Key features
-
అస్సాం పోరు 2026: ఈ ఐదు అంశాల్లోనే ‘దోబూచులాట’
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 9న జరగనున్న ఒకే దశ పోలింగ్ కోసం రాష్ట్రంలో సన్నాహాలు సాగుతున్నాయి. 126 స్థానాల కోసం జరుగుతున్న ఈ సమరంలో కేవలం అభివృద్ధి మాత్రమే కాదు.. అస్తిత్వం, సామాజిక న్యాయం, వివాదాస్పద ‘ఎవిక్షన్’ డ్రైవ్‌లు.. మొదలైనవి గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా ఐదు అంశాలు ఈసారి ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్’గా మారబోతున్నాయి.1. జుబీన్ గార్గ్ సెంటిమెంట్అస్సాం సాంస్కృతిక దిగ్గజం జుబీన్ గార్గ్ 2025 సెప్టెంబర్‌లో సింగపూర్‌లో మృతిచెందడం రాష్ట్ర ప్రజలను విషాదంలోకి నెట్టింది. ఈ కేసును హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం స్పెషల్ కోర్టుకు అప్పగించినప్పటికీ, విచారణ వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. యువతలో ‘వాయిస్ ఆఫ్ జనరేషన్’గా పేరొందిన జుబీన్ ప్రభావం ‘సైలెంట్ ఓటర్ల’ రూపంలో తీర్పును మార్చే అవకాశం ఉంది.2. ఎవిక్షన్ డ్రైవ్‌లు (ఆక్రమణల తొలగింపు)అటవీ భూములు, ఆలయ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేశామని బీజేపీ కూటమి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే కాంగ్రెస్, ఏఐడీయూఎఫ్ మాత్రం దీనిని మైనారిటీలను లక్ష్యం చేసుకుని చేసిన మానవతా సంక్షోభంగా చిత్రీకరిస్తున్నాయి. ఈ అంశం మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కీలకం కానుంది.3. చొరబాటు - సీఏఏ/ఎన్ఆర్సీ చర్చఅక్రమ వలసల అంశం అస్సాం రాజకీయాల్లో ఎప్పుడూ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పీడిత మైనారిటీలకు రక్షణగా సీఏఏను బీజేపీ సమర్థిస్తుంటే, అస్సాం ఒప్పందాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఎన్‌ఏఆర్‌సీ ద్వారా అసలైన భారతీయులను వేధిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.4. బాల్య వివాహాలపై ఉక్కుపాదం‘పాక్సో’ చట్టం కింద ప్రభుత్వం చేపట్టిన సామూహిక అరెస్టులను ఎన్డీఏ ప్రభుత్వం ఒక చారిత్రక సామాజిక సంస్కరణగా అభివర్ణిస్తోంది. అయితే ఇది ఓటర్ల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నమని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు సగం మంది ఉన్న మహిళా ఓటర్ల తీర్పుపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.5. సంక్షేమం - నిరుద్యోగంనెలకు ₹1,250 అందించే ‘అరుణోదయ్ పథకం, టీ-వర్కర్ల సంక్షేమం, 1.6 లక్షల ఉద్యోగాల కల్పనపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అయితే పెరిగిన అప్పులు, నిరుద్యోగం, భూసేకరణ సమస్యలను ఎత్తిచూపుతూ గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ దీటుగా బదులిస్తోంది.అస్సాం ఎన్నికల కీలక తేదీలునామినేషన్ల గడువు: మార్చి 23, 2026పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9, 2026 (ఒకే దశ)ఫలితాల విడుదల: మే 4, 2026ఇది కూడా చదవండి: Kerala Polls: వణికిస్తున్న ‘తీరప్రాంత ఓటు’ -
Revolt RV400: కీ అక్కర్లేదు.. స్మార్ట్‌ఫోన్‌తోనే బండి స్టార్ట్
