breaking news
iron man of india
-
సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత్ సొంతం
కేవాడియా/న్యూఢిల్లీ: అన్ని రకాల అంతర్గత, బహిర్గత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విషయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ నుంచి దేశం స్ఫూర్తిని పొందుతోందని అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ సందర్భంగా మోదీ ఆదివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తే మన దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చవచ్చని పిలుపునిచ్చారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కోసం వల్లబ్‌భాయ్ పటేల్ అలుపెరుగని పోరాటం సాగించారని కొనియాడారు. ఆయన కేవలం చరిత్రలో కాదు, ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని చెప్పారు. పౌరులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించడమే పటేల్‌కు నివాళి అని సూచించారు. సమగ్రతను దెబ్బతీయలేరు: అమిత్ షా సర్దార్‌పటేల్ రాబోయే తరాలకు సైతం స్ఫూర్తినిస్తూనే ఉంటారని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత్ భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండబోతోందని, ఐక్యత, సమగ్రతను దెబ్బతీయడం ఎవరి తరమూ కాదని తేల్చిచెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా ఆదివారం గుజరాత్‌లోని కేవాడియాలో ఐక్యతా శిల్పం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. పటేల్ కృషి వల్లే భారత్ ఐక్యంగా నిలిచిందని అన్నారు. అయినప్పటికీ ఆయనకు తగిన గౌరవ మర్యాదలు లభించలేదని ఆక్షేపించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పటేల్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని, ఆయనకు నివాళిగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పిందని అమిత్ షా తెలిపారు. దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం నివాళులర్పించారు. ప్రజాస్యామ్యాన్ని రక్షించడమే పటేల్‌కు నిజమైన నివాళి అవుతుందన్నారు. -
ఈ ఐపీఎస్ అధికారి నిజంగా ఉక్కు మనిషే..
ముంబై: 16 గంటల వ్యవధిలో 3.8 కిమీ ఈత, 180.2 కిమీ సైకిల్ రైడ్, 42.2 కిమీ పరుగును పూర్తి చేసి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి. పింప్రి చించ్వాడ్ పోలీసు కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ ప్రకాష్.. 2017లో ప్రతిష్టాత్మక ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ టైటిల్‌ను సాధించడంలో భాగంగా ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత సివిల్ సర్వెంట్‌గా ఆయన రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. కాగా, ప్రపంచంలో అత్యంత కష్టతరమైన ఫీట్లలో ఒకటిగా పరిగణించబడే ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్‌ను, కృష్ణ ప్రకాష్ అవలీలగా పూర్తి చేసి.. భారత దేశ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి సివిల్ సర్వెంట్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను భారత్‌లో మరే ప్రభుత్వ అధికారి కానీ సాయుధ దళాలు, పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన అధికారులు కానీ సాధించకపోవడం గమనార్హం. అథ్లెట్లకు కూడా సాధ్యం కాని ఈ ఫీట్‌ను సర్వీస్‌లో ఉన్న కృష్ణ ప్రకాష్ సాధించడంతో అతన్ని నిజంగా ఉక్కు మనిషే అంటున్నారు నెటిజన్లు. -
‘ఉక్కుమనిషి’కి సమున్నత నివాళి
