breaking news
Jammu-Srinagar highway
-
లోయలో పడ్డ తవేరా..10 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ హైవేపై రంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. తవేరా ట్యాక్సీ అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. డ్రైవర్‌తో పాటు అందరూ చనిపోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జమ్మూకశ్మీర్ లో హైవేల మూసివేత
జమ్మూ: భారీ వర్షాలు, హిమపాతంతో జమ్మూకశ్మీర్ లో జనజీవన స్తంభించింది. మంచు బాగా కురుస్తుడడంతో పలు రహదారులు మూతపడ్డాయి. శ్రీనగర్-లెహ్, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారులను మూసివేశారు. గత 24 గంటలుగా వర్షాలు కురుస్తుండడంతో రామబాన్ జిల్లాలోని రామసో, మాగర్ కోటె ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేయాల్సి వచ్చిందని, కశ్మీర్ లోయలోని ప్రజలకు వస్తువులు సరఫరా చేస్తున్న దాదాపు 500 వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. భారీ హిమపాతంతో శ్రీనగర్-లెహ్ రహదారిని మూసేశారు. రోడ్డు 2 అడుగుల మేర మంచు పేరుకుపోయిందని, దీంతో వాహనాలను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.