breaking news
in july
-
‘ఆటో’ సేల్స్ అదుర్స్
న్యూఢిల్లీ: దేశీయ వాహన పరిశ్రమ జూలైలో ఇప్పటివరకు అత్యుత్తమ విక్రయాలను నమోదు చేసింది. ప్రయాణికుల వాహన(పీవీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 34.3% పెరిగి 4,57,810 యూనిట్లకు చేరాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాది జూలైలో పీవీ సేల్స్ 3,40,772 యూనిట్లుగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి ద్విచక్ర వాహనాల విక్రయాలు 22.6 శాతం వృద్ధితో 19,23,483 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో ఇవి 15,69,120 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రిచక్ర వాహన సేల్స్ 33.4 శాతం పెరిగి 92,560 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 69,403 యూనిట్లుగా ఉన్నాయి. ‘భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ జూలైలో ఇప్పటివరకు అత్యుత్తమ విక్రయాలను నమోదు చేసింది. పీవీలు, త్రిచక్ర, ద్విచక్ర వాహనాల విభాగాల్లో బలమైన రెండంకెల వృద్ధి నమోదైంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ సానుకూల ధోరణి పండుగల సీజన్లోకి ప్రవేశిస్తున్న వేళ కూడా కొనసాగుతోంది. ఈసారి వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉంటుందని ఆశిస్తున్నాము’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
వర్షం లోటే...
జూలైలో ముఖం చాటేసిన వరుణుడు ∙ చివరిలో కాస్త ఆశాజనకం అమలాపురం : జూలైలో వరుణుడు ముఖం చాటేశాడు. జిల్లాలో సగటు కన్నా తక్కువ వర్షం కురవడంతో అన్నదాత నిరాశ చెందుతున్నాడు. నెల చివరిలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షం తప్ప చెప్పుకునేంత వర్షం లేదు. జిల్లా వ్యాప్తంగా 239 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 189.5 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. జిల్లావ్యాప్తంగా 20.8 లోటు వర్షం పడింది. మెట్టలోని తుని, కోటనందూరు, జగ్గంపేట, పెద్దాపురం మండలాల్లో మాత్రం సగటు కన్నా ఎక్కువ వర్షం నమోదవగా, మిగిలిన మెట్ట, డెల్టా, ఏజెన్సీ మండలాల్లో తక్కువ వర్షం పడింది. కడియం, తాళ్లరేవు, కె.గంగవరం మండలాల్లో వర్షపు లోటు ఎక్కువగా ఉంది. అయితే వర్షాకాలం ఆరంభమైన తరువాత జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఒకటి వరకు కురిసిన వర్షం సగటు కన్నా 24 శాతం అధికంగా ఉండడం విశేషం. జూన్ నెలలో రికార్డు స్థాయిలో వర్షం కురవడం వల్ల అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలు మొఖం చాటేయడం వల్ల ఖరీఫ్ సాగుకు ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా మెట్టలోని ఏలేరు, పంపా, చెరువుల ఆయకట్టు పరిధిలో సాగు ముందడుగు పడడం లేదు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఖరీఫ్ ప్రశ్నార్ధకంగా మారింది.


