ప్రముఖ హాస్యనటుడి కన్నుమూత | tamil actor Kumarimuthu is dead | Sakshi
Sakshi News home page

ప్రముఖ హాస్యనటుడి కన్నుమూత

Feb 29 2016 10:55 AM | Updated on Sep 3 2017 6:42 PM

ప్రముఖ హాస్యనటుడి కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడి కన్నుమూత

ప్రముఖ తమిళ హాస్య నటుడు, డిఎంకె సభ్యుడు కుమారిముత్తు (77) కన్నుమూశారు.

చెన్నై:  ప్రముఖ తమిళ హాస్య నటుడు, డిఎంకె సభ్యుడు  కుమారిముత్తు (77) కన్నుమూశారు.  ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన  ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని  సన్నిహిత వర్గాలు తెలిపాయి.


 తనదైన నటనతో సినీఅభిమానులను ఆకట్టుకున్న ఆయన  దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు.  ప్రత్యేక  మేనరిజంతో, తనదైన నవ్వుతో  పలు సినిమాల్లో  హాస్యాన్ని పండించారు.  'ఇదు నమ్మ ఆలు', 'సహదేవన్ మహదేవన్'  'ఒరు ఊర్ల ఒరు రాజకుమారి, 'మరుమగన్' సినిమాలు ఆయన కెరియర్లో ప్రధానమైనవిగా నిలిచాయి.  మూడు దశాబ్దాల పాటు సినీరంగానికి సేవలందించిన కుమారిముత్తు   ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ సభ్యుడిగా తమిళనాట రాజకీయాల్లోకి ఎంటరయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement