breaking news
Ken Balcomb
-
అంతర్రాష్ట్ర జల వివాదాలకు తెరదించాలి
న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పరస్పర సహకారం, సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా జల వివాదాలకు తెరదించాలని చెప్పారు. ఈ విషయంలో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవచ్చని సూచించారు. బుధవారం సాయంత్రం జరిగిన 51వ ‘ప్రగతి’సమావేశానికి ప్రధాని మోదీ నేతృత్వం వహించారు. తొమ్మిది రాష్ట్రాల్లో రైల్వేలు, విద్యుత్, రహదారుల అనుసంధానానికి సంబంధించిన రూ.30 వేల కోట్ల విలువైన ఏడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా, అవసరమైన సౌకర్యాలను పౌరులు సకాలంలో పొందలేకపోతున్నారని వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ భేటీ గురించి మోదీ గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘ప్రగతి’సమావేశంలో ఓడరేవులు, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, ఇతర సామాజిక రంగాల పథకాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకొనే విషయంలో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు ఒక నమూనాగా నిలవాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలిక నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవం, సమర్థవంతమైన నీటిపారుదల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. -
రాకాసి తిమింగలానికి ఏమైంది..!
లండన్: ప్రపంచంలోనే అత్యధిక వయసు గల కిల్లర్ వేల్(తిమింగలం) అదృశ్యమైందా.. లేక చనిపోయిందా.. అంటే చనిపోయి ఉండొచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాదాపు వంద ఏళ్ల వయసున్న కిల్లర్ వేల్ కు గ్రాన్నీ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్షీరదాల ఫ్యామిలీలో గ్రాన్నీ, మరికొన్ని తిమింగలాలు మాత్రమే కీలక పాత్ర పోషిస్తాయి. కిల్లర్ వేల్స్ ఇతర ఆడ తిమింగలాలు, పిల్ల తిమింగలాలకు రక్షణ కల్పిస్తాయి. మగ తిమింగలాలకు ఆహారం అందించడం వీటి మరో ప్రత్యేకత. గత కొన్ని నెలలుగా కిల్లర్ వేల్ గ్రాన్నీ కనిపించిన దాఖలాలు లేవని, దీంతో వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉందని యూకే లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సీటర్కు చెందిన ఓ ప్రొఫెసర్ డారెన్ గ్రాఫ్ట్ అభిప్రాయపడ్డారు. శతాబ్దం వయసు గల ఈ కిల్లర్ వేల్ ఎన్నో ఏళ్లుగా తన వర్గానికి చెందిన తిమింగలాలకు రక్షణ కల్పించింది. ఇతర తిమింగలాలకు ఆహారం ఎలా సంపాదించుకోవాలి.. ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలలో ఇది గైడ్‌గా పనిచేస్తుందని ప్రొఫెసర్ తెలిపారు. 1972లో కిల్లర్ వేల్‌ను కెన్ బాల్కోంబ్ అనే రీసెర్చర్ ఫొటో తీశాడు. సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ వారు దీనికి 'j2' అని పేరు పెట్టారు. గ్రాన్నీ తిమింగళంపై దాదాపు 4 దశాబ్దాలపాటు రీసెర్చ్ చేసినట్లు ఈ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. చివరగా గతేడాది అక్టోబర్ 12న ఉత్తర దిశగా ఈదుతూ కనిపించింది. ఆ తర్వాత పలువురు గ్రాన్నీ వేల్ ను వెతకగా దీని జాడ కనిపించలేదని చనిపోయి ఉండొచ్చునని అదే దీని అదృశ్యానికి కారణమని రీసెర్చర్స్ పేర్కొన్నారు.


