breaking news
karthikam
-
కార్తీకం: కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీముఖలింగ క్షేత్రం!
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖందాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుడిని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మంగళవారం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో కార్తీకమాసం పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీముఖలింగేశ్వరున్ని దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చే గోలెం..స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టు వెనుక కనిపించే పెద్ద మట్టి గోలెం ఎంతో శక్తివంతమైనదని భక్తుల విశ్వాసం. ఇందులో పాలు, బియ్యం, ధాన్యం, మంచినీరు, అన్నం, పండ్లు, బెల్లం.. ఇలా భక్తులు గోలెం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. దీని ఫలితంగా సంతాన యోగం, గ్రహదోషాలు నివారణ, వివాహాలు, ఉద్యోగాలు, విదేశాలలో చదువులు, ఇతర న్యాయపరమైన కోర్కెలు సిద్ధిస్తాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. గోలెం పట్టుకుని పరమేశ్వరుని నిండు మనుసుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం.ఆ భక్తులకు ప్రత్యేకం..మన రాష్ట్రంలో రాయలసీమతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల భక్తులు గురువారం నుంచే కార్తీకమాసం పాటిస్తారు. ఇదే నెలలో దైవ చింతన, తీర్ధయాత్రలు చేయడం వారి సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీముఖలింగం క్షేత్రానికి నెల రోజులపాటు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు.చదవండి: సర్పదోషాలను పరిహరించే పంచలింగాల క్షేత్రం గురించి తెలుసా?ఇదీ చదవండి: Mounjaro వెయిట్‌లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు! -
శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం
శ్రీశైలం టెంపుల్: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం శ్రీగిరిలో లక్షదీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దశవిధహారతులు వాటి వల్ల కలిగే పుణ్య ఫలం గురించి శ్రీశైల ఆలయ ప్రధాన అర్చకులు జె.వీరభద్రయ్యస్వామి మాటల్లోనే.. ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడి సకల శుభాలు కలుగుతాయి. నాగహారతి: నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది. త్రిశూలహారతి: త్రిశూలహారతిని దర్శించడం వలన అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి. నందిహారతి: నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండదు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. సింహహారతి: సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనోధైర్యం కలుగుతుంది. సూర్యహారతి: సూర్యహరతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది. చంద్రహారతి: చంద్రహారతిని దర్శించడం వలన మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభహారతి: కుంభహారతిని దర్శించడం వలన కొరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. నక్షత్రహారతి: నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. కర్పూర హారతి: కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. (క్లిక్ చేయండి: హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం) -
నేత్రపర్వంగా ఊంజల సేవ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై ఆది దంపతులకు ఊంజల సేవ నేత్రపర్వంగా సాగింది. తిరుమలలో శ్రీనివాసునికి నిత్యం జరిగే దీపోత్సవ సేవ తరహాలో ఇంద్రకీలాద్రిపై ఆది దంపతులకు ఊంజల సేవను దుర్గగుడి అధికారులు ప్రారంభించారు. కార్తీక మాసాన్ని పురష్కరించుకుని ఈ సేవను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. గణపతి పూజ , పంచహారతుల అనంతరం శ్రీ గంగా పార్వతి సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లను రాజగోపురం వద్దకు పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చారు. రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన దీపోత్సవ స్టాండ్‌లోని ఊయ్యాలలో ఆది దంపతుల ఉత్సవ మూర్తులను ఉంచి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, ఆలయ అధికారులతో పాటు పెద్ద ఎత్తున భక్తజనులు పాల్గొన్నారు. తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు మల్లేశ్వరాలయం, నటరాజ స్వామి వారి ఆలయం వద్ద ఆకాశ దీపాలను ఏర్పాటుచేశారు. తుమ్మగూడెం శ్రీ శ్రీనివాస భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు, భక్తి గేయాలు ఆకట్టుకున్నాయి. కార్తీక మాసం నెల రోజులు అమ్మవారికి కళా సేవ చేసేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసినట్లు కళాకారులు పేర్కొన్నారు. మల్లేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మల్లేశ్వరాలయంలో స్వామి వారికి లక్ష బిల్వార్చన, సహాస్ర లింగార్చన చేశారు. శివ పంచాక్షరీ జపం, లక్ష్మీ గణపతి మంత్రజపం, రుద్రహోమం నిర్వహించారు. -
కార్తిక సందడి