breaking news
jumping in front of a train
-
ఘోరం: రైలుపట్టాలపై వ్యక్తి, కాపాడబోయిన..
క్రైమ్: మధ్యప్రదేశ్ భిండ్‌లో ఘోరం చోటు చేసుకుంది. రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా.. అతన్ని కాపాడబోయి ఓ యువకుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. ఈ ఇద్దరూ తండ్రీకొడుకులు కావడం గమనార్హం. భిండ్ రైల్వే స్టేషన్ సమీప కాలనీలో నివసించే హరి సింగ్ నరవరియా(55) రోజూ ఇంట్లో వాళ్లతో గొడవ పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. ఆదివారం ఉదయం మరోసారి గొడవ జరగడంతో తాను బతకనంటూ ఇంట్లోంచి పరుగులు తీశాడు. కాసేపటికి తన తండ్రి రైలు పట్లాల మధ్యలో నిల్చుని ఉండడం గమనించాడు కొడుకు మున్నేష్. వెంటనే పరుగులు తీసి ఆయన్ని కాపాడబోయాడు. పక్కకి తప్పించే క్రమంలో.. రైలు వేగంగా దూసుకురావడంతో ఢీకొట్టి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న భిండ్ ఆర్పీఎఫ్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: మోసపోయాను.. నన్ను క్షమించండి -
రైలు కిందపడి యువకుడు మృతి
అనంతపురం : అనంతపురం రూరల్ పరిధిలోని సోముల్‌తొట్టి గ్రామ రైల్వే ట్రాక్‌పై పడుకుని వెంకటేశ్(22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రితో గొడవపడి మనస్తాపంతో ఈ పనికి ఒడిగట్టినట్లు సమాచారం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.