breaking news
Kakatiya history
-
నీలకంఠేశ్వరా..ద్విలింగ రూపుడా
కాకతీయ చరిత్రకు నిదర్శనం – ఢిల్లీ సుల్తానుల దాడిని ఎదుర్కొన్న దేవాలయ ప్రాంతం రెండు శివలింగాలుండడం ఇక్కడి ప్రత్యేకం మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి వారి చరిత అనేకం కాకతీయుల కాలంలో విరాజిల్లి పూజలందుకున్న పవిత్ర లింగం..900 ఏళ్లు శిథిలాల్లో కలిసి బయల్పడిన మహిమాన్విత లింగం..మరెక్కడా లేనివిధంగా భూగర్భంలో పూజలందుకుంటున్న నీలకంఠేశ్వర లింగం..మణుగూరులో దర్శనమిస్తోంది. ఇక్కడికొస్తే భక్తిభావమే కాదు..చారిత్రక ఆనవాళ్లను మననం చేసుకోవచ్చు. గరళకంఠుడైన మహాశివుడు..ఇక్కడి ఆలయంలో పానవట్టం కింద ఉన్న శివలింగంతో పాటు, కచ్చితంగా అదే స్థానంలో ఆలయం కిందిభాగంలో పూజలందుకోవడం..అరుదైన, అద్వితీయ అనుభూతిని అందిస్తోంది. భక్తి, ఆరాధనతో కొలిస్తే..పునీతం చేస్తోంది. – మణుగూరు శతాబ్దాల చరితం..దర్శిస్తే పునీతం మణుగూరులోని కాకతీయుల కాలంనాటి శ్రీ నీలకంఠేశ్వరాలయం కాకతీయుల చరిత్రకు మచ్చుతునకగా నిలుస్తోంది. చరిత్రను పరిశీలిస్తే ఈ ఆలయాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు 1161లో నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కోటకట్ట అనేవారు. ఈ ఊరిని మణిపురంగా పిలిచేవారు. కాకతీయుల కాలంలో విరాజిల్లిన నీలకంఠేశ్వరాలయాన్ని అనంతర కాలంలో మహ్మదీయ రాజులైన ఢిల్లీ సుల్తానులు 1162లో ధ్వంసం చేశారు. ఇక్కడ శిథిలాలు, మట్టిదిబ్బలో శివలింగం ఉండింది. ఇక్కడికి సమీపంలోని ప్రాచీన వేణుగోపాలస్వామి ఆలయంలో కన్నె వీరభద్రయ్య అనే ఓ సన్యాసి ఉండగా..ఆయనకు కలలో శివలింగం ఉన్నట్లు కనిపించడంతో మట్టిదిబ్బను తన శిశ్యులు మల్లిడి లాలయ్య, పూజారి తాతయ్య, పాల్వాయి రామచంద్రయ్య, కందుకూరి అనంతరామయ్యలతో 1958లో తవ్వించారు. దాదాపు 900 ఏళ్లతర్వాత ఇక్కడ భూగర్భంలో శివలింగం బయల్పడింది. ఇనేళ్ల చరిత కలిగిన స్వామివారిని పూజిస్తే జీవితం పునీతం అవుతుందని భక్తుల విశ్వాçÜం. ======================= భూగర్భ దర్శనం..స్వామివారి ప్రత్యేకం శివలింగంతో పాటు బయల్పడిన నంది, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిషి్ఠంచారు. శివలింగాన్ని భూగర్భం నుంచి పైకి తెచ్చి ఆలయం నిర్మించాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో..అప్పటి నుంచి ఇలా భూగర్భంలోనే ఉంచుతున్నారని స్థానికులు మల్లిడి లాలయ్య తెలిపారు. 1995 తర్వాత పలువురు దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. భూగర్భంలో ఉన్న శివలింగాన్ని యథావిథిగా ఉంచేసి..పైభాగంలో మరోటి ప్రతిషి్ఠంచారు. భూగర్భంలో ఉన్న లింగానికి సీలింగ్ పైభాగంలో జాలీ ఏర్పాటు చేసి..రెండు లింగాలకు పానవట్టాలు ఉంచారు. ఇక్కడ ఒకేసారి భూగర్భంలో, పైభాగంలో స్వామివార్లను దర్శించుకోవడాన్ని భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించి పులకిస్తుంటారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయంలో శివరాత్రి, కార్తీక మాస పూజలను ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయ పూజారిగా రామచంద్రమూర్తి వ్యవహరిస్తున్నారు. శివలింగానికి గోదావరి జలాలతో సహస్ర ఘటాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. -
కాకతీయ మహోత్సవం
