breaking news
Kakatiya Nagar
-
వరంగల్ రూరల్: కాకతీయనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
-
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గోదావరిఖని (కరీంనగర్) : హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని కాకతీయ నగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రామ నూతన్(16) హన్మకొండలోని విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లడానికి సిద్దమవుతున్నాడు. అయితే తనకు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేదని, ఇంట్లోనే ఉండి చదువుకుంటానని తల్లిదండ్రులతో అన్నాడు. ఈ ఒక్క సంవత్సరం పూర్తి చేసి తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేయమని తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన నూతన్ గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం
ఖమ్మం: జిల్లాలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. ఇల్లందులోని కాకతీయనగర్ లో సుమారు 2 కోట్ల రూపాయల వరకూ ఆ మహిళ వసూలు చేసి పరారైనట్టు తెలుస్తోంది. చిట్టీల పేరుతో కొందరి దగ్గర సొమ్ము తీసుకుని వ్యాపారం చేస్తున్న ఆ మహిళ సోమ్ము అందగానే ఉడాయించింది. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.