breaking news
IT women employees
-
తప్పులు సహజం... సరిదిద్దుకోవటం మన చేతుల్లోనే!
నేను ఒక ఐటీ ఎంప్లాయీని. నాకు రెండు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. పెళ్లికిముందు ఆఫీసులో ఒక కొలీగ్‌తో రిలేషన్ షిప్లో ఉండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంతకాలం అది కొనసాగింది. నా భర్త, నేను వేర్వేరు చోట్ల పనిచేస్తూ ఉండటం వల్ల మేము వీకెండ్స్‌లో కలుస్తూ ఉండేవాళ్లం. అయితే ఒక నెల ఏదో కారణం వల్ల మేము దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ అదే నెలలో నా ఫ్రెండ్ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే తనవల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యానని నా భర్త అనుకుంటున్నాడు. ఇప్పుడు నాకు డెలివరీ అయింది, పాప పుట్టింది. మా ఆయన పాపను ఎత్తుకుని, అంతా తన పోలికలే ఉన్నాయని అంటుంటే, నాకు గిల్టీగా ఉంది. ఈ ఆలోచనలతో నాకు తిండి లేదు, నిద్రలేదు. పాపను కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. నా భర్త మొహం చూసినప్పుడు ఏదో అపరాధ భావం వస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ బాధ నుంచి నేను ఎలా బయటపడాలి? – ఒక సోదరి, తిరుపతిమీ ఉత్తరం చదివిన తర్వాత మీరు పడుతున్న మానసిక బాధ, వేదన అర్థమవుతోంది. మనిషి తెలిసో తెలియకో ఒక్కోసారి కొన్ని తప్పులు చేస్తుంటాడు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది మళ్లీ తప్పులు చేస్తూ సమస్యను మరింత పెంచుకుంటారు. కానీ మీరు మీ తప్పును గుర్తించారు, దాని గురించి మీకు అపరాధ భావం ఉంది. అయితే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని కేవలం ఆ తప్పుకు సంబంధించిన గిల్ట్‌గా మాత్రమే చూడకూడదు. డెలివరీ తర్వాత హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వల్ల పోస్టుపార్టమ్ డిప్రెషన్ రావచ్చు. ఇందులో నిరంతరం బాధగా ఉండటం, ఆసక్తి తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్, పుట్టిన బిడ్డపై శ్రద్ధ పెట్టలేకపోవడం, గతంలోని బాధాకరమైన విషయాలు పదేపదే గుర్తుకు రావడం వంటివి ఉండవచ్చు. కాబట్టి ప్రస్తుతం మీ మొదటి ప్రాధాన్యత మీ ఆరోగ్యం, పాప భద్రత. ముందుగా మీరు మానసికంగా స్థిరపడాలి. వెంటనే ఒక మంచి థెరపిస్ట్‌ను కలవండి. గిల్ట్‌ను ఎదుర్కోవడానికి డిప్రెషన్ నుంచి బయటపడటానికి థెరపీ సహాయపడుతుంది. కాలక్రమేణా మీరు ఈ ఇబ్బంది నుంచి బయట పడడానికి కావల్సిన మానసిక స్థైర్యం వారు అందిస్తారు. అవసరమైతే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి మందులు కూడా తీసుకోవాలి. మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే మీ భర్తకు ఈ విషయం చెప్పాలా, మీ సంబంధం గురించి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది థెరపిస్ట్ సహాయంతో ఆలోచించవచ్చు. ఈ విషయం ఎక్కువమందితో పంచుకోకండి. గతంలో మీతో సంబంధంలో ఉన్న వ్యక్తి నుంచి కూడా పూర్తిగా దూరంగా ఉండడం మంచిది. మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. జరిగిపోయిన నిన్నటిని మార్చలేం... కానీ మిగిలిన రేపటిని ఎలా రాయాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి బయటపడగలరు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
మా ఓటు భద్రతకే..