హన్మకొండ అర్బన్ : కాకతీయుల చరిత్రను భావితరాలకు తెలియజేసేలా కాకతీయ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మహోత్సవాలు 2015 జనవరి 9,10,11 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ రానున్నారు. ఉత్సవాల ఏర్పాట్ల విధివిధానాలు ఖరారు చేసేందుకు శనివారం హైదరాబాద్‌లోని పర్యాటక భవన్లో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో ఉత్సవాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ హరికృష్ణ, కలెక్టర్ జి.కిషన్, సమాచార శాఖ సంచాలకులు సుభాష్‌గౌడ్ హాజరయ్యారు. పది జిల్లాల్లో నిర్వహణ కాకతీయ మహోత్సవాల పేరిట మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో 9, 10,11 తేదీల్లో వరంగల్‌తోపాటు మిగతా తొమ్మిది జిల్లాల్లో కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తేదీలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకతీయ సామ్రాజ్యంలో అలరారిన కళాసంపదతోపాటు వారసత్వ కళలను, ప్రజాదరణ పొందిన గ్రామీణ కళలను ప్రతిభింబించేలా ఉత్సవాలు నిర్వహించలన్నారు. ప్రధానంగా కాకతీయ పాలకుల కళాపోషణ, సాంస్కృతిక పరిరక్షణ, ప్రజారంజక పాలన తదితర అంశాలను ప్రతిబింబిచేలా ఉత్సవాలు నిర్వహించేందుకు కలెక్టర్లను సంప్రదించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు, వరంగల్ కలెక్టర్ అందజేస్తారని తెలిపారు. జిల్లాలో కార్యక్రమాల కోసం రాష్ట్రం నుంచి కళా బృందాలు పంపనున్నట్లు తెలిపారు. స్థానిక కళలు ప్రస్పుటించేలా కార్యక్రమాలు ఉండేలా చూడాలని అన్నారు. ఉత్సవ శోభ ఉట్టిపడేలా.. ఉత్సవ శోభ ఉట్టిపడేలా మూడు రోజులపాటు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని పర్యాటక శాఖ అడిషన్ చీఫ్ శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా కాకతీయ వైభవం ఉట్టిపడేలా జ్ఞాపికలు రూపొందించాలని అన్నారు. జిల్లాలో నిర్వహించే ఉత్సవాల్లో కళాకారులు, మేధావులు, జిల్లాలోని ప్రముఖులతో ర్యాలీ నిర్వహించాలి. ఉత్సవాల నిర్వాహణ కోసం అందరికీ ఆమోద యోగ్యంగా ఉండే స్థలం ఎంపిక చేయాలని అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చూడాలని సూచించారు. కాకతీయుల కళా సంపదను ప్రతిబింబించేలా కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు తయారు చేయాలని అన్నారు. ప్రాచీన క్రీడలను నిర్వహించాలని, ఉత్సవాల ప్రాంగణంలో పూర్తిగా పండగ వాతావరణం ఉండేలా చూడాలని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. కొత్తవారికి పింఛన్ల పంపిణీ కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చేసే ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కళాకారుల పింఛన్ల కోసం అర్హులను, కొత్తవారిని ఎంపిక చేసి పంపిణీకి చర్యలు తీసుకోవాలని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు. ప్రపంచానికి చాటి చెప్పేలా.. గత ఉత్సవాలను జిల్లాకు మాత్రమే పరిమితం చేశామని.. ప్రస్తు తం తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల చరిత్ర ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచిందని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. ఉత్సవాల్లో ఒకరోజు పూర్తిగా స్థానిక కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేసేలా సమాచార శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్టాక్ ప్రతినిధులు ప్రొఫెసర్ పాండురంగారావు, అనురాధరెడ్డి, పురావస్తు శాఖ సంచాలకులు మనోహర్, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు, అధికారులు పాల్గొన్నారు.