‘ఉక్కు మనిషి’, ఈ దేశ సమైక్యత, సమగ్రతల కోసం అలుపెరగకుండా శ్రమించిన స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అతి ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. నర్మదా నదీతీరాన సర్దార్ సరోవర్ డ్యాం సమీపాన ఈ భారీ విగ్రహం కోసం 3,400మంది కార్మికులు నలభై రెండు నెలలుగా రాత్రింబగళ్లు శ్రమించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అందరూ ఊహించినట్టు నరేంద్ర మోదీ తన 55 నిమిషాల ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయలేదు. అలాగని తనను విమర్శిస్తున్నవారిని ఊరకే వదిలేయలేదు. తమ ప్రభుత్వం జాతీయ నేతలకు సము న్నతమైన స్మృతి చిహ్నాలను నిర్మించాలని ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుంటే దీన్నంతటినీ కొందరు రాజకీయ సులోచనాలతో పరికించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు. ‘‘మేమేమైనా తీవ్రమైన నేరం చేశామా అని మాకే అనిపించే స్థాయిలో వీరి విమర్శలుంటున్నాయి’’ అని మోదీ అన్నారు. పటేల్ ఈ దేశాన్ని సమైక్యపరచకపోతే జునాగఢ్‌లో సింహాలను చూడ్డానికి, గుజరాత్‌లోని సోమ నాథ్ దేవాలయంలో ప్రార్ధించుకోవడానికి, హైదరాబాద్‌లో చార్మినార్ చూడటానికి వీసాలు తీసు కోవాల్సి వచ్చేదని ఆయన ప్రజలకు గుర్తుచేశారు. సర్దార్ పటేల్ విషయంలో బీజేపీకి ఉన్న అభిప్రాయాలు, వాటి వెనకున్న కారణాలు ఎవరికీ తెలియనివి కాదు. బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్ కాలం నుంచే ఈ అభిప్రాయాలున్నాయి. అయిదేళ్ల క్రితం అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గొన్న సభలో నరేంద్రమోదీ మాట్లాడుతూ పటేల్ తొలి ప్రధాని అయివుంటే ఈ దేశ ముఖచిత్రం మరోలా ఉండేదంటూ వ్యాఖ్యానించినప్పుడు దానిపై పెద్ద దుమారమే లేచింది. అంతేకాదు...దేశానికి ఇప్పుడు కావలసింది ‘పటేల్ తరహా సెక్యులరిజం’ తప్ప ‘ఓటు బ్యాంకు సెక్యులరిజం’ కాదని కూడా అప్పట్లో ఆయన చెప్పారు. ఈ బాణాలు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను, కాంగ్రెస్‌ను ఉద్దేశించినవేనని ఎవరికైనా అర్ధమవుతుంది. నెహ్రు గురించి బీజేపీకి లేదా మోదీకి మాత్రమే కాదు...వేరేవారికి కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి. నెహ్రూ కేబినెట్లో పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆ రోజుల్లోనే నెహ్రూ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని, ఆయన బదులు పటేల్ ప్రధాని అయివుంటే బాగుండేదని అన్నారని ఆజాద్‌కు కార్యదర్శిగా పనిచేసి, అనంతరకాలంలో కేంద్ర విద్యామంత్రిగా ఉన్న హుమాయూన్ కబీర్ ఒక సందర్భంలో చెప్పారు. నిజానికి పటేల్ భావ జాలానికీ, ఆజాద్ భావజాలానికీ ఏమాత్రం పొసగదు. లౌకికవాదిగా ఆయన జవహర్లాల్ నెహ్రూకే సన్నిహితుడు. పటేల్ ప్రవచించిన స్వేచ్ఛా వ్యాపార విధానాలను నెహ్రూతోపాటు వ్యతిరేకించినవాడు. స్వాతంత్య్రోద్యమానికి సారధ్యంవహించి, అనంతరకాలంలో దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకుల్లో ఇలా విరుద్ధ భావజాలాలు, అవగాహనలు ఉండేవి. అందులో అసహజమూ లేదు. వైపరీత్యమూ లేదు. అందరి ఉమ్మడి లక్ష్యమూ సమున్నతమైన, పటిష్టమైన నవభారత నిర్మాణమే. వారంతా పదహారణాల దేశభక్తులు. కశ్మీర్ విషయంలో, విభ జన సమయంలో పాకిస్తాన్‌కు చెల్లించాల్సిన రూ. 64 కోట్ల పరిహారం విషయంలో, అలీనో ద్యమంవైపు మొగ్గుచూపడంలో, చైనాతో చెలిమి విషయంలో వారిమధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే తప్ప అభిప్రాయభేదాలు కాదు. భారత్‌లో విలీనమయ్యేదిలేదన్న పలు సంస్థానాలను దారికి తేవడంలో పటేల్ పాత్ర ఎనలేనిది. చివరివరకూ మొండికేసిన హైదరాబాద్, జునాగఢ్ సంస్థానా ధీశులపై బలప్రయోగానికి పూనుకున్నారు. అయితే నరేంద్రమోదీ, బీజేపీ సర్దార్ పటేల్ పేరెత్తినప్పుడల్లా ఆయన తమవాడని తరచు భుజాలు తడుముకుంటున్న కాంగ్రెస్‌ను గురించి చెప్పుకోవాలి. స్వాతంత్య్రోద్యమంలో నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు...సామ్యవాద, లౌకిక భారత్‌ను నిర్మించడానికి నెహ్రూ చేసిన ఎనలేని కృషి దాచేస్తే దాగనివి. అలాగని అదే స్వాతంత్య్రోద్యమంలో ఆయనతో సమానంగా పాలు పంచు కున్న షహీద్ భగత్‌సింగ్, నేతాజీ సుభాస్‌చంద్ర బోస్, ఆజాద్, సర్దార్ పటేల్, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల కృషిని తక్కువ చేసి చూడటం లేదా విస్మరించటం క్షమిం చరాని నేరం. ఆ పని కాంగ్రెస్ చేసింది. ఆ నాయకుల పట్ల అలవిమాలిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారి వర్ధంతులూ, జయంతులనాడైనా వారి కృషిని ఘనంగా స్మరించుకోవాలని, ఈ దేశ నిర్మాణానికి వారు దోహ దపడ్డ తీరును చాటిