breaking news
ISIS campaign
-
ఐసిస్ క్యాంప్ నుంచి ఆస్ట్రేలియన్లు విడుదల.. కొన్ని గంటల్లోనే మళ్ళీ వెనక్కి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లకు (ఐసిస్) చెందిన రోజ్ నిర్బంధ శిబిరంలో చిక్కుకున్న ఆస్ట్రేలియన్ల స్వదేశీ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. వాస్తవానికి 11 కుటుంబాలకు చెందిన 34 మంది ఆస్ట్రేలియన్లు సోమవారం తమ స్వదేశానికి చేరుకోవాల్సి ఉండేది. అయితే ఆఖరి నిమిషంలో వారి ప్రయాణం వాయిదా పడింది.బిరం నుంచి కాన్వయ్ బయలు దేరినప్పటికి..సాంకేతిక కారణాల వల్ల కొద్ది గంటల్లోనే తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. రోజ్ క్యాంప్ కో-డైరెక్టర్ హుక్మియా మహమ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే ఈ 34 మందిని తమతో పాటు తీసుకువెళ్లడానికి సిరియా వచ్చిన వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరిని సిరియా నుంచి పంపించే క్రమంలో భాగంగా, మిలిటరీ ఎస్కార్ట్‌తో కూడిన చిన్న బస్సులలో డమాస్కస్ వైపు తరలించారు. కానీ సిరియా అధికారులతో కుదుర్చుకున్న ఏర్పాట్లలో తలెత్తిన కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల వారు వెనక్కి తిరిగి వచ్చేశారు. అయితే ఇది కేవలం ఒక రోజులో పరిష్కారమయ్యే సమస్య మాత్రమే అని సిరియా అధికారి ఒకరు స్పష్టం చేశారు.కాగా సిరియాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న రోజ్ శిబిరం.. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల కుటుంబ సభ్యులను ఉంచే ఒక నిర్బంధ కేంద్రం. ఈ శిబిరంలో ప్రస్తుతం 40 దేశాలకు చెందిన 2,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. 2019లో సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల పట్టు కోల్పోవడంతో అక్కడి ప్రభుత్వం బందీలను విడిచిపెట్టేందుకు సిద్దమైంది. కానీ చాలా దేశాలు భద్రతా కారణాలతో తమ పౌరులను వెనక్కి తీసుకోవడానికి వెనుకాడుతున్నాయి. ఈ శిబిరంలో బ్రిటన్ పౌరసత్వం రద్దయిన షమీమా బేగం వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. -
బెంగళూరు నుంచి ఐఎస్ఐఎస్ ప్రచారం!
ఉగ్రవాదుల ట్వీటర్ ఖాతాను నిర్వహిస్తున్న నగర వాసి! బ్రిటిష్ చానల్ వెల్లడి సాక్షి, బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు వాడుతున్న సామాజిక మాధ్యమం ట్వీటర్లో దాని ఖాతాను బెంగళూరుకు చెందిన వ్యక్తే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. బ్రిటన్‌కు చెందిన చానల్ ‘4 న్యూస్’ ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఖాతాను అనుమానితుడు బెంగళూరు నుంచి నిర్వహిస్తుండకపోవచ్చని భారత నిఘావర్గాలు పేర్కొన్నాయి. జిహాదీలకు అనుకూలంగా ‘షామీ విట్నెస్’ పేరుతో మెహ్దీ అనే వ్యక్తి ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు బ్రిటిష్ చానల్ వెల్లడించింది. అయితే అతని జీవితం ప్రమాదంలో పడే అవకాశమున్నందున పూర్తి పేరును వెల్లడించడం లేదని పేర్కొంది. బెంగళూరులోని ఓ కంపెనీలో అతను పనిచేస్తున్నట్లు తెలిపింది. షామీ విట్నెస్ పేరుతో ఐఎస్‌కు అనుకూలంగా అతను తన మొబైల్ ద్వారా ఇచ్చే ట్వీట్లను ప్రతి నెలా 20 లక్షల మంది చూస్తున్నారు. దీనికి 17,700 మంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. వీరిలో మూడు వంతుల మంది విదేశీయులే. దీంతో ఐఎస్ ఖాతాల్లోకెల్లా ఇదే అత్యంత ప్రచారం జరుగుతున్న ఖాతాగా గుర్తింపు పొందింది. ఐఎస్‌లో చేరే వారి కోసం సమాచారం అందించడం, బందీల తలల నరికివేత వీడియోలు వంటివి ఈ ఖాతాలో ఉన్నాయి. ఈ విషయం బయటకు పొక్కిన వెంటనే ఆ ఖాతా స్తంభించిపోయింది. కుటుంబం ఆర్థికంగా తనపైనే ఆధారపడటంతో ఖాతాదారుడు ఇంకా ఉగ్రవాద సంస్థలో చేరలేదని చానల్ తెలిపింది.


