మార్కెట్ల పతనంతో ప్రముఖ ఇన్వెస్టర్లంతా... | Sakshi
Sakshi News home page

మార్కెట్ల పతనంతో ప్రముఖ ఇన్వెస్టర్లంతా...

Published Tue, Feb 6 2018 12:20 PM

Jhunjhunwala, Dolly Khanna and others lose up to 32% in this selloff - Sakshi

న్యూఢిల్లీ : అటు అమెరికా స్టాక్‌ మార్కెట్లు, ఇటు దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇచ్చిన దెబ్బకి ఇన్వెస్టర్లెవరూ తప్పించుకోలేకపోయారు. రాఖేష్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆసిస్‌ కచోలియా, డాలీ ఖన్నా వంటి ప్రముఖ ఇన్వెస్టర్లంతా తీవ్రంగా నష్టపోయారు. 2018లో ఆర్జించిన లాభాలన్నింటినీ సెన్సెక్స్‌ ఒక్కసారిగా కోల్పోయిన సంగతి తెలిసిందే. గత సోమవారం నమోదైన ఆల్‌-టైమ్‌ హై నుంచి 3000 పాయింట్ల మేర సెన్సెక్స్‌ క్రాష్‌ అయింది. దీంతో చాలా మంది మార్కెట్‌ గురూలు, తమ పోర్ట్‌ఫోలియా స్టాక్స్‌ నుంచి 32 శాతం వరకు సంపదను నష్టపోయారు. 

నేడు ట్రేడింగ్‌ ప్రారంభమైన సెకన్ల వ్యవధిలోనే 5 లక్షల 40వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ భారీగా 1250 పాయింట్ల మేర, నిఫ్టీ 350 పాయింట్ల మేర పతనమైంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను భయాలు, అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం, ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఆర్‌బీఐ రెపో రేటు పెంపుకు అంచనాలు వంటివి మార్కెట్లను భారీగా దెబ్బతీస్తున్నాయి. 

ఈ కేలండర్‌ ఏడాదిలో  ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ 32 శాతం వరకు పడిపోయినట్టు డేటా వెల్లడించింది. ఆప్‌టెక్‌ 34 శాతం, జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఎంసీఎక్స్‌, అనంత్‌ రాజ్‌ 27 శాతం, 27.12 శాతం, 26 శాతం వరకు నష్టపోయాయి. ​ఆటో లైన్‌ ఇండస్ట్రీస్‌, ఫెడరల్‌ బ్యాంకు, ఓరియంట్‌ సిమెంట్‌లు కూడా 24 శాతం వరకు నష్టాలు గడించాయి. 

మరోవైపు మార్కెట్‌లో నెలకొన్న తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో మరో ప్రముఖ ఇన్వెస్టర్‌ ఆసిస్‌ కచోలియా, షైలీ ఇంజనీరింగ్‌ ప్లాటిస్టిక్స్‌లో 2,95,000 షేర్లను కొనుగోలు చేశారు. మరో స్టాక్‌ను కూడా కచోలియా కొన్నట్టు తెలిసింది. డాలీ ఖన్నా పోర్టుఫోలియోలో స్టెర్లింగ్‌ టూల్స్‌ 19 శాతం, ద్వారికేష్‌ షుగర్‌ 20 శాతం, నందన్‌ డెనిమ్‌ 21 శాతం, రుచిర పేపర్‌ 19 శాతం, మణప్పురం ఫైనాన్స్‌ 21 శాతం, జీఎన్‌ఎఫ్‌సీ 19 శాతం, రాణి ఇండస్ట్రీస్‌ 18 శాతం, ఐఎఫ్‌బీ ఆగ్రో 25 శాతం నష్టాలు పాలయ్యాయి. 

Advertisement
Advertisement