బోయ్ఫ్రెండు కావాలంటున్న హీరోయిన్ | Selena Gomez wants James Corden to find her a new boyfriend | Sakshi
Sakshi News home page

బోయ్ఫ్రెండు కావాలంటున్న హీరోయిన్

Jun 22 2016 8:53 AM | Updated on Sep 4 2017 3:08 AM

బోయ్ఫ్రెండు కావాలంటున్న హీరోయిన్

బోయ్ఫ్రెండు కావాలంటున్న హీరోయిన్

ప్రముఖ గాయని, హీరోయిన్ సెలెనా గోమెజ్కు ఓ బోయ్ ఫ్రెండు కావాలట. ఇంతకుముందు తనతో కలిసి కార్ పూల్ కరావోకే షో హోస్ట్ అయిన జేమ్స్ కార్డెన్కు ఈ బాధ్యత అప్పజెప్పింది.

ప్రముఖ గాయని, హీరోయిన్ సెలెనా గోమెజ్కు ఓ బోయ్ ఫ్రెండు కావాలట. ఇంతకుముందు తనతో కలిసి కార్ పూల్ కరావోకే షో హోస్ట్ అయిన జేమ్స్ కార్డెన్కు ఈ బాధ్యత అప్పజెప్పింది. తనకు మంచి బోయ్ఫ్రెండును చూసిపెట్టాలని కార్డెన్ను కోరిందీ అమ్మడు. ఈనెల 20వ తేదీన వీళ్లిద్దరూ కలిసి కార్పూల్ కారవోకే ఎపిసోడ్ చేశారు. ఆ సెషన్లో 23 ఏళ్ల సెలెనా తన హిల్ ఆల్బంల లోంచి కొన్ని పాటలు పాడింది. తన జీవితం గురించి, ప్రేమ గురించి కూడా చాలా ముచ్చట్లు చెప్పింది.

టేలర్ స్విఫ్ట్ స్క్వాడ్ చాలా సెక్సీగా ఉంటుందని, అందులో సెలెనా గోమెజ్ కూడా ఉంటే మరింత బాగుంటుందని కార్డెన్ కామెంట్ చేశాడట. అయితే అందులో అందరూ అమ‍్మాయిలే ఉన్నారు తప్ప అబ్బాయిలను అసలు పిలవడం లేదని బుంగమూతి పెట్టుకున్నాడట. సరిగ్గా అదే సమయంలో సెలెనా గోమెజ్ కలగజేసుకుని, ముందు తనకో బోయ్ఫ్రెండును చూసిపెట్టాలని కోరింది. దాంతో కుర్రాడు ఒక్కసారిగా షాకయ్యాడట. నిజంగా కొత్త బోయ్ప్రెండు కోసం వెతుకుతున్నావా అని అడిగితే.. అవును, అందులో తప్పేంటని వాదించిందట ఆ బుల్లెమ్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement