ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!! | Drone found on roof of Japanese PM residence | Sakshi
Sakshi News home page

ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!!

Apr 22 2015 3:45 PM | Updated on May 25 2018 1:14 PM

ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!! - Sakshi

ప్రధాని ఇంటిపై కెమెరా డ్రోన్!!

కెమెరాతో కూడిన ఒక డ్రోన్ జపాన్ ప్రధాని షింజో అబె ఇంటిమీద కనపడింది. దీంతో ప్రధాని భద్రత గురించి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

కెమెరాతో కూడిన ఒక డ్రోన్ జపాన్ ప్రధాని షింజో అబె ఇంటిమీద కనపడింది. దీంతో ప్రధాని భద్రత గురించి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ డ్రోన్ ఎక్కడినుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చిందన్న విషయం తెలియలేదు. 50 సెంటీమీటర్ల వింగ్స్పాన్ ఉన్న ఈ డ్రోన్ ప్రధాని అధికారిక నివాసం పైకప్పు మీద పడింది.

సెక్యూరిటీ సిబ్బంది దాన్ని గమనించారని ఎఫె వార్తా సంస్థ తెలిపింది. అబె ప్రస్తుతం ఏషియా-ఆఫ్రికన్ సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేసియాలోని జకార్తాలో ఉన్నారు. భద్రతా అధికారులు డ్రోన్ను పరిశీలించారు. అందులో పేలుడు పదార్థాలు ఏవీ లేవని నిర్ధారించారు. జనవరి నెలలో ఇలాగే అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ లాన్లో ఓ డ్రోన్ పడింది. ఇప్పుడు జపాన్ ప్రధాని వంతు అయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement