రవాకు విముక్తి కల్పించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై ఇరాక్ జాతీయ జెండాను ఎగరవేశాయి’ అని సంయుక్త ఆపరేషన్స్ కమాండ్(జేఓసీ) జనరల్ అబ్దెలామీర్ యరల్లాహ్ ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, కుర్దిష్ దళాలు, రష్యా మద్దతు ఉన్న సిరియన్ సైన్యం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో ఇప్పటివరకు ఐసిస్ 95 శాతం భూభాగాన్ని కోల్పోయింది. -
పిల్ల టెర్రరిస్టుల చేత.....
పాల్మిరా: వాళ్లంతా 12,13 ఏళ్ల ప్రాయం పిల్లలే. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం ఏమీ తెలియని అమాయక బాలలే. అయినా చేతుల్లో పిస్టళ్లు పట్టుకున్నారు. వాటిని ఎదురుగా కనిపిస్తున్న తలలకు గురిచేసి పెట్టారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఒన్, టూ, త్రీ.....అనగానే టపా..టపా మంటూ 25 తలలను పేల్చేశారు. చిట్లిన తలల నుంచి రక్తం విరజిమ్ముతుండగా ఆ తలలు మొండాలతో సహా నేలకొరిగాయి. సిరియా ఎడారి ప్రాంతంలోని పాల్మిరా వద్ద ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆంపి థియోటర్ వేదికపై చోటుచేసుకున్న దృశ్యమిది. ప్రేక్షకుల గ్యాలరీలో ప్రజలు కూర్చొని తాపీగా ఈ దృశ్యాన్ని తిలకించారు. అంతమాత్రాన ఇది నాటకంలోని సన్నివేశం ఎంతమాత్రం కాదు. ఇది పిల్లల చేత సిరియా సైనికులకు ఐఎస్ఐఎస్ టైర్రరిస్టుల ప్రత్యక్షంగా మరణశిక్ష అమలు చేయించిన తీరిది. తాజాగా జరిగిన ఈ సంఘటనను టైర్రరిస్టుల తీరిగ్గా చిత్రీకరించి, ఆ వీడియోను వెబ్సైట్లకు విడుదల చేశారు. సిరియా సైనికుల ఆధీనంలోవున్న పాల్మిరా పట్టణాన్ని గత మే 21వ తేదీన ఐఎస్ఐఎస్ టైర్రరిస్టుల స్వాధీనం చేసుకున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 మంది సైనికులు, వారి మద్దతుదారులను ఇలా బహిరంగంగా భయంకరంగా మరణ శిక్ష విధించారు. తమలో చేర్చుకోవడం కోసం ఇప్పటి వరకు దాదాపు 500 మంది పిల్లలను టైర్రరిస్టుల కిడ్నాప్ చేశారని, ఆ కిడ్నాప్ చేసిన వారి నుంచి ఆయుధ శిక్షణ తీసుకున్న 25 మంది పిల్లలను ఎంపిక చేసి, వారి చేత ఈ దారుణమారుణ కృత్యాన్ని చేయించారని మానవ హక్కుల సంఘాలు తెలియజేశాయి. తమ వద్ద బందీలుగావున్న మిగతా పిల్లలను కూడా టైర్రరిస్టుల బ్రెయిన్ వాష్ చేస్తుండవచ్చని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.