breaking news
Kandahar province
-
పాక్, అఫ్గాన్ మధ్య మళ్లీ ఘర్షణ
ఇస్లామాబాద్: ఒకప్పటి సన్నిహిత మిత్రదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణ జరిగింది. కాందహార్ ప్రావిన్స్‌లో మంగళవారం అర్ధరాత్రి పాక్ సైన్యం, తాలిబన్ ఫైటర్ల మధ్య కాల్పులు జరిగాయి. తర్వాత ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 15 మంది సాధారణ పౌరులు మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 80 మందికిపైగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. పాక్ దాడిలో దాదాపు 50 మంది తాలిబన్లు మరణించినట్లు సమాచారం. సరిహద్దుల్లో ఘర్షణ నానాటికీ ముదురుతుండడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను ఫోన్లో సంప్రదించింది. అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా మధ్యవ ర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబన్లను ఒప్పించాలని కోరింది. పరస్పరం నిందలు పాక్, అఫ్గాన్ మధ్య గతవారం హింసాకాండ మొదలైంది. కాబూల్‌లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. డురాండ్ లైన్లో 58 మంది పాక్ సైనికులను హతమార్చారు. 20 పాక్ సెక్యూరిటీ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశారు. 2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్‌తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలోనే పాక్ సైన్యం తాలిబన్లపై గురిపెట్టింది. మంగళవారం రాత్రి తొలుత పాక్ జవాన్లే కాల్పులు జరిపారని, భారీ ఆయుధాలు ప్రయోగించారని తాలిబన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ ఆరోపించారు. తమ ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో పాక్ జవాన్లు హతమయ్యారని, పాక్ ఆయుధాలను, యుద్ధ ట్యాంక్‌లను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించా రు. అయితే, రెండు సరిహద్దు పోస్టులు సహా మొ త్తం నాలుగుచోట్ల తాలిబన్లు మొదట కాల్పులు జరిపారని, దాంతో తాము ప్రతిస్పందించాల్సి వచ్చిందని పాకిస్తాన్ సైన్యం తెలియజేసింది. ఎదురుకాల్పుల్లో 30 మంది తాలిబన్ ఫైటర్లు మరణించారని స్పష్టంచేసింది. స్పిన్ బోల్డాక్‌లో మరో 20 మంది మృతిచెందారని వివరించింది. తాలిబన్లకు సంబంధించిన 8 సైనిక పోస్టులు, 6 యుద్ధ ట్యాంకులు ధ్వంసమైనట్లు పేర్కొంది. తాలిబన్ల దాడిలో చమన్‌జిల్లాలో నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాక్ వెల్లడించింది. ఒరాక్జాయ్ జిల్లాలో ఆరుగురు పాక్ పారామిలటరీ సిబ్బంది మృతిచెందినట్లు తెలిసింది. ఇరువర్గాల కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల నుంచి వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గత పది రోజులుగా సరిహద్దు మార్గాలను అధికారులు మూసివేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. పాక్ రక్షణ శాఖ మంత్రి, ఐఎస్ఐ అధినేత, ఇద్దరు సైనికాధికారులకు వీసాలు ఇవ్వడానికి తాలిబన్ ప్రభుత్వం నిరాకరించింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది. దాంతో అఫ్గాన్‌తో అన్ని రకాల సంబంధాలను తెంచేసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. మరోవైపు భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీరి్ణంచుకోలేకపోతోంది. కాబూల్‌లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్‌కు కంటగింపుగా మారింది.48 గంటల కాల్పుల విరమణ అఫ్గానిస్తాన్‌తో 48 గంటలపాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాలిబన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ తెలియజేశారు. ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. ఒకవేళ పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదులిస్తామని స్పష్టంచేశారు. -
అది తాలిబన్ల అఘాయిత్యం కాదు.. సంబురం
Taliban Hangs To Helicopter: అమెరికా-నాటో దళాలు అఫ్గన్ నేలను విడిచిన తర్వాత తాలిబన్లు రెచ్చిపోతున్నారంటూ కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాందహార్‌లో ఓ వ్యక్తిని చంపి.. అమెరికా గస్తీ హెలికాప్టరుకు వేలాడదీసి గగనతంలో తాలిబన్లు తిప్పిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అమెరికా రాజకీయ వేత్తలు, నటుల నుంచి మొదలు.. భారత జర్నలిస్టులు, మీడియా హౌజ్‌ల దాకా ఇదొక అఘాయిత్యంగా పేర్కొంటూ కథనాలు ప్రసారం చేశాయి. అయితే.. అయితే అది తప్పుడు వార్త. మిలియన్ల మంది షేర్ చేసిన ఈ వీడియో నిజం కాదని నిర్ధారణ అయ్యింది. పన్నెండు సెకండ్ల వీడియో వీడియో బిల్డింగ్‌ల మధ్య ఓ వ్యక్తి వేలాడుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అమెరికా పాట్రోలింగ్ హెలికాఫ్టర్ ఉపయోగించి.. ఓ వ్యక్తిని తాలిబన్లు చంపి ఉరేగించారని, ప్రజలకు భయంకరమైన సందేశాన్ని పంపారంటూ పలువురు భారత జర్నలిస్టులు వరుసపెట్టి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై అమెరికాలో రాజకీయ దురమారం సైతం చెలరేగింది. కానీ, ఇది విషాదం కాదని.. సంబురం అని ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. Afghan pilot flying this is someone I have known over the years. He was trained in the US and UAE, he confirmed to me that he flew the Blackhawk helicopter. Taliban fighter seen here was trying to install Taliban flag from air but it didn’t work in the end. https://t.co/wnF8ep1zEl — BILAL SARWARY (@bsarwary) August 31, 2021 అమెరికా దళాలు ఖాళీ చేశాక.. అమెరికా మిలిటరీ యుద్ధ సామాగ్రి మొత్తాన్ని తాలిబన్లు స్వాధీనపర్చుకున్నారు. సంబురంగా జెండాలు ఎగరేసి వేడుకలు చేసుకున్నారు. కాందహార్‌లో జెండాను ఎగరేయడానికి బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ ద్వారా ఓ ఫైటర్‌ను ఉపయోగించుకున్న సందర్భం అది. టబుసమ్ రేడియో అనే పేజీ నుంచి వైరల్ అయ్యింది. అఫ్గన్ రేడియో స్టేషన్ అగస్టు 30న టెలిగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. కాందహార్‌లోని గవర్నర్ కార్యాలయం మీద జెండా ఎగరేయడానికి ఆ తాలిబన్ మెంబర్ ప్రయత్నించాడు. ఫుల్ లెంగ్త్ వీడియోలో చేతులు ఊపడం కూడా చూడొచ్చు. అమెరికా భద్రత దళాల ఉపసంహరణ సందర్భంగా తాలిబన్ల సంబురంలో భాగంగా ఈ ఘటన జరిగింది. కేవలం అక్కడే కాదు.. చాలాచోట్ల జెండాను ఎగరేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. చదవండి- తాలిబన్లు మంచోళ్లు: క్రికెటర్ -
తాలిబన్ల గుప్పిట్లో కాందహార్
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ జోరందుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్య నగరాలను శరవేగంతో స్వాధీనం చేసుకుంటున్నారు. దేశంలో రెండో అతి పెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. దక్షిణాది ఆర్థిక హబ్‌గా పేరున్న కాందహార్‌లో గురువారం రాత్రి తాలిబన్లు, అఫ్గాన్ సైన్యానికి మధ్య భీకర ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి దాటాక తాలిబన్లు కాందహార్‌ని స్వాధీన పరచుకొని ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాలు ఎగురవేసినట్టు అధికారులు చెప్పారు. మరో వారంలో రాజధాని కాబూల్ సహా మొత్తం దేశం తమ వశమవుతుందని తాలిబన్ల ప్రతినిధి ఒకరు చెప్పారు. తాము విదేశీ సంస్థలపై దాడులకు దిగబోమని, ఈ సంక్షోభం సమయంలో అన్ని దేశాలు తమకు సహకరించాలని ఆ ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అఫ్గాన్ దక్షిణ భాగమంతా తాలిబన్ల పెత్తనం కిందకు వచ్చేసింది. కాబూల్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెల్మాండ్ నగరాన్ని ఆక్రమించుకోవడంతో ఇక దేశం యావత్తూ వారి చేతుల్లోకి వెళ్లిపోవడం ఎంతో దూరం లేదనే ఆందోళన పెరుగుతోంది. ఘాజ్నీ, హెరత్, లోగర్, ఫెరోజ్ కోహ్ వంటి కీలక నగరాల్లోనూ తాలిబన్లు పాగా వేశారు. ఆయా నగరాల్లోని స్థానిక నేతలు తాలిబన్ల ఎదుట లొంగిపోయారు. అమెరికా తుది విడత బలగాలను ఉపసంహరించడానికి వారం ముందే దేశంలో 66% భూభాగం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. దేశంలో 34 ప్రావిన్షియల్ రాజధానులు ఉండగా, సగం రాజధానులను ఇప్పటికే ఆక్రమించారు. కాబూల్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని లోగర్ ప్రావిన్స్‌లో ఇరుపక్షాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అమెరికా, యూకే సిబ్బంది వెనక్కి తాలిబన్లు రెచ్చిపోతుండగా పశ్చిమ దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసేస్తూ, సిబ్బంది వెనక్కి తీసుకువస్తున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా అవే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఐరాస ఆందోళన అఫ్గానిస్తాన్‌లో రోజురోజుకూ మారుతున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య దోహాలో జరిగే చర్చలతో సంక్షోభం పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అధికారాన్ని కలిసి పంచుకుందామని అధ్యక్షుడు ఘనీ తాలిబన్లకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. మహిళలపై వేధింపులు షురూ అఫ్గానిస్తాన్‌పై పట్టు బిగిస్తున్న తాలిబన్ల అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. బందీలుగా చిక్కిన అఫ్గాన్ సైనికుల్ని ఉరి తీయడం, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని పెళ్లి కాని అమ్మాయిల్ని ఉగ్రవాదులకు కట్టబెట్టాలని చూడడం వంటి పనులు చేస్తున్నట్టుగా మానవ హక్కుల సంఘాలు చెప్పినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. తమ వల్ల ఎవరికీ ఎలాంటి హానీ ఉండదని పదే పదే ప్రకటిస్తున్న తాలిబన్లు విరుద్ధంగా ప్రవరిస్తున్నారు. -
అఫ్ఘానిస్థాన్‌లో వరదలు.. 20 మంది మృతి
కాందహార్ : దక్షిణ అప్ఘనిస్థాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం కాగా వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ విషయాన్ని వెల్లడించిన ఐక్యరాజ్యసమితి కార్యాలయం అధికారులు.. గడిచిన 30 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. వరదల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారన్న యూఎన్వో.. మరోపది మంది గల్లంతైనట్లు వెల్లడించింది. వరదలతో 2 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, శుక్రవారం నుంచి దాదాపు 400 కుటుంబాలను సైనికులు రక్షించినట్లు కాందహార్ డిప్యూటీ గవర్నర్ తెలిపారు. -
పూట్ బాల్ ఆటగాళ్లపై తాలిబన్ల దాడి
ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. పూట్‌బాల్ అడుతున్న బృందంపై రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. ఆ ఘటనలో ముగ్గురు యువకులు మరణించగా, మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కందహార్ ప్రావెన్స్లోని మైవొండ్ జిల్లాలో శనివారం సాయంత్రం ఆ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరుకు భద్రత సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగత్రాలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే స్పిన్ బొల్డక్ జిల్లాలో నిన్న తెల్లవారుజామున సైకిల్‌కు అమర్చిన బాంబు పేలుడులో ముగ్గురు పౌరులతోపాటు నలుగురు పోలీసులు గాయపడ్డారు. గతేడాది ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ విధ్వంసంలో దాదాపు 5 వేల మందికి పైగా మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడిస్తున్నారు. -
రెస్టారెంట్లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి
తాలిబాన్ తీవ్రవాదుల కంచుకోట కందహార్ ప్రావెన్స్లోని ఓ రెస్టారెంట్లో బాంబు పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. ఆ ఘటనలో మరో 14 మంది గాయపడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి గురువారం ఇక్కడ వెల్లడించారు. బాంబు పేలుడు సంభవించిన సమయంలో రెస్టారెంట్లో చాలా మంది ఉన్నారని తెలిపారు. విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే ఆ బాంబు పేలుడు జరిగిందని అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యులమంటూ ఇంతవరకు ఎవరు ప్రకటించలేదని తెలిపారు.