Kumarimuthu
-
కమెడియన్ని హేళన చేశా.. ఆయన మాటలకు ఏడుపాగలేదు
దివంగత తమిళ హాస్య నటుడు కుమారిముత్తును వెక్కిరించి తప్పు చేశానంటోంది సీనియర్ నటి ఊర్వశి. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ నటి ఎంతోమంది యాక్టర్లతో కలిసి పని చేసింది. సహాయక పాత్రలతో పాటు కామెడీ పాత్రలు కూడా ఇట్టే చేయగలదు. అలా ఎంతోమంది కమెడియన్లతో కలిసి నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ కుమారిముత్తును అవమానించిన విషయం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది.ఆయనలా నటించా..ఒక సినిమాలో కుమారిముత్తుతో కలిసి నటించాను. ఆయనలా సరిగా కళ్లు కనిపించనట్లుగా యాక్ట్ చేయమన్నారు. నేనలాగే చేశాను. నా పాత్ర చూసి ప్రేక్షకులు ఎంతగానో నవ్వుకున్నారు. అయితే తర్వాత మాత్రం అది తప్పని తెలిసొచ్చింది. కుమారిముత్తు చాలా మంచి మనిషి. ఒకరోజు ఆయన్ని సరదాగా పలకరిస్తూ ఒకప్పుడు నువ్వు ఏమవ్వాలనుకున్నావు? అని అడిగాను.చదువు లేదుఅందుకాయన.. నేను పెద్దగా చదువుకోలేదు. చదువుకుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. చదువు లేకపోవడం వల్ల నేను కోరుకున్న ఏ ఉద్యోగమూ చేయలేకపోయాను. పోలీస్ అవ్వాలని ఆశపడ్డాను. కానీ చదువు లేదు, పైగా నాకు చూపు సరిగా కనిపించదు. ఒకసారి ఏమైందంటే డ్రైవింగ్ నేర్చుకుందామని క్లాసెస్‌కు వెళ్లాను. అక్కడ ఇన్స్ట్రక్టర్ నా కళ్లపై కుళ్లు జోకులు వేశాడు. రెండు కళ్లు బాగా కనిపిస్తున్నవాళ్లే సరిగా నడపలేకపోతున్నారు. నువ్వు చూస్తే గుడ్డివాడికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లే ఉన్నావు.. అలాంటిది డ్రైవింగ్ నేర్చేసుకుందామని వచ్చావా? అని హేళన చేశాడు. అప్పుడే డిసైడయ్యా..ఇక నువ్వు కూడా సినిమాలో నాలాగా సరిగా కళ్లు కనిపించనట్లు యాక్ట్ చేశావ్ అన్నాడు. అంతే.. అతడి మాటలు నా మనసుకు గట్టిగా తాకాయి. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను. బయటకు వెళ్లి మనసారా ఏడ్చేశాను. కొన్ని క్షణాలపాటు నవ్వుకోవడం కోసం ఎదుటివారిని హేళన చేయకూడదని నేర్చుకున్నాను. అయితే ఆ కంటి సమస్యే తన కడుపు నింపుతుందని కుమారిముత్తు అనేవాడు అని ఊర్వశి చెప్పుకొచ్చింది.చదవండి: డోలారే సాంగ్ షూటింగ్లో రష్మిక మందన్నా ప్రెగ్నెంట్? -
ప్రముఖ హాస్యనటుడి కన్నుమూత
చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు, డిఎంకె సభ్యుడు కుమారిముత్తు (77) కన్నుమూశారు. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. తనదైన నటనతో సినీఅభిమానులను ఆకట్టుకున్న ఆయన దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. ప్రత్యేక మేనరిజంతో, తనదైన నవ్వుతో పలు సినిమాల్లో హాస్యాన్ని పండించారు. 'ఇదు నమ్మ ఆలు', 'సహదేవన్ మహదేవన్' 'ఒరు ఊర్ల ఒరు రాజకుమారి, 'మరుమగన్' సినిమాలు ఆయన కెరియర్లో ప్రధానమైనవిగా నిలిచాయి. మూడు దశాబ్దాల పాటు సినీరంగానికి సేవలందించిన కుమారిముత్తు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ సభ్యుడిగా తమిళనాట రాజకీయాల్లోకి ఎంటరయ్యారు.


