Kolleru Village
-
AP: దేశంలో పెద్ద మంచినీటి సరస్సు మన రాష్ట్రంలోనే.. ప్రత్యేకతలివే!
అరుదైన చేపలకు జన్మస్థలం... వలస పక్షులకు ఆవాసం... మూడున్నర లక్షల మందికి నివాసం...పెద్దింట్లమ్మ కొలువు దీరిన పుణ్యక్షేత్రం... మన కొల్లేరు. 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి దేశంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుగా... జీవవైవిధ్యానికి జలతారుగా కొల్లేరు ప్రత్యేకతను సంతరించుకుంది. ఉప్పునీటిని, మురుగునీటిని తనలో ఇముడ్చుకుని... తనను నమ్మి వచ్చిన పక్షులు, మనుషులు... ఒకటేమిటి సకలజీవరాశులను అక్కున చేర్చుకుని స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందిస్తోంది. ఘన చరిత్రకు ఆనవాళ్లు.. మూడో శతాబ్దం నుంచి ఈ సరస్సు పురాతన గ్రంధాల్లో ఉంది. కొల్లేరుపై పట్టు కోసం పూర్వం రాజుల మధ్య యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్.. వెంగీ నగరంతోపాటు కొల్లేరును దర్శించినట్టు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇక కొల్లేరును నూజివీడు జమీందార్లు తమకు విశ్వాసంగా ఉండే ‘కామదాన’ కుటుంబానికి దానం ఇచ్చినట్టు చెబుతారు. సరస్సులో ఊళ్లు ఎలా వెలిశాయంటే.. వరుస యుద్ధాల కారణంగా 17వ శతాబ్దంలో ఒడిశాలో తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో అక్కడి వడ్డెర కులాలకు చెందిన పలు కుటుంబాలు జీవనాధారం వెదుక్కుంటూ వలస వెళ్లాయి. ఆ క్రమంలో సుమారు 10 కుటుంబాలు కొల్లేరు ప్రాంతానికి వచ్చాయి. సరస్సు మధ్యలో మట్టి దిబ్బలపై గుడిసెలు వేసుకుని చేపలను వేటాడి తింటూ జీవనం గడిపేవారు. ఆ తర్వాత పచ్చి, ఎండు చేపల విక్రయం ద్వారా జీవనోపాధి పొందారు. క్రమంగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పక్క గ్రామాల దురాక్రమణ నుంచి తమను కాపాడుకోవడానికి పలు సందర్భాల్లో కత్తులు, బరిసెలతో గ్రామాల మధ్య హోరాహోరీ యుద్ధాలు జరిగేవి. సుమారు 30 ఏళ్ల క్రితం ప్రత్తికోళ్లలంక, పందిరిపల్లిగూడెం గ్రామాల మధ్య సరిహద్దు విషయమై రెండు పర్యాయాలు జరిగిన పోరులో సుమారు 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇటువంటి కొట్లాటలు ఎన్నో కొల్లేరులో జరిగాయి. తొలినాళ్లలో రవాణాకు తాటిదోనెలను వాడేవారు. ఆ తర్వాత నాటు పడవలు, లాంచీలు వినియోగించేవారు. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చెందడంతో వాహనాలు ఉపయోగిస్తున్నారు. కొల్లేరుపై ఆధారపడి జీవించే ప్రజలు చేపలను వేటాడి విక్రయిస్తుంటారు. పర్యాటకంతో కొత్త అందాలు కొల్లేరును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొల్లేరులో కొలువైన పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం, రోడ్లు, వంతెనల అభివృద్ధి, అటపాక పక్షుల కేంద్రాన్ని తీర్చిదిద్దడం, ఉప్పుటేరుపై అక్విడక్ట్‌ల నిర్మాణం వంటి అనేక పనులు వేగంగా జరుగుతున్నాయి. కొల్లేరులో అతిథి గృహాలు, రిసార్టులు, బోట్ షికారు వంటివి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. వలస పక్షులకు పుట్టిల్లు.. ► సైబీరియా, ఆ్రస్టేలియా, నైజీరియా వంటి అనేక దేశాల నుంచి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వలస పక్షులు ఇక్కడికి వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ► గతంలో వలస పక్షులకు తోడు స్థానిక పక్షులన్నీ కలిపి 189 రకాలు కొల్లేరుపై ఆధారపడి జీవించేవి. ఇప్పుడు సుమారు 73 రకాల పక్షులున్నట్టు లెక్కతేల్చారు. ► కైకలూరు