breaking news
Kochadiiyaan
-
కొచ్చాడియాన్ కేసులో లతా రజనీకాంత్ పిటిషన్ కొట్టివేత
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్‌పై చీటింగ్ కేసు ఉన్న విషయం తెలిసిందే. 2015లో తమ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంతో లతా రజినీకాంత్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఆమె ష్యూరిటీ సంతకం పెట్టడం వల్లే ఈ చిక్కులు వచ్చాయని సమాచారం. అయితే, ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. కానీ, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ బెంగళూరు కోర్టులో లత పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.2014లో విడుదలైన 'కొచ్చాడియాన్' చిత్రానికి సంబంధించిన ఫోర్జరీ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ లత రజనీకాంత్ చేసిన దరఖాస్తును బెంగళూరు కోర్టు కొట్టివేసింది. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొంది. అయితే, 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిందితులపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె దరఖాస్తును కొట్టివేశారు.2015లో, చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో లత నకిలీ పత్రాలను ఉపయోగించి కోర్టును కూడా మోసం చేశారని ఒకరు పిటిషన్ వేశారు. తప్పుడు పత్రాలతో ఆమె మీడియా గ్యాగ్ ఆర్డర్ పొందారని పిటిషన్ దాఖలైంది. ఈ ఆర్డర్‌తో ఆమెపై వచ్చిన పలు మీడియా కథనాలు తొలగించారని అందులో పేర్కొన్నారు. కొచ్చాడియాన్తో సంబంధం ఉన్న ఆర్థిక వివాదాలకు సంబంధించిన దాదాపు 70 మీడియా సంస్థలకు చెందిన వార్తలు తొలగించారని తెలిపారు. -
రజనీ నటనకు స్వస్తి?
రజనీకాంత్ నటనకు స్వస్తి చెప్పనున్నారా? కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో సాగుతున్న సమాధానం లేని, ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రచారం. అలాగే ఆయన నటించిన తాజా చిత్రం కోచ్చడయాన్ విడుదలకు ఆర్థిక పరమైన వ్యాపార చిక్కులు అంటూ వదంతులు వెల్లువెత్తుతున్నాయి. వీటికి రజనీకాంత్ అర్ధాంగి లతా రజనీకాంత్ తనదైన శైలిలో స్పష్టత నిచ్చారు. అదేమిటో ఆమె మాట ల్లోనే చూద్దాం. ‘‘కోచ్చడయాన్ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితిలో చిత్రానికి ఆర్థిక సమస్యలు నెలకొన్నాయి. దీంతో చిత్రం విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటూ వదంతులు ప్రచారం అవుతున్నాయి. అలాంటి ప్రచారంలో వాస్తవం లేదు. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. కోచ్చడయాన్ చిత్రాన్ని ఆరు భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇలా చేయడం మాకేమంత కష్టం గా లేదు. మరో విషయం ఏమిటంటే కోచ్చడయాన్ చిత్రం ద్వారా ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. భారతీయ సినీ చరిత్రలో కోచ్చడయాన్ వంటి చిత్రాన్ని ఇంతకు ముందు చూసి ఉండరు. హాలీవుడ్ చిత్రం అవతార్ అత్యంత భారీ బడ్టెట్‌తో నిర్మించారు. అంత ఖర్చు మనం భరించలేం. అయితే ఆ చిత్రానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కోచ్చడయాన్ కోసం వాడే ప్రయత్నం చేశాం. సమయం, ఖర్చు, రజనీ కాంత్‌కు ఎలా చూపించాలన్న విషయాలు పెద్ద సవాల్‌గా నిలిచాయి. నిజం చెప్పాలంటే దర్శకురాలిగా సౌందర్య కు ఇది మోయలేని భారం. తన తం డ్రి రజనీపై నమ్మకంతో, నిరంతర కృషి, పట్టుదలతో చిత్రం చేశారు. భారతీయ సినీ చరిత్ర లో కోచ్చడయాన్ ఒక మైలురాయిగా నిలి చిపోతుంది. హాలీవుడ్ చిత్రాల్లో ఇంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా అవతార్ చిత్రం నిలిచిపోయింది. ఇదే తరహాలో కోచ్చడయాన్ చిత్రం చరిత్రకెక్కుతుందని అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించడం గమనార్హం. అది రజనీ ఇష్టం రజనీకాంత్ నటనకు స్వస్తి చెప్పనున్నారనే అంశం ప్రచారంలో ఉంది. అయితే రజనీ నటనకు స్వస్తి చెప్పి కుటుంబంలో గడపాలన్న నిర్ణయాన్ని ఆయన ఇష్టానికే వదిలేశాం. ఎప్పుడు? ఏమి చేయాలన్నది రజనీకి తెలుసు. ఆయ న ఆధ్యాత్మిక చింతన కలవారు. ఆయన మనస్సాక్షి ఏమి చెబితే అదే చేస్తారు.’’ అని లతా రజనీకాంత్ తెలిపారు.