ఐటీ ఉద్యోగినుల మనోగతం ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు అన్ని వర్గాల వారికీ వరాలివ్వడం సహజం. వారి మేనిఫెస్టోల్లో ఈసారి తమ భద్రతకు చోటివ్వాలని కోరుతున్నారు ఐటీ ఉద్యోగినులు. ఇటీవల చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో వారు ఈ డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నా అవి ఇంకా మెరుగు పడాల్సి ఉందని పేర్కొంటున్నారు. - సాక్షి, హైదరాబాద్ పనివేళలు నిర్ధారించాలి ఐటీ ఉద్యోగులు తమకు అప్పగించిన పని పూర్తి చేసే వరకు.. అది ఎన్ని గంట లైనా ఉండి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ రాత్రయితే ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అందుకే ఎనిమిది గంటల పని విధానం అమలు కావాలి. - ప్రవలిక్ల, ఐటీ ఉద్యోగి రవాణాపై దృష్టి పెట్టాలి ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా మెరుగు పర్చేందుకు, ఐటీ జోన్లో మహిళల భద్రతా చర్యలపై ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టత ఇవ్వాలి. అంతే కాకుండా ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటుకు కృషి చేయాలి. - శిరీష, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ చిత్తశుద్ధి అవసరం మహిళా ఐటీ ఉద్యోగుల భద్రత కోసం తీసుకునే చర్యలను రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి. వాటిని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అలాగే ఉన్న వనరులతోనే ఎంతవరకు రక్షణ కల్పిస్తామనే అంశంపై కూడా నాయకులు దృష్టి సారించాలి. కేసుల కోసం సైబరాబాద్‌లో ఒక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - పూర్ణిమ, ఐటీ ఉద్యోగి పటిష్ట చట్టాలు అవసరం ఏదైనా ఘటన జరిగినప్పుడు రాజకీయ పక్షాలు స్పందించి, ఆ తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాకాకుండా ఉద్యోగినుల భద్రతపై పటిష్టమైన చట్టాలు చేయాలి. ఐటీ కారిడార్‌లో ఇంకో 100 సీసీ కెమెరాలను అమర్చాలి. కంట్రోల్ రూమ్‌లో మల్టిపుల్ స్క్రీన్ ఏర్పాటు చేయాలి. పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయాలి. - వనజ, హెచ్ఆర్ మేనేజర్ మా సెర్మం వొలిసి... ‘తాత అయ్యలప్పట్నుంచి గీ పనే సేత్తన్నం. కైకిలి(కూలీ)కెళ్లినా ఎక్కువ పైసలొత్తయి. అయినా మోచీగా తప్ప ఇంకో పని సెయ్యలేం. పొద్దట్నుంచి కూసోని సెప్పులు కుడ్తే ముప్పయ్ రూపాయలు కూడా అత్తలేవు. ఆ పైసలతో మేం ఎట్టా బతికేది? మా బిడ్డల గతేంది? నా పెనిమిటి పోయి ఏడేండ్లయింది. ఇద్దరు బిడ్డలున్నరు. ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు గుంజుకున్నరు. ఎన్నిమాట్ల దరఖాస్తులు ఇచ్చినా వితంతు పింఛినీ ఇత్తలేరు. ఉన్నోళ్లకే రేషన్కారట్లున్నయ్.. కారట్లున్నాగానీ కొందరికి బియ్యం ఇత్తలేరు.. మా అసంటోళ్లు రూ.50 పెట్టి బియ్యం కొనుక్కుంటరా..? మాకు పింఛన్లు లేవు.. రుణాలు లేవు.. ఇళ్లు లేవు.. సర్కారోళ్లు ఏం ఇయ్యకుంటే ఎట్ల బతకాలే? మేమేం లీడర్ల ఆస్తులు రాసియ్యి అంటలేం.. కొంచెం సెప్పులు కుట్టే సామాను ఇప్పిస్తే సాలు. ఆరె, గూటం, బొడ్డెలు, రివిట్లు, దారం, తోలు, కత్తులు ఇస్తే మేలు. ఎలచ్చన్ల ముంగట అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని అస్తరు.. ఎన్నికలైన తెల్లారే అన్నీ యాదిమరుస్తరు.. దొరా.. కూసొని కూసొని కాళ్లు నొత్తన్నయ్.. కుట్టీ కుట్టీ చేతులన్నీ నాడాలవుతన్నయ్.. దరిద్రంలోనే తరాలెల్తన్నయ్! బాంచెన్.. మా కుండలల్ల గింత గంజి బోయిండ్రి.. మా బతుకులకింత వెలుగునియ్యుండ్రి.. మా సెర్మం వొలిసి మీకు సెప్పులు కుట్టిత్తాం.’’ - మణెమ్మ, ఖమ్మం


