టోక్యో ఒలింపిక్స్‌లో ప్రేక్షకులకు అనుమతి

Tokyo Olympics will allow spectators who live in Japan - Sakshi

టోక్యో: ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కేవలం జపాన్‌ వాసులకే పరిమితం చేశారు. అంతేకాకుండా గేమ్స్‌ జరిగే వేదికల కెపాసిటీలో 50 శాతం మంది ప్రేక్షకుల (అది కూడా 10 వేలకు మించకుండా)ను అనుమతించనున్నారు. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహించడం మంచిదని ఆర్గనైజర్లకు జపాన్‌ దేశ ప్రముఖ వైద్య సలహాదారుడు షిగెరు ఒమీ సూచించగా.. ఆ సూచనను ఆర్గనైజర్లు పట్టించుకోలేదు. ఒలింపిక్స్‌ జరిగే సమయంలో కరోనా కేసులు పెరిగితే అప్పుడు ప్రేక్షకులు లేకుండానే ఈవెంట్‌ను నిర్వహించేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో తెలిపారు. కరోనా కారణంగా ఈసారి ఒలింపిక్స్‌ క్రీడలను తిలకించేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించడం లేదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top