వాహనాన్ని స్టార్ట్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కీ కంపల్సరీ. అది లేకుండా బండి ముందుకు నడవదు. అయితే గత కొంత కాలంగా కీ లేకుండా బండ్లు స్టార్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అవన్నీ రెంటల్ బైక్ సర్వీసెస్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్ బైకులకు సైతం ఈ ఫీచర్‌ని అందుబాటులోకి వచ్చింది. ఓలా రాకతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో పరిస్థితులు మారిపోయాయి. ఈ సెగ్మెంట్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు అందించేందుకు కంపెనీలో పోటీ పడుతునఆనయి. తాజాగా తమ బైకులకు సంబంధించి కీలకమైన మార్పును రివోల్ట్ తీసుకొచ్చింది. కీతో సంబంధం లేకుండానే బండి ఆన్ ఆఫ్ చేసే విధంగా సరికొత్త టెక్నాలజీని రివోల్ట్ అందిస్తోంది. రివోల్ట్ 400 బైకులు స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో రివోల్ట్ యాప్ ద్వారా కీతో సంబంధం లేకుండానే బైను ఆన్, ఆఫ్ చేయవచ్చు. పార్కింగ్ ఏరియాలో బండి ఎక్కడ ఉందో కూడా కనుక్కోవచ్చు. 2021 సెప్టెంబరు నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండే బైకులకు ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. కొత్తవాటితో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న బైకులకు సైతం ఈ ఫీచర్‌ని ఉచితంగానే అందిస్తామని రివోల్ట్ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. రివోల్ట్ షోరూమ్‌కి వెళ్లి కీ లేకుండా బైకులను ఆపరేట్ చేసే ఫీచర్‌ను పొందవచ్చన్నారు. అయితే కీ లెస్ ఫీచర్‌ని కేవలం రివోల్ట్ ఆర్వీ 400 మోడల్స్‌కే పరిమితం చేశారు. ఆర్వీ 300 మోడల్ బైకులకు ఈ ఫీచర్‌ని అందివ్వడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రివోల్ట్ ఆర్వీ 400 మోడల్ స్టాండర్డ్ ధర ఆన్ రోడ్ రూ.1,06,999గా ఉంది. కొత్త మోడల్ వివరాలపై స్పష్టత లేదు. -
శాంసంగ్ కొత్త 4జీ ఫోన్ ..ధర ఎంతోతెలుసా?
సొంత ఆపరేటింగ్ సిస్టమ్ టిజెన్తో రన్ అయ్యే మొదటి 4జీ సపోర్టు స్మార్ట్‌ఫోన్‌ను దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ జెడ్2 పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ. 4,590గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ లాంచింగ్‌తో మార్కెట్లో శాంసంగ్ 4జీ స్మార్ట్ఫోన్ల జాబితా 22కు చేరింది. రిలయన్స్ జియో సర్వీసులతో సరసమైన ధరకు ఈ ఫోన్‌ను నియోగదారులకు ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను పూర్తిగా బెంగళూరు టీమ్ డెవలప్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ లాంచింగ్‌తో ఫీచర్ ఫోన్లను వాడే 550 మిలియన్ యూజర్లను తన సొంతం చేసుకోవాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. వారిని బెటర్ స్మార్ట్‌ఫోన్ అనుభూతికి అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. జియో యాప్స్, వీడియో కాలింగ్, ఓటీజీ అప్డేట్స్తో ఈ కొత్త ఫోన్ యూజర్లను అలరించనుంది. డేటా అవసరం లేకుండా మొబైల్ బ్యాంకింగ్ వాడుకునేలా మై మనీ ట్రాన్సఫర్ యాప్‌ను కూడా ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది. ఈ యాప్‌ను ఇండియాలోని శాంసంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అభివృద్ధి చేసింది. 12 భాషలను శాంసంగ్ జెడ్2 సపోర్టు చేస్తుందని కంపెనీ తెలిపింది. బ్లాక్, వైన్ రెడ్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఫోన్ సోమవారం నుంచి పే టైమ్, శాంసంగ్ ఆఫ్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. శాంసంగ్ జడ్2 ఫీచర్లు... 4 అంగుళాల డిస్ప్లే 1.5 గిగాహెడ్జ్ ప్రాసెసర్ 480x800 పిక్సెల్స్ రెజుల్యూషన్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 128 జీబీ విస్తరణ మెమరీ టిజెన్ ఓఎస్ 5 ఎంపీ వెనుక కెమెరా 0.3 ఎంపీ ముందు కెమెరా 1500 ఎంఏహెచ్ బ్యాటరీ టిజెన్ ఓఎస్ ఆధారితంగా మొదటి స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ గతేడాదే మార్కెట్లోకి తీసుకొచ్చింది.


