breaking news
joyfull
-
52 ఏళ్ల తర్వాత ఆడ సంతానం.. అగర్వాల్ ఇంట్లో సందడి!
ఇండోర్: మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం తర్వాత ఓ కుటుంబంలో ఆడపిల్ల జన్మించడంతో ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. ఏకంగా 52 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో పసిపాప కేరింతలు వినిపించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇండోర్ కు చెందిన ముస్కాన్ అగర్వాల్ దంపతులకు ఇటీవల పసిపాప జన్మించింది. అయితే, ఈ జననం సాధారణమైనది కాదు.ఆ కుటుంబంలో గత 52 సంవత్సరాలుగా కేవలం మగ సంతానం మాత్రమే పుడుతూ వస్తోంది. ఐదు దశాబ్దాలకు పైగా ఆ కుటుంబంలో ఒక్క ఆడపిల్ల కూడా జన్మించలేదు. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా సాగిన ఈ సుదీర్ఘ నిరీక్షణకు తాజాగా తెరపడింది. తమ ఇంట్లో నూతన అతిథిగా మహాలక్ష్మి ప్రవేశించడంతో ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచిన డాక్టర్ బేలా షా జైన్ ఈ భావోద్వేగ క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి పసిపాపను బయటకు తీసుకొచ్చిన క్షణంలో కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందభాష్పాలు రాలినట్లు ఆమె తెలిపారు.‘కొన్నిసార్లు అద్భుతాలు జరగడానికి తరాలే పడతాయి" అంటూ ఆమె ఈ సంఘటనపై హృదయాలను హత్తుకునే వ్యాఖ్యలు రాశారు. 52 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కుటుంబంలో తొలిసారిగా ఆడపిల్ల పుట్టడంతో ఇండోర్ లోని ఆ ఆస్పత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవజాత శిశువు తల్లి ముస్కాన్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ అద్భుతమైన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన డాక్టర్ బేలా షా జైన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తూ కుటుంబ సభ్యులకు అభినందనలు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ‘ఫ్రంట్ కెమెరా’పై ప్రముఖ నటుడు ఎగతాళి! -
బీచ్లో కుమారుడితో ఎంజాయ్ చేస్తోన్న అగ్ర నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)
-
పార్టీలో ఎంజాయ్ చేసిన స్టార్ హీరోయిన్ చెల్లెలు (ఫోటోలు)
-
జలోత్సాహం..
-
‘అంత్య’ శోభితం
భద్రాచలం తరలివస్తున్న భక్తులు రెండో రోజు 20వేల మంది స్నానాలు అంత్య పుష్కర శోభితంగా గోదావరి తీరం.. 20వేల మందికి పైగా పుణ్యస్నానం.. రెండోరోజు సోమవారం కూడా పుష్కరాలకు భక్తులు భారీగానే తరలివచ్చారు. పసుపు, కుంకుమ, నవధాన్యాలు, వస్త్రాలను గౌతమి మాతకు సమర్పించారు. నదిలో దీపాలు వదిలి.. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. ముల్తైదువుల వాయినాలు.. బంధుమిత్రుల కోలాహలం.. భక్తజనంతో గోదావరి తీరం పులకించింది. భద్రాచలం : గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా రెండో రోజు సోమవారం కూడా భక్తుల సందడి కొనసాగింది. భద్రాచలంలో సుమారు 20వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రామాలయ దర్శనం, పుష్కరస్నానం చేసుకునే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు గోదావరి స్నానఘట్టాల రేవులో సందడి కనిపించింది. గౌతమి తీరానికి చేరుకున్న భక్తులు ముందుగా పుణ్యస్నానాలు ఆచరించి, గోదారమ్మకు పసుపు, కుంకుమ, నవధాన్యాలు, వస్త్రాలను సమర్పించారు. మెట్ల రేవులో తులసి మొక్కలను ఏర్పాటు చేసి, పూజలు చేసి, దీపాలు వెలిగించి.. వాటిని భక్తి శ్రద్ధలతో గోదావరిలో వదిలారు. కృష్ణా పుష్కరాలకు ముందు వచ్చిన గోదావరి అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. గోదావరిలో నీరు నిండుగా ఉండటంతో పిల్లలు, పెద్దలు ఆహ్లాద వాతావరణంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. పుష్కర స్నానం పూర్తయిన తరువాత పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామివారికి పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించి రామాలయాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్ధసారథి కుటుంబ సమేతంగా గోదావరిలో పుష్కరస్నానం చేశారు. గోదావరి ఒడ్డున పూజలు నిర్వహించి నదిలో దీపాలు వదిలారు. ఉత్సవమూర్తులకు సహస్రనామార్చన అంత్య పుష్కరాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారికి సహస్ర నామార్చన చేశారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో వేడుక అత్యంత వైభవంగా సాగింది. క్షేత్రమహాత్మ్యంపై ఆలయ వేదపండితులు ప్రవచనాలిచ్చారు. స్వామివారికి నిత్యకల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దేవస్థానం వేదపండితులు, అర్చకులు ఊరేగింపుగా గోదావరి తీరానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి గోదారమ్మకు హారతులు ఇచ్చారు. తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శ్రీసీతారామచంద్రస్వామి వారికి ప్రభుత్వ సేవ జరిపించారు.


