breaking news
kottagattu
-
మత్స్యరూపం.. శుభ సంకల్పం
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం తెలంగాణలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచింది. చుట్టూ ఎత్తయిన గుట్టలు, పచ్చని పంట పొలాలు.. మధ్య కొత్తగట్టు. ఆ గుట్టపై మత్స్యగిరీంద్రస్వామి ఆలయం. దీన్ని వందల ఏళ్ల కిందట నిర్మించినదిగా చెబుతారు. స్వామివారి దర్శనంతో భక్తులు పునీతమవుతున్నారు. కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి పక్కన కరీంనగర్‌కు 30 కి.మీ., వరంగల్‌కు 40 కి.మీ. దూరంలో ఉంది. విష్ణుమూర్తి మత్స్యగిరీంద్ర స్వామి అవతారానికి ప్రతీకగా గుడిలోని గుహలో వెలసిన చేప భక్తులకు దర్శనమిస్తోంది. గుహలో చేప అవతారం సృష్టికి మూలమైన చతుర్వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు తస్కరించి సప్త సముద్రాల అవతల దాక్కున్నాడని, చతుర్వేదాలను పరిరక్షించేందుకు విష్ణుమూర్తి మత్స్యవతారంలో సముద్రాలను దాటి చతుర్వేదాలను పరిరక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి మత్సా్యవతారం ధరించాక కొత్తగట్టు గుట్టపై గుహలో చేప ప్రతిరూపంతో వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. గుహలో చేప ప్రతి ఇప్పటికీ ఉండగా అద్దం ఏర్పాటు చేసి ప్రతిబింబాన్ని భక్తులు వీక్షిస్తారు.ఆలయ ఉత్సవాలు.. ఆలయంలో మత్స్యగిరీంద్రస్వామి, నర్సింహస్వామి, గుట్టపై ఆంజనేయస్వామి, శివాలయం, కోనేరు ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. ఏటా మాఘమాసంలో మత్స్యగిరీంద్రస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భీషే్మకాదశి సందర్భంగా భూదేవి, నీలాదేవి సహ స్వామివారి కల్యాణం వైభవంగా జరుపుతారు. మాఘపౌర్ణమి సందర్భంగా జాతర, నాకబలి (పుష్పయాగం), కోనేరులో చక్రస్నానం వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహిస్తారు. అనుబంధ ఆలయాల్లో హనుమాన్ జయంతి, నర్సింహ జయంతి, మహాశివరాత్రి, జాగరణ, శివకల్యాణం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.పోలు దండ వేసుకుంటే సంతానం.. సంతానం కలుగని దంపతులు నాకబలి రోజు పోలు దండలు వేసుకుంటే సంతానం కలుగుందని భక్తుల విశ్వాసం. ధ్వజారోహణం రోజు గరుడ ముద్దల కోసం భక్తులు ఎగబడతారు. గరుడ ముద్దల ప్రసాదం దక్కిన భక్తులకు స్వామివారు, అమ్మవారి చల్లని దీవెనలు ఉంటాయన్న నమ్మకంతో పాటు సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది.శేషం వంశస్తుల పూజలు మత్స్యగిరీంద్రస్వామికి శేషం వంశస్తులు 11 వందల ఏళ్లుగా స్వామివారిని పూజిస్తున్నట్లు స్థల పురాణం చెబుతోంది. ధూప, దీప, నైవేద్యం, బ్రహ్మోత్సవాల ప్రధాన అర్చకులు శేషం మురళీధరాచార్యులు సమక్షంలో జరుగుతున్నాయి.పోచమ్మను దర్శించుకుని గుట్టపైకి.. గుట్టకింద పోచమ్మ ఆలయంలో దర్శనం చేసుకుని ఘాట్‌రోడ్డుపై నుంచి ఆలయం చేరుకోవాలి. కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు మత్స్యగిరీంద్రస్వామి, చేప ప్రతిమను దర్శించుకుంటారు. పక్కనే ఉన్న నర్సింహస్వామికి పూజలుచేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఆంజనేయస్వామి, శివాలయంలో శివుడికి పూజలు చేస్తారు.చదవండి: ఆనంద ద్వీపం.. అభివృద్ధికి ఆమడ దూరంసాగని అభివృద్ధి.. తెలంగాణలో ఏకైక మత్స్యగిరీంద్రస్వామిగా ప్రసిద్ధి చెందిన కొత్తగట్టు ఆలయ ప్రాకారం నిర్మాణం 12 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. ఏడాది కిందట గాలిగోపురం నిర్మాణానికి దాతలు కాంట్రిబ్యూషన్ చెల్లించినా.. పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కల్యాణ మండపం, ఆంజనేయస్వామి, పోచమ్మ ఆలయాలను దాతలు నిర్మించారు. ప్రత్యేక ఆకర్షణగా భారీ విగ్రహం ఎన్హెచ్ఏ–563 రహదారి టోల్గేట్ కొత్తగట్టు ఆలయం వద్ద నిర్మిస్తున్నారు. భారీ మత్స్యగిరీంద్రస్వామి విగ్రహాన్ని కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన గుట్టపై ఓ భక్తుడు నిర్మిస్తున్నారు. దీంతో ఈ విగ్రహం విద్యుత్ దీపాల కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పోలు దండలు వేసుకుంటే సంతానం ధ్వజారోహణం రోజు గరుడ ముద్దల ప్రసాదం స్వీకరించి, నాకబలి రోజు సంతానం కలుగని దంపతులు పోలు దండలు వేసుకుంటే సంతానం కలుగుతుందనేది ప్రగాఢ నమ్మకం. ఇలా చేసిన అనేకమంది దంపతులకు సంతానం కలిగింది. కోనేరులో పవిత్రస్నానాలు చేసి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. పంటలకు చీడపీడలు సోకితే కోనేరులో నీటిని చల్లుకుంటే వాటి ఉధృతి తగ్గుతుందని రైతులకు నమ్మకం. – శేషం మురళీధరాచార్యులు, ప్రధాన అర్చకుడు, మత్స్యగిరీంద్రస్వామి ఆలయం, కొత్తగట్టు -
3 ఏళ్లుగా చెరువులో చేపలు మాయం.. కారణమేమిటంటే
శంకరపట్నం: మూడేళ్లుగా చెరువులో చేపలు మాయమవుతున్నాయి. ప్రభుత్వం వేసిన చేప పిల్లలు కొద్దిగా పెద్దవి అవుతున్నాయో లేదో.. అప్పుడే చెరువులో కనిపించకుండా పోతున్నాయి. దీంతో వాటిని నమ్ముకుని వ్యాపారం చేద్దామనుకున్న మత్య్సకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులో చేపల మాయంపై మత్య్సకారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా చేపల దొంగలను పట్టుకోవాలని కష్టపడి గస్తీ కాశారు. ఫలితంగా దొంగలు చిక్కారు. చేపలు దొంగతనం చేస్తున్న ముఠా ఎట్టకేలకు గ్రామస్తులకు చిక్కడంతో వారు పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చెరువులో మూడేళ్లుగా చెరువులో వేసిన చేపలు మాయమవుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన మత్స్యకారులు చెరువుపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు రాత్రిపూట నిఘా పెట్టడంతో చేపలు దొంగిలిస్తున్న ఏడుగురి కనిపించారు. వారిని వెంటపడగా నలుగురు మత్స్యకారులకు చిక్కారు. ముగ్గురు పారిపోయారు. ఆ నలుగురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారిలో కొత్తగట్టుకు చెందిన నలుగురితో పాటు రేకొండ కమలాపూర్‌కు చెందిన మరో ముగ్గురు చేపల దొంగతనానికి పాల్పడుతున్నారని మత్స్యకారుల సంఘం ప్రతినిధి ప్రభాకర్ తెలిపారు. చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు కొత్తగట్టు చెరువు వద్ద దొంగలకు దేహశుద్ధి చేస్తున్న మత్స్యకారులు -
ఆ యువతీ యువకులది ఆత్మహత్యేనా!
దైవదర్శనం కోసం వెళ్లిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు అనుమానాస్సద రీతిలో ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పడి మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండటం కొత్తగట్టులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దక్షిణ భారతంలోనే మొట్టమొదటి వైష్ణవ క్షేత్రంగా పేరొందిన శ్రీమత్స్యగిరీంద్రస్వామి దర్శనం కోసం కొత్తగట్టుకు వచ్చిన ఈ నలుగురి మరణవార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిని కరీంగర్‌లోని కోతిరాంపూర్ కాలనీకి చెందిన కొత్తపల్లి కిరణ్ (22), గెర్రె శ్రీధర్ (22), కిషన్పూర్కు చెందిన గుగ్గిళ్ల వాహిని (21), లింగంపల్లి స్వప్న (21)గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. కోనేరు గట్టుపై పడిఉన్న నాలుగు సెల్ ఫోన్లు, ఐడీ కార్డుల ఆధారంగా మృతుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. అయితే వీరు కోనేరులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందారా? అన్నది తెలియరాలేదు. చనిపోయిన నలుగురూ.. రెండు బైకులపై వచ్చినట్లు స్థానికులు చెప్పారు. అంతకుముందు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం శవాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.