kamalakar reddy
-
మైక్ లాక్కొని హంగామా.. టీడీపీలో పెరిగిన విభేదాలు!
నెల్లూరు జిల్లా: టీడీపీలో నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న తమకు అన్యాయం జరుగుతోందంటూ ఒక్కసారిగా వ్యాఖ్యానించడంతో పరిస్థితులు హీటెక్కాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవమే దీనికి వేదికైంది. సముదాయించకుండా.. అడ్డుకొని..! పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత బొమ్మ సుబ్బారెడ్డి మైక్ పట్టుకొని తన మనస్సులోని బాధను వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను అవమానిస్తున్నారనీ.. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి వరకు పార్టీ కోసం రక్తాన్ని ధారపోస్తే, ఇప్పుడు కనీస మర్యాద కరువైందంటూ కంటతడి పెట్టారు. ఈ తరుణంలో అక్కడే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆయన్ను సముదాయించాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పలువురు విస్తుపోయారు. స్టేజీపై అలా మాట్లాడొద్దంటూ నోరు నొక్కేందుకు యతి్నంచారు. మైక్ లాక్కొని.. సీనియర్లను తోసేసి అసమ్మతి గళాన్ని వినిపిస్తే తట్టుకోలేని తమ్ముళ్లు హద్దు మీరి ప్రవర్తించారు. సుబ్బారెడ్డి తన బాధ చెప్పుకొంటుండగానే, నేత కోడూరు కమలాకర్‌రెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పెద్దాయన చేతిలోని మైక్‌ను బలవంతంగా లాక్కున్నారు. అనామకుడినా నేను..? ఇంత అవమానిస్తారా అంటూ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ వేదిక దిగి వెళ్లిపోవడం అక్కడున్న వారిని కలిచివేసింది. మరో సీనియర్ నేత బషీర్ సైతం వేదికపైనే అసంతృప్తిని వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను ఏ కార్యక్రమానికీ పిలవడం లేదని, పార్టీలో సీనియర్లను ఏ మాత్రం లెక్కచేయడంలేదంటూ బాహాటంగానే విమర్శించారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని ఉంటే బయట నుంచి వచ్చిన నేతలు తమపై పెత్తనం చేయడమేమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి బుచ్చిరెడ్డిపాళెం సాక్షిగా జరిగిన ఈ రచ్చ, టీడీపీలో ఐక్యత లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. -
ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.4 కోట్లకు టోకరా
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడిని బుధవారం కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్‌లో హాల్లో కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన దోమల రమేశ్(30)ని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హుజురాబాద్‌లోని డీసీఎంఎస్ కాంప్లెక్స్‌లో సివిల్ పంచాయతీలు పరిష్కరించే కార్యాలయం తెరిచాడు. జిల్లా సివిల్ కోర్టు విజిలెన్స్ అధికారిగా తనను వరంగల్ జిల్లా జడ్జి నియమించినట్లు ఉత్తర్వులు సృష్టించుకొని అమాయలను బురిడికొట్టించాడు. స్కూల్‌అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు నకిలీ అర్డర్లు సృష్టించి విద్యాశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వివిధ న్యాయస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేస్తున్నాడు. అందరిని నమ్మించేందుకు రెండు కార్లు కొని వాటికి జ్యుడిషియల్ శాఖకు చెందిన స్టిక్కర్లు అతికించి డిస్ట్రిక్ సివిల్ కోర్టు జ్యుడిషియల్ విజిలెన్స్ ఆఫీసర్‌గా, సౌత్‌సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్‌గా తిరుగుతున్నాడు. రూ.4 కోట్ల వసూళ్లు జల్సాలకు అలవాటుపడ్డ రమేశ్ పలువురి వద్ద నుంచి రూ.4 కోట్లు వసూలు చేశాడు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు కైత రాంచంద్రంను పరిచయం చేసుకొని అతడి కొడుకుకు జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా, రాంచంద్రం స్నేహితుడు దశరథం బంధువుకు విద్యుత్‌శాఖలో ఉద్యోగం, వారి బంధువుల్లో మరొక మహిళకు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేశాడు. రాంచంద్రం వద్ద అప్పు రూపంలో మొత్తం సుమారుగా రూ.4 కోట్ల వరకు తీసుకొని మోసం చేశాడు. అతడి వద్ద అప్పు తీసుకునే క్రమంలో రామగుండంలో అతడికి డబుల్బెడ్రూం ఇళ్లు ఉన్నట్లు రామగుండం తహసీల్దార్ పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు సృషించి నమ్మించాడు. గోదావరిఖనిలో స్క్రాప్ బిడ్డింగ్ తనకే వచ్చిందని, ఫైనాన్షియల్ సర్వీస్ అథారిటీ రీజనల్ కార్యాలయం ద్వారా రూ.5.34 కోట్లు వచ్చాయని, వరంగల్ జిల్లా జడ్జి తనకు జ్యుడిషియల్ ఆఫీసర్‌గా జీతం ఇస్తున్నట్లు రూ.2.75 లక్షల ఫేక్‌చెక్, జూనియర్ లెక్చరర్‌గా మంచిర్యాలలో అపాయింట్ అయినట్లు ఫేక్ అపాయింట్మెంట్, ఆర్బీఐ అకౌంట్ నుంచి రూ.5 కోట్లు వచ్చినట్లు ఫేక్ లెటర్, గోదావరిఖనిలోని ఎస్బీఐ(అప్పటి ఎస్బీహెచ్) బ్యాంకు అకౌంట్లో కోటి ఉన్నట్లు తప్పుడు పత్రం, జేపీహెచ్‌ఎస్ రామకృష్ణపూర్లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సాలరీ సర్టిఫికెట్, ఐడీకార్డులు తయారు చేసి రూ.4కోట్లు వసూలు చేయగా రెండున్నర కోట్లు జల్సాలకే ఖర్చుచేసినట్లు , మిగతా ఒకటిన్నర కోటి పలువురి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. మోసం చేసి రెండోపెళ్లి..విడాకులు 2011లో గోదావరిఖనికి ఎలకపల్లికి చెందిన యువతిని ప్రే మించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు తెలియకుండా 2014 మే 18న కేశవపట్నం మండలంలోని ఒక గ్రామానికి చెందిన అ మ్మాయిని రెండోవివాహం చేసుకున్నాడు. అనుమానం వచ్చి న రెండో భార్య కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా రమేశ్, అతడి కుటుంబసభ్యులను అరెస్టు చేయగా తర్వాత రెండోభార్య రమేశ్‌తో విడాకులు తీసుకుంది. పక్కా ప్రణాళికతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ దోమల రమేశ్ ఆగడాల గురించి సమాచారమందుకున్న కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ బుధవారం ఉదయం హుజురాబాద్‌లో పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. అతడిని విచారించగా మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుత సమాచారంతో ఎల్ఎండీ, హుజురాబాద్, గోదావరిఖని వన్‌టౌన్‌లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం నాలుగు రోజుల కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిపారు. రమేశ్‌వల్ల నష్టపోతే కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు లేదా సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రష్మిపెరుమాల్, టాస్క్‌ఫోర్స్ సీఐలు ప్రకాశ్, శశిధర్‌రెడ్డి, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
కమలాకర్ రెడ్డి మృతి తీరని లోటు
‘‘పంపిణీదారుడు, నిర్మాత గుండాల కమలాకర్ రెడ్డి మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు’’ అని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ అన్నారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాకర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ఆయన సంతాప సభలో చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం ‘అభయ్’ సినిమాతో కమలాకర్ రెడ్డి, జనార్దన్ నాకు పరిచయం. కమలాకర్ మన మధ్య లేకపోయినా అతని మంచి ఆశయాలు మనతోనే ఉంటాయి’’ అన్నారు. ‘‘300 యోధులు, 1000 బీసీ, బలాదూర్’ వంటి ఎన్నో మంచి చిత్రాలను పంపిణీ చేశారు కమలాకర్ రెడ్డిగారు. ముంబయ్‌లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కమలాకర్‌గారి కె.ఎఫ్.సి సంస్థను సంప్రదించేవి. జనార్దన్‌గారు కమలాకర్‌గారి కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నా’’ అన్నారు నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్. ‘‘మంచి సినిమాలు చేస్తూ పంపిణీదారునిగా మంచి పేరున్న కమలాకర్ రెడ్డిగారు మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం’’ అని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, నిర్మాత ముత్యాల రామ్‌దాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు వి.ఎల్. శ్రీధర్, ‘ఈనాడు’ సినిమా నిర్మాత కుమార్ బాబు, ‘మాతృదేవోభవ’ దర్శకుడు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాత కమలాకర్ రెడ్డి మృతి
నిర్మాత, పంపిణీదారుడు గుండాల కమలాకర్‌రెడ్డి (48) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో కమలాకర్ కూడా ఒకరు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారినపడ్డారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొస్తుండగా నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కమలాకర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాకు కమలాకర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘అర్జు¯Œ రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి హిట్ చిత్రాలతో పాటు పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా ఆయన పంపిణీ చేశారు. కమలాకర్ రెడ్డి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అంబులె¯Œ్స డ్రైవర్ని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. -
విషాదం: రోడ్డు ప్రమాదంలో నిర్మాత దుర్మరణం
సాక్షి, నల్గొండ: టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్‌రెడ్డి ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రికుమారులు ఇద్దరూ మృత్యువాత పడటడంతో వారి కుటుంబం విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సీ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేగాక తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలను పంపిణీ చేశారు. పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. (చదవండి: నేను చచ్చిపోయినా వాళ్లింతే: సీరియల్ నటి) ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డికి మెరుగైన చికిత్స అందించెందుకు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి అంబులెన్స్‌లో ఈ రోజు బయలుదేరారు. ఈ క్రమంలో అంబులెన్స్ నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘బ్యాండ్ బాలు’స్టిల్స్


