Khanna
-
ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలతో వెళ్తున్నా..
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో సుదీర్ఘకాలం పనిచేసి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు సొంతం చేసుకున్నానని జస్టిస్ సంజీవ్ ఖన్నా సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం ఈ జ్ఞాపకాలు తనకు తోడుగా ఉంటాయని చెప్పారు. తన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం ముగియడంతో మంగళవారం ఆయనకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టులో నిర్వహించిన సెర్మోనియల్ బెంచ్‌లో జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సంజయ్ కుమార్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థకు జస్టిస్ సంజీవ్ ఖన్నా అందించిన సేవలను వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రసంగించారు. నూతన సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ పట్ల తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు విలువలు, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఆయన చక్కగా పరిరక్షిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. తనకు ఇన్నాళ్లూ అతిపెద్ద మద్దతుదారుడిగా నిలిచారని కొనియాడారు. జస్టిస్ గవాయ్ నాయకత్వాన్ని ఎంతగానో విశ్వసిస్తున్నానని, రాజ్యాంగ విలువల పట్ల ఆయన అంకితభావం తిరుగులేనిదని వెల్లడించారు. తాము దాదాపు ఒకేసారి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందామని, కొలీజియంలో కలిసి పనిచేశామని చెప్పారు. తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ అద్భుతమైన సేవలు అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఖన్నాతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అందించిన సేవలను జస్టిస్ బి.ఆర్.గవాయ్ కొనియాడారు. ఇది వీడ్కోలు కాదని, ఒక మార్పు మాత్రమేనని చెప్పారు. జస్టిస్ ఖన్నా వృత్తి జీవితం ఈరోజుతో ఆగిపోవడం లేదని, మరొకదానికి ఇది ఆరంభమని వివరించారు. జస్టిస్ ఖన్నా ఆలోచల్లో స్పష్టత, నైతికత, ప్రాథమిక హక్కుల పరిరక్షణ పట్ల అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఆయన ఇచి్చన తీర్పులన్నీ రాజ్యాంగ విలువలతో కూడి ఉన్నాయని చెప్పారు. జస్టిస్ ఖన్నాతో ఇన్నాళ్లూ కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. జస్టిస్ ఖన్నా తమకు స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు.అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి మాట్లాడుతూ... జస్టిస్ ఖన్నా న్యాయస్థానాల విలువ, గౌరవం ఎన్నోరెట్లు పెంచారని ప్రశంసించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం జస్టిస్ ఖన్నా సేవలను గుర్తుచేసుకున్నారు. కపిల్ సిబల్ మాట్లాడుతూ... ఈ వారం దేశంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు పదవీ విరమణ చేశారని చెప్పారు. క్రికెటర్ విరాట్ కోహ్లీతోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్ అవుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కపిల్ సిబల్ ప్రసంగించారు. రెండు దశాబ్దాలపాటు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ఖన్నా న్యాయం పట్ల తిరుగులేని అంకితభావం కనబర్చారని చెప్పారు. -
సీఈసీ, ఈసీల నియామక కేసు... విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించబోనని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టంచేశారు. ఈ కేసును మంళళవారం సీజేఐ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. గతంలో జడ్జిగా ఉన్న జస్టిస్ ఖన్నా ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో తన పదవికి సంబంధించిన కేసును తానే విచారించాల్సిన పరిస్థితి తలెత్తింది.దీంతో ఆయన ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ ధర్మాసనంలో సభ్యునిగా నేను లేని బెంచ్‌కు ఈ కేసును బదిలీచేస్తున్నాను’’ అని సీజేఐ వెల్లడించారు. మీరు కొనసాగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్, లాయర్ ప్రశాంత్ భూషణ్ చెప్పినా సరే సీజేఐ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన చట్టంలో గత ఏడాది మార్పులు చేస్తూ కేంద్రం తెచి్చన చట్టంలోని సెక్షన్7 చట్టబద్ధతను సవాల్‌చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. -
రోజంతా ఇవే మాట్లాడుకుంటున్నాం!
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఇదే గోలా? పొద్దున లేస్తూనే నేను వింటున్న వార్తలు (పెరుగు తున్న ద్రవ్యోల్బణం మినహా యించి) అన్నీ కూడా ఆలయాలు, మసీదుల గురించే. ఇది 2022. అయినా మనం ఇంకా రోజంతా– హిందువులు, ముస్లింలు; గుడులు, మసీదులు ఇవే మాట్లాడుకుంటున్నాం. ఇది ఆందోళనకరం, భయానకం. చెప్పాలంటే శక్తిని నిర్వీర్యం చేస్తోంది. – నేహా ఖన్నా, యాంకర్ నిషేధాల మీద నిషేధాలు తాలిబన్ కొత్త ఉత్తర్వు ప్రకారం– పురుషులు, మహిళలు కలిసి రెస్టారెంట్లో తినడం నిషిద్ధం. పార్కులకు కలిసి వెళ్లడానికి కూడా అనుమతి లేదు, వాళ్లు పెళ్లయిన దంపతులే అయినా సరే. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మహిళా హక్కుల సంక్షోభాన్ని అఫ్గానిస్తాన్ ఎదుర్కుంటోంది. – షబ్నమ్ నసీమీ, బ్రిటన్ ప్రభుత్వ సలహాదారు, ఒకప్పటి అఫ్గాన్ శరణార్థి ఆటవిక చర్య కశ్మీరీ పండిత్ అయినందుకు రాహుల్ భట్‌ను తీవ్రవాదులు చంపేశారు. కశ్మీరీ పోలీస్ అయినందుకు రియాజ్ ఠోకర్ను తీవ్ర వాదులు చంపేశారు. అసహనం, ఆటవికత, అగాథపు చీకట్లలాంటి దుష్టత్వమే జీవితంగా గడిపే తీవ్రవాదులు మరో రెండు కశ్మీరీ ప్రాణాలను అంతమొందించాయి. – జునైద్ అజీమ్ మట్టూ, శ్రీనగర్ మేయర్ పాత రోజులు కావు మా నాన్నతో మాట్లాడుతున్నాను. ఒక జ్ఞాపకం పంచుకున్నారు. 1960, 70ల ప్రాంతంలో ఆగ్రాలోని హిందూ బట్టల దుకాణదారులు రోడ్ల మీద తమ తాన్లను పరిచేవారట; ముఖ్యంగా జుమా అల్విదా, రంజాన్ రోజుల్లో ముస్లింలు సామూహిక ప్రార్థన చేసేటప్పుడు. వాటి మీద నమాజ్ చేయడం వల్ల బట్టలకు ఆశీర్వాదం దొరికి అమ్మకాలు పెరుగుతాయనీ, ‘బర్కత్’ అవుతుందనీ నమ్మేవాళ్లట. ‘ఆలోచనే మారిపోయిందిప్పుడు,’ అన్నారు. – ఘజాలా వాహబ్, సంపాదకురాలు ట్రంపును తప్పించారంతే... జో బైడెన్ తప్పు ఏమిటంటే, దేశాన్ని మార్చడానికి ఆయనను ఎన్నికల్లో గెలిపించారని అనుకుంటున్నారు. కానీ నిజానికి అందరూ కోరుకున్నది కొద్దిగా నాటకీయత తగ్గాలని! – ఎలాన్ మస్క్, వ్యాపారవేత్త భరించలేని వైరస్ కోవిడ్–19 పాజిటివ్ అని తేలింది. తల నుంచి కాళ్ల వరకు విపరీతమైన నొప్పి. ఏదో ఒక పెద్ద లారీ ఢీకొట్టినట్టు అనిపిస్తోంది. నిజంగా నాకు బాలేదు. నాకోసం ప్రార్థించండి. – రెనీ లిన్, అమెరికా యాక్టివిస్ట్ నిరసనే లేదు వంట గ్యాసుకు నేను 1,048 రూపా యలు కడుతున్నాను. మీరెంత చెల్లిస్తు న్నారు? అది నాలుగు వందల రూపా యలు ఉన్న రోజులు నాకు తెలుసు– అప్పుడు దానిమీద చాలా నిరసన వ్యక్తమైంది. – బబీతా శర్మ, అస్సాం కాంగ్రెస్ ప్రతినిధి -
మార్కెట్ల పతనంతో ప్రముఖ ఇన్వెస్టర్లంతా...
న్యూఢిల్లీ : అటు అమెరికా స్టాక్ మార్కెట్లు, ఇటు దేశీయ స్టాక్ మార్కెట్లు ఇచ్చిన దెబ్బకి ఇన్వెస్టర్లెవరూ తప్పించుకోలేకపోయారు. రాఖేష్ ఝున్‌ఝున్‌వాలా, ఆసిస్ కచోలియా, డాలీ ఖన్నా వంటి ప్రముఖ ఇన్వెస్టర్లంతా తీవ్రంగా నష్టపోయారు. 2018లో ఆర్జించిన లాభాలన్నింటినీ సెన్సెక్స్ ఒక్కసారిగా కోల్పోయిన సంగతి తెలిసిందే. గత సోమవారం నమోదైన ఆల్-టైమ్ హై నుంచి 3000 పాయింట్ల మేర సెన్సెక్స్ క్రాష్ అయింది. దీంతో చాలా మంది మార్కెట్ గురూలు, తమ పోర్ట్ఫోలియా స్టాక్స్ నుంచి 32 శాతం వరకు సంపదను నష్టపోయారు. నేడు ట్రేడింగ్ ప్రారంభమైన సెకన్ల వ్యవధిలోనే 5 లక్షల 40వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ భారీగా 1250 పాయింట్ల మేర, నిఫ్టీ 350 పాయింట్ల మేర పతనమైంది. బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను భయాలు, అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం, ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్బీఐ రెపో రేటు పెంపుకు అంచనాలు వంటివి మార్కెట్లను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఈ కేలండర్ ఏడాదిలో ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో స్టాక్స్ 32 శాతం వరకు పడిపోయినట్టు డేటా వెల్లడించింది. ఆప్టెక్ 34 శాతం, జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎంసీఎక్స్, అనంత్ రాజ్ 27 శాతం, 27.12 శాతం, 26 శాతం వరకు నష్టపోయాయి. ఆటో లైన్ ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంకు, ఓరియంట్ సిమెంట్లు కూడా 24 శాతం వరకు నష్టాలు గడించాయి. మరోవైపు మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో మరో ప్రముఖ ఇన్వెస్టర్ ఆసిస్ కచోలియా, షైలీ ఇంజనీరింగ్ ప్లాటిస్టిక్స్లో 2,95,000 షేర్లను కొనుగోలు చేశారు. మరో స్టాక్‌ను కూడా కచోలియా కొన్నట్టు తెలిసింది. డాలీ ఖన్నా పోర్టుఫోలియోలో స్టెర్లింగ్ టూల్స్ 19 శాతం, ద్వారికేష్ షుగర్ 20 శాతం, నందన్ డెనిమ్ 21 శాతం, రుచిర పేపర్ 19 శాతం, మణప్పురం ఫైనాన్స్ 21 శాతం, జీఎన్ఎఫ్సీ 19 శాతం, రాణి ఇండస్ట్రీస్ 18 శాతం, ఐఎఫ్బీ ఆగ్రో 25 శాతం నష్టాలు పాలయ్యాయి. -
పంజాబ్‌లో మరో దుర్ఘటన..
ఖన్నా: పంజాబ్‌లో మహిళలపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. కదులుతున్నబస్సులోంచి 14 బాలికను తోసేసి ఆమె మరణానికి దారితీసిన ఘటనపై రగిలిన దుమారం చల్లారిందో లేదో ఆదివారం మరో సంఘటన వెలుగు చూసింది. తాజాగా పంజాబ్‌లోని ఖన్నా ఏరియాలో ఒక ప్రయివేటు బస్సులో ప్రయాణిస్తున్న మహిళను పక్కసీట్లో కూర్చున్న వ్యక్తి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తనను వేధిస్తున్నాడంటూ ఆ మహిళ కండక్టర్, డ్రైవర్ సహాయాన్ని కోరింది. అయితే వారు ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు సరికదా, ఆ వ్యక్తి తప్పించుకొని పారిపోవడానికి సహకరించారు. దీంతో హతాశురాలైన బాధితురాలు పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేసినా బస్సు డ్రైవర్, కండక్టర్ పట్టించుకోలేదని, కనీసం బస్సు కూడా ఆపలేదంటూ బాధితురాలు వాపోతోంది. రంగంలోకి దిగిన పోలీసులు బస్సు డ్రైవర్, కండక్లర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ప్రయివేటు బస్సు యాజమాన్యాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. కాగా గత బుధవారం గురుద్వారాకు వెళుతున్న తల్లీ కూతుళ్లను వేధించి, బస్సులోంచి నిర్దాక్షిణ్యంగా తోసేసిన ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోతే, తల్లి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. బాలిక మరణానికి కారణమైన ప్రయివేటు రవాణా సంస్థ అధిపతి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, కొడుకు, ఉపముఖ్యమంత్రి కావడంతో వివాదం మరింత ముదిరింది. అయితే స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగిన సంగతి తెలిసిందే.