breaking news
James Corden
-
కారులో కూచొని మిషెల్లీ ఏం చేసిందంటే?
సాక్షాత్తూ అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లీ కారు ఫ్రంట్ సీటులో కూర్చొని.. జాలీజాలీగా పాటలు పాడుతూ.. చిందులు వేశారంటే మీరు నమ్ముతారా?.. కానీ, మిషెల్లీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓ మ్యూజిక్ వీడియోలో ఇలాగే కనిపించారు. కారు ఫ్రంట్ సీటులో కూర్చోవడమే కాదు మిషెల్లీ ర్యాప్ సాంగ్ పాడుతూ.. ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ ‘కార్‌పూల్ కారావుకే’ మ్యూజిక్ వీడియోలో హల్చల్ చేశారు. ఈ వీడియోలో ఆమెతోపాటు సింగర్లు జేమ్స్ కార్డన్, మిస్సీ ఎలియట్ అద్భుతంగా పాట పాడుతూ ధూమ్ ధాం చేశారు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి. -
బోయ్‌ఫ్రెండు కావాలంటున్న హీరోయిన్
ప్రముఖ గాయని, హీరోయిన్ సెలెనా గోమెజ్‌కు ఓ బోయ్ ఫ్రెండు కావాలట. ఇంతకుముందు తనతో కలిసి కార్ పూల్ కరావోకే షో హోస్ట్ అయిన జేమ్స్ కార్డెన్కు ఈ బాధ్యత అప్పజెప్పింది. తనకు మంచి బోయ్‌ఫ్రెండును చూసిపెట్టాలని కార్డెన్ను కోరిందీ అమ్మడు. ఈనెల 20వ తేదీన వీళ్లిద్దరూ కలిసి కార్‌పూల్ కారవోకే ఎపిసోడ్ చేశారు. ఆ సెషన్లో 23 ఏళ్ల సెలెనా తన హిల్ ఆల్బంల లోంచి కొన్ని పాటలు పాడింది. తన జీవితం గురించి, ప్రేమ గురించి కూడా చాలా ముచ్చట్లు చెప్పింది. టేలర్ స్విఫ్ట్ స్క్వాడ్ చాలా సెక్సీగా ఉంటుందని, అందులో సెలెనా గోమెజ్ కూడా ఉంటే మరింత బాగుంటుందని కార్డెన్ కామెంట్ చేశాడట. అయితే అందులో అందరూ అమ్మాయిలే ఉన్నారు తప్ప అబ్బాయిలను అసలు పిలవడం లేదని బుంగమూతి పెట్టుకున్నాడట. సరిగ్గా అదే సమయంలో సెలెనా గోమెజ్ కలగజేసుకుని, ముందు తనకో బోయ్‌ఫ్రెండును చూసిపెట్టాలని కోరింది. దాంతో కుర్రాడు ఒక్కసారిగా షాకయ్యాడట. నిజంగా కొత్త బోయ్ప్రెండు కోసం వెతుకుతున్నావా అని అడిగితే.. అవును, అందులో తప్పేంటని వాదించిందట ఆ బుల్లెమ్మ.