breaking news
knockout tournament
-
మూడో రౌండ్లో వంతిక
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి వంతిక అగర్వాల్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా... పద్మిని రౌత్, ప్రియాంక రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన రెండో రౌండ్లో వంతిక 4.5–3.5తో విజయం సాధించింది. గురువారం రెండో రౌండ్లో రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లో వంతిక 3.5–2.5తో గెలిచింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో పద్మిని 3.5–4.5తో ఓడిపోయింది. గురువారం రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించగా... కొస్టెనిక్ 3.5–2.5తో పద్మినిని ఓడించింది. కులోన్ క్లౌడియా (పోలాండ్)తో జరిగిన పోటీలో ప్రియాంక 1–3తో ఓటమి పాలైంది. నేడు జరిగే మూడో రౌండ్ తొలి గేమ్‌లలో కులోన్ క్లౌడియాతో కోనేరు హంపి; టియోడొరా ఇంజాక్ (సెర్బియా)తో దివ్య దేశ్‌ముఖ్; కాటరీనా లాగ్నోతో వంతిక; స్టావ్రూలాతో ద్రోణవల్లి హారిక; కరిస్సా యిప్తో వైశాలి తలపడతారు. -
మూడో రౌండ్లో హరికృష్ణ
సోచి (రష్యా): ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణతోపాటు భారత్‌కే చెందిన ఆధిబన్, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో హరికృష్ణ 1.5–0.5తో యాసిర్ పెరెజ్ క్యూసాడా (క్యూబా)పై, ఆధిబన్ 2–0తో న్యూరిస్ డెల్గాడో రమిరెజ్ (పరాగ్వే)పై, ప్రజ్ఞానంద 2–0తో గాబ్రియెల్ సర్గాసియన్ (అర్మేనియా)పై, నిహాల్ 1.5–0.5తో సనన్ జుగిరోవ్ (రష్యా)పై గెలిచారు. నిర్ణీత రెండు గేమ్‌లు ముగిశాక విదిత్ (భారత్)–అలెగ్జాండర్ ఫియెర్ (బ్రెజిల్); గుకేశ్ (భారత్)–దుబోవ్ (రష్యా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు శనివారం ‘టైబ్రేక్’ నిర్వహిస్తారు. అరవింద్ చిదంబరం (భారత్) 0.5–1.5తో నోదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... ఇనియన్ (భారత్) 0–2తో తొమాస్‌షెవ్‌స్కీ (రష్యా) చేతిలో ఓడిపోయారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్లోకి ప్రవేశించింది. హారిక ప్రత్యర్థి మెదీనా (ఇండోనేసియా)కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె బరిలోకి దిగలేదు. భక్తి కులకర్ణి 0.5–1.5తో నటాలియా పొగోనినా (రష్యా) చేతిలో... వైశాలి 0–2తో బేలా ఖొటెనాష్విలి (జార్జియా) చేతిలో ఓడిపోయారు. పద్మిని రౌత్ (భారత్)–సారాసదత్ (ఇరాన్) 1–1తో సమంగా నిలువడంతో శనివారం టైబ్రేక్‌లో తలపడతారు. -
తేజకు ఐదు వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్ : వాకర్ టౌన్ బౌలర్ తేజ (5/15) తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దీంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో సత్య సీసీ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ 75 పరుగులకే కుప్పకూలింది. అన ంతరం బరిలోకి దిగిన వాకర్ టౌన్ వికెట్ కోల్పోయి 80 పరుగులు చేసి గెలిచింది. పాండు (45) మెరుగ్గా ఆడాడు. మరో మ్యాచ్‌లో విజయానంద్ జట్టు 119 పరుగుల తేడాతో సన్‌షైన్ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన విజయానంద్ 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. నాయక్ (70) అర్ధ సెంచరీతో రాణించగా... తిలక్ (44), అభిషేక్ (37), విక్రాంత్ (30) ఫర్వాలేదనిపించారు. సన్‌షైన్ బౌలర్ కళ్యాణ్ సాత్విక్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌షైన్ 103 పరుగులకే చేతులెత్తేసింది. విజయానంద్ బౌలర్ నరేష్ 3 వికెట్లు తీశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అగర్వాల్ ఎస్ఆర్: 174 (ఫరూఖ్ 45, అబ్దుల్లా 30; మునాఫ్ సుబానీ 3/32); కల్నల్ అక్రిలిక్: 175/5 (మొసిన్ ఆరిఫ్ 51, మహ్మద్ ఆసిఫ్ 30). లాల్ బహదూర్: 272/7 (గఫార్ ఖాన్ 50, జైచందర్ 65, సుషీల్ 56 నాటౌట్, పవన్ 33); ఇన్కమ్ ట్యాక్స్: 273 (మారుతీ ప్రసాద్ 40, హిమాన్షు 67, రాజశేఖర్ 73). కాంకార్డ్: 131; రోహిత్ ఎలెవన్: 135/7.