breaking news
Japan people
-
handsome weeping boys: కరువుతీరా ఏడ్చెయ్యండి! వీపింగ్ బాయ్ తుడిచేస్తాడు!
కోపం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ఇతర దేశాల వారికంటే జపాన్ వాసులు వెనుకబడి ఉన్నారు. దీంతో వారు చేసే ఉద్యోగ, వ్యాపారాల్లో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆయా కంపెనీల రెవెన్యూలపై ప్రభావం పడుతోంది. ఇది గమనించిన అక్కడి కంపెనీలు ‘హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్’ పేరిట పరిష్కార మార్గం వెతికాయి. ఉద్యోగులు పెట్టే కన్నీరు తుడిచి వారిని ఓదార్చడమే ఈ హ్యాండ్సమ్ వీపింగ్ బాయిస్ పని. ఉద్యోగి మనసులోని భారం మొత్తం దిగిపోతే మరింత చురుగ్గా పనిచేస్తారు. దీనికోసం అందంగా ఉండే అబ్బాయిలను వీపింగ్ బాయిస్‌గా నియమించుకుంటున్నాయి. ఏడ్పించి... కంపెనీలోని కొంతమంది ఉద్యోగులను ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. వీరందరికి ఏడుపు వచ్చే సినిమాలు చూపిస్తారు. వీటిలో పెంపుడు కుక్కలను బాధించేవీ,తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలు వంటి సన్నివేశాలు ఉంటాయి. అవి చూస్తూ బాధ కలిగిన వెంటనే ఉద్యోగులు గొంతు విప్పి మనసారా ఏడవచ్చు. ఇలా ఏడుస్తోన్న వ్యక్తి కన్నీళ్లను హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్ కాటన్ కర్చీఫ్‌తో ప్రేమగా తుడుస్తాడు. ఇలా అక్కడ ఉన్న వారందరి బాధను వీపింగ్ బాయ్ తన ప్రేమతో, ఓదార్పు మాటలతో పూర్తిగా ఓదార్చుతాడు. ఇలా కంపెనీ ఉద్యోగుల కన్నీరు తుడిచేసి మరీ చక్కగా పనిచేయించుకుంటున్నాయి జపాన్ కంపెనీలు. ఒకసారి నలుగురిలో కన్నీరు పెట్టడం అలవాటైతే వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అని వారు చెబుతున్నారు. టోక్యోకు చెందిన ‘క్రైయింగ్ వర్క్‌షాపు’ వ్యవస్థాపకుడు హిరోకి టెకాయ్కు వచ్చిన ఐడియానే వీపింగ్ బాయ్. ఆలోచన వచ్చిన తరవాత అనేక వర్క్ షాపులు నిర్వహించి ఈ వీపింగ్ బాయ్‌ను అమలులోకి తెచ్చి పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తన ఆఫీసులోనే వీపింగ్ బాయిస్‌ను నియమించడం మొదలు పెట్టాడు. వర్క్‌షాపులను అందమైన అబ్బాయిలు చక్కగా నిర్వహించడంతో హ్యాండ్సమ్ బాయిస్‌ను వీపింగ్ బాయిస్‌గా ఎంచుకున్నాడు. అందమైన అబ్బాయిలు ఓదార్పునిస్తే కొత్త ఉత్సాహం కలుగుతుంది. అందుకే అందమైన అబ్బాయిలను ఈ పనికి ఎన్నుకున్నట్లు టెకాయ్ చెబుతున్నాడు. ఆ మధ్య నవ్వడం నేర్చుకోవడం మొదలు పెట్టి జపాన్ ఉద్యోగులు నేడు నలుగురిలో సిగ్గుపడకుండా ఏడవడం నేర్చుకోవడం కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ... గుంyð ల్లో ఉన్న భారం దిగిపోతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సిగ్గు, బిడియం, బాధ పోయినప్పుడు అందరితో కలిసి మెలిసి తిరగగలుగుతారు. -
టోక్యో ఒలింపిక్స్‌లో ప్రేక్షకులకు అనుమతి
టోక్యో: ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కేవలం జపాన్ వాసులకే పరిమితం చేశారు. అంతేకాకుండా గేమ్స్ జరిగే వేదికల కెపాసిటీలో 50 శాతం మంది ప్రేక్షకుల (అది కూడా 10 వేలకు మించకుండా)ను అనుమతించనున్నారు. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహించడం మంచిదని ఆర్గనైజర్లకు జపాన్ దేశ ప్రముఖ వైద్య సలహాదారుడు షిగెరు ఒమీ సూచించగా.. ఆ సూచనను ఆర్గనైజర్లు పట్టించుకోలేదు. ఒలింపిక్స్ జరిగే సమయంలో కరోనా కేసులు పెరిగితే అప్పుడు ప్రేక్షకులు లేకుండానే ఈవెంట్‌ను నిర్వహించేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో తెలిపారు. కరోనా కారణంగా ఈసారి ఒలింపిక్స్ క్రీడలను తిలకించేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించడం లేదు. -
టోక్యో ఒలింపిక్స్ ఆగవు...
ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నా... మరోవైపు జపాన్ ప్రజలు నిరసనలు చేస్తున్నా... టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఆగిపోవని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికార ప్రతినిధి మార్క్ ఆడమ్స్ స్పష్టం చేశాడు. ‘మీకు మరోసారి స్పష్టంగా చెబుతున్నా. టోక్యో గేమ్స్ ఈ ఏడాది జరిగేలా ఐఓసీ ఇప్పటికే తీర్మానం చేసింది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు’ అని ఆడమ్స్ వ్యాఖ్యానించాడు. -
పదహారేళ్ల పెంపకం
సాంకేతికత జపాన్ ప్రజల్లో ఎంతగా భాగమైందో తెలుసుకోవాలంటే ఈ దృశ్యాన్ని పరిశీలిస్తే చాలు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో పిల్లినో, కుక్కపిల్లనో పెంచుకోవడం జరుగుతుంది. అయితే జపాన్ జనులు మాత్రం జంతువులతో గాక యంత్రాలతోనే సావాసం చేస్తున్నారు. 1999లో సోనీ కంపెనీ వాళ్లు పెంపుడు రోబోలను తయారుచేసి మార్కెట్లోకి వదిలారు. చిత్రంలో కనిపిస్తున్నది అలాంటి వాటిలో ఒకటి. దానికి ‘ఐబో’ అనే పేరు పెట్టుకొని పెంచుకొంటున్నావిడ పేరు హిడేకోమోరీ. దాదాపు పదహారేళ్ల నుంచి ఆమె దాన్ని ఆడిస్తూ.. దాంతో ఆడుకొంటూ వినోదాన్ని పొందుతోంది!