breaking news
japanese pm
-
జపాన్ ప్రధానికి మోదీ సాదర స్వాగతం
-
జపాన్ ప్రధానికి మోదీ సాదర స్వాగతం
అహ్మదాబాద్ : జపాన్ ప్రధానమంత్రి షింజో అబే బుధవారం భారత్ చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. షింజో అబే సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో గుజరాత్ విచ్చేశారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీతో కలిసి ఆయన సబర్మతీ ఆశ్రమంతో పాటు సిద్ది సయ్యద్ మసీదును సందర్శించనున్నారు. అలాగే ఇండో-జపాన్ వార్షిక సదస్సు సహా పలు కార్యక్రమాల్లో ఇద్దరు ప్రధానులు పాల్గొంటారు. అలాగే గురువారం అహ్మదాబాద్ - ముంబై మధ్య తొలి హైస్పీడ్ రైలు పనుల ప్రారంభ కార్యక్రమంలో షింజో అబే పాల్గొంటారు. జపాన్ ప్రధాని రాక సందర్భంగా అహ్మదాబాద్ సర్వాంగ సుందరంగా తయారైంది. మరోవైపు భద్రతా ఏర్పాట్ల కోసం నగరంలోని పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల పోలీసులు కూడా మోహరించారు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్‌కు చెందిన 12 కంపెనీల బలగాలతో పాటు బాంబ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, ఎన్ఎస్జీ కమాండోల బృందం పహరా కాస్తున్నాయి. -
ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!!
కెమెరాతో కూడిన ఒక డ్రోన్ జపాన్ ప్రధాని షింజో అబె ఇంటిమీద కనపడింది. దీంతో ప్రధాని భద్రత గురించి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ డ్రోన్ ఎక్కడినుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చిందన్న విషయం తెలియలేదు. 50 సెంటీమీటర్ల వింగ్స్పాన్ ఉన్న ఈ డ్రోన్ ప్రధాని అధికారిక నివాసం పైకప్పు మీద పడింది. సెక్యూరిటీ సిబ్బంది దాన్ని గమనించారని ఎఫె వార్తా సంస్థ తెలిపింది. అబె ప్రస్తుతం ఏషియా-ఆఫ్రికన్ సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేసియాలోని జకార్తాలో ఉన్నారు. భద్రతా అధికారులు డ్రోన్‌ను పరిశీలించారు. అందులో పేలుడు పదార్థాలు ఏవీ లేవని నిర్ధారించారు. జనవరి నెలలో ఇలాగే అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ లాన్లో ఓ డ్రోన్ పడింది. ఇప్పుడు జపాన్ ప్రధాని వంతు అయింది.