పూట్ బాల్ ఆటగాళ్లపై తాలిబన్ల దాడి | Three Afghan youths killed in Taliban attack | Sakshi
Sakshi News home page

పూట్ బాల్ ఆటగాళ్లపై తాలిబన్ల దాడి

Jan 19 2014 9:09 AM | Updated on Sep 2 2017 2:47 AM

ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. పూట్బాల్ అడుతున్న బృందంపై రాకెట్ లాంచర్లతో దాడి చేశారు.

ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. పూట్బాల్ అడుతున్న బృందంపై రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. ఆ ఘటనలో ముగ్గురు యువకులు మరణించగా, మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కందహార్ ప్రావెన్స్లోని మైవొండ్ జిల్లాలో శనివారం సాయంత్రం ఆ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరుకు భద్రత సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగత్రాలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే స్పిన్ బొల్డక్ జిల్లాలో నిన్న తెల్లవారుజామున సైకిల్కు అమర్చిన బాంబు పేలుడులో ముగ్గురు పౌరులతోపాటు నలుగురు పోలీసులు గాయపడ్డారు. గతేడాది ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్ విధ్వంసంలో దాదాపు 5 వేల మందికి పైగా మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement