ఐదుగురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధిశాఖ స్పెషల్ కార్యదర్శిగా జే.రేమాండ్ పీటర్, సాధారణ పరిపాలన శాఖ అకామిడేషన్ స్పెషల్ సెక్రటరీగా అజయ్‌మిశ్రా, పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శిగా పూనం మాలకొండయ్య ప్రభుత్వరంగ సంస్థల ముఖ్యకార్యదర్శిగా భవ్యసాచి ఘోష్, సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌గా బి.జనార్దన్‌రెడ్డిలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.