సమీపంలోని అటపాక పక్షుల విహార కేంద్రం వద్ద శీతాకాలంలో పెలికాన్, పెయింటెడ్ సాŠట్క్ వంటి విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి. ► కొల్లేరులో దాదాపు 140 రకాల చేప జాతులు ఉన్నట్టు అంచనా. ► అరుదైన నల్ల జాతి చేపలు ఇక్కడే పురుడుపోసుకున్నాయి. ► మార్పు, కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ, ఇసుక దొందులు వంటి చేపలు ఇక్కడ పుట్టినవే. కొల్లేరు విస్తరణ ఇలా.. ► ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న తొమ్మిది మండలాల్లో 77,138 ఎకరాల్లో విస్తరించింది. ► సుమారు 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయి. వాటిలో సుమారు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. ► అతిపెద్ద మంచినీటి (చిత్తడి నేలల) సరస్సుగా 1971లో ఇరాన్‌లోని రాంసార్ సదస్సు తీర్మానించింది. ► 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు ఈ సరస్సులోకి చేరుతుంది. ► ఉప్పుటేరు ద్వారా కొల్లేటి నీరు సముద్రంలో కలుస్తుంది. -
కొల్లేరులో వలస పక్షుల సందడి
కైకలూరు(ఏలూరు జిల్లా): కిక్కిస పొదలు.. అందమైన జలదారుల నడుమ ప్రకృతి పంపిన రాయబారులు రాజహంసల్లా సందడి చేస్తున్నాయి. వలస పక్షులతో కొల్లేరు కళకళలాడుతోంది. శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి వలస పక్షులు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతానికి చేరుకున్నాయి. అందరికీ విదేశీ పక్షులుగానే కనిపించే.. ఈ విహంగాలు కొల్లేరు ప్రాంత వాసులకు మాత్రం ఇంటి ఆడపడుచులుగా ఏటా ఇక్కడకు విచ్చేస్తాయి. 6 లక్షల పక్షుల రాక రాష్ట్రంలో కొల్లేరు అభయారణ్యం 77,185 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా కొల్లేరుకు దాదాపు 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. అక్టోబర్‌లో వలసబాట పట్టే ఈ విహంగాలు ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో తిరిగి పయనమవుతాయి. కొల్లేరు అభయారణ్యంలో 190 జాతులకు చెందిన పక్షులు జీవనం సాగిస్తున్నాయి. ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్ పక్షులు వేలాదిగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగు వారాలుగా పక్షుల లెక్కింపు జరుగుతోంది. డిసెంబర్ రెండో వారానికి దాదాపు స్వదేశీ, విదేశీ పక్షులు 5 లక్షల 20 వేలను గుర్తించారు. ఏటా శీతాకాలంలో విదేశీ వలస పక్షులు 6 లక్షలు, స్వదేశీ పక్షులు 3.50 లక్షల వరకు గుర్తిస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లేరు ప్రాంతంలో స్పాట్ బిల్డిన్ పెలికాన్, కామన్ శాండ్‌పైపర్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, గ్లోబీ ఐబీస్, పెయింటెడ్ స్టార్క్, రివర్ టర్న్, జకనా, లార్జ్ విజిటింగ్ డక్, ఓరియంటల్ డాటర్, కామన్ రెడ్ షంక్ వంటి 43 రకాల వలస పక్షులను ప్రస్తుతానికి అటవీ సిబ్బంది గుర్తించారు. వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది ప్రకృతి అనుకూలించడంతో కొల్లేరుకు వచ్చే వలస పక్షుల సంఖ్య పెరుగుతోంది. ఏటా 6 లక్షల విదేశీ పక్షులు వలస వస్తుండగా.. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పక్షుల గణన జరుగుతోంది. పక్షుల ఆవాసాల కోసం అటవీ శాఖ కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేస్తోంది. – ఎస్వీకే కుమార్, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ రేంజర్, ఏలూరు -
కొల్లేరు గ్రామాల్లో సరికొత్త మార్పు..
కైకలూరు: కొల్లేరు గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది. గతంలో ఇక్కడి ప్రజల అమయాకత్వాన్ని ఆసరా చేసుకుని టీడీపీ నాయకులు అభయారణ్యాన్ని అందినకాడికి దోచుకున్నారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. దీంతో కొల్లేరు లంక గ్రామాలు సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుని కృతజ్ఞత తెలుపుతున్నాయి. భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. రాష్ట్రంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. దాదాపు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంగా 5 కాంటూరు వరకు 77,138 ఎకరాలు గుర్తించారు. వీటి పరిధిలో 122 పరివాహక గ్రామాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో కొల్లేరు గ్రామాలన్నీ ఏలూరు జిల్లా గూటికి చేరాయి. కొల్లేరు ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ళ పాలన చూసి తమ గ్రామాలను సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుంటున్నాయి. ఇందుకు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నాంది పలికింది. కైకలూరు మండలం శృంగవరప్పాడు, చటాకాయి, పందిరిపల్లిగూడెం, మండవల్లి మండలం కొవ్వాడలంక, చింతపాడు, పులపర్రు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు గ్రామంలో ఘన స్వాగతం పలికి, ముకుమ్మడిగా వైఎస్సార్సీపీలో చేరారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ ప్లీనరీకి కూడా వేలాదిగా కొల్లేరు ప్రజలు హాజరవడం విశేషం. గడప గడపకు కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. కొల్లేరు ప్రజలకు మేలు ఇలా.. స్వచ్ఛ కొల్లేరు సాకారంలో భాగంగా ఉప్పుటేరుపై రూ.412 కోట్లతో మూడు రెగ్యులేటర్లు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. ఇదే జరిగితే సముద్రపు ఉప్పునీరుని అరికట్టడంతో పాటు కొల్లేరులో నిత్యం నీరు ఉంటూ చేపల వేటకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ డెవలప్మెంటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్‌పర్సన్‌గా సైదు గాయత్రీ సంతోషికి అవకాశం కల్పించారు. రూ.4 కోట్లతో కొల్లేరు రీ సర్వేకు సిద్ధం చేశారు. కొల్లేరు కాంటూరు వారిగా సర్వే పూర్తయితే 70 వేల ఎకరాలు మిగులు భూమిగా వెల్లడవుతుంది. ఇక బాహ్యప్రపంచానికి కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసే కొల్లేటికోట పెద్దింట్లమ్మ వారధిని రూ.14.70 కోట్లతో చేపట్టారు. కులమతాలకు అతీతంగా పథకాల లబ్ధి పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను కొల్లేరు లంక గ్రామాల్లో అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. కొల్లేరుకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మోసం చేశాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు. సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా మరిన్ని మారడానికి సిద్ధంగా ఉన్నాయి. – దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఎమ్మెల్యే కొల్లేరుకు న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం కొల్లేరు ప్రాంత ప్రజలకు నిజమైన న్యాయం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుంది. ఒక మహిళగా నాకు రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. గతంలో ఈ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే మా సామాజికవర్గం అయినా కనీసం గ్రామాలను పట్టించుకోలేదు. రానున్న రోజుల్లో అన్ని కొల్లేరు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారతాయి. – సైదు గాయత్రీ సంతోషి, రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ వైఎస్సార్సీపీపై పూర్తి నమ్మకం ఉంది సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కొల్లేరు గ్రామాల్లో పర్యటించి మా సమస్యలు తెలుసుకుంటున్నారు. మా గ్రామల్లో అందరికి పథకాలు చేరుతున్నాయి. ఇటీవల కొల్లేరులో వేటకు కొత్త లైసెన్సు ఇచ్చారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించారు. వైఎస్సార్సీపీపై పూర్తి నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నాం. – జయమంగళ తిరుపతి వెంకన్న, సర్పంచ్, కొవ్వాడలంక, మండవల్లి మండలం -
నిప్పు రాజేసిందెవరు ?
-
నిప్పు రాజేసిందెవరు ?
భయంగుప్పెట్లో ప్రత్తికోళ్లలంక ప్రజలు ఊరు వదిలి వెళ్లిపోయిన పురుషులు దాడులకు సంబంధించి 53 మంది అరెస్ట్ కొల్లేరు గ్రామమైన ప్రత్తికోళ్లలంక ప్రజలు ఒకప్పుడు ఒకే మాట.. ఒకే బాటగా ఉండేవారు. కట్టుబాట్లతో కలిసిమెలిసి జీవించారు. గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నారు. అంత ఐక్యతగా ఉండి ఇతర గ్రామాలకు రోల్‌మోడల్‌గా నిలిచిన వారే నేడు వర్గాలుగా చీలిపోయి ఎదురుపడితే కత్తులు దూసుకుంటున్నారు. ఊరిలో ఉండలేక భయంతో పక్క ఊళ్లో తలదాచుకుంటున్నారు. మూడేళ్లుగా ఆందోళనలు, దీక్షలు అంటూ రోడ్డున పడ్డారు. ఇన్ని మార్పులకు కారకులు ఎవరు? ఐక్యతతో కలిసిమెలిసి జీవించిన ఆ గ్రామ ప్రజల మధ్య నిప్పు రాజేసిందెవరు? ఏలూరు రూరల్ : కొల్లేరు గ్రామం ప్రత్తికోళ్లలంక నేడు జిల్యావ్యాప్తంగా చర్చనీయూంశంగా మారింది. గురువారం జరిగిన ఘటనతో గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో మగాళ్లు పక్క ఊళ్లకు వెళ్లి తలదాచుకున్నారు. పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గురువారం నాటి దాడులకు సంబంధించి ఇప్పటికే 53 మందిని అరెస్ట్ చేశారు. నేడు ఊళ్లో కొద్దిమంది ఆడవాళ్లు మాత్రమే మిగిలారు. వివాదానికి ఆజ్యం పోసిన ప్రజాప్రతినిధి గ్రామంలో జరిగిన హింసాత్మక ఘటనలకు అధికారులు, పోలీసులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ సర్పంచ్ మహలక్ష్మీరాజు, గ్రామ పెద్దల మధ్య రేగిన వివాదంలో స్థానిక ప్రజాప్రతినిధి ఆజ్యం పోశారని కొల్లేరు గ్రామాల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మహలక్ష్మీ రాజుకి లోబడి అటవీ, రెవెన్యూ అధికారులు ప్రజలు అనుభవిస్తున్న 260.30 ఎకరాల పట్టా చెరువులను అభయారణ్యంగా పేర్కొనడం వల్లే వివాదం ముదిరిందని చెబుతున్నారు. ఈ కారణంగానే హైకోర్టు ఆ చెరువుల్లో చేపల పట్టుబడిపై నిషేధం విధించిందని గుర్తుచేస్తున్నారు. దీనిపై ప్రజలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గ్రామస్తులు 98 రోజుల పాటు నిరవధిక దీక్ష చేసినా అధికారులు పట్టించుకోలేదు. గ్రామస్తులను రెండు వర్గాలుగా విభజించి ప్రేరేపిస్తున్న వారిపై పోలీసులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని కొల్లేటి లంక గ్రామాల పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. ఘర్షణ లను ఆసరా చేసుకుని కొందరు వ్యక్తులు గ్రామస్తులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పరస్పర దాడుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని, వారి కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులు, పెద్దలు, అధికారులు ఏం సమాధానం చెబుతారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ లక్షల రూపాయల నిధులు ఉన్నప్పటికీ మూడేళ్లుగా గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని చెప్పారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని ప్రత్తికోళ్లలంక ప్రజలు కోరుతున్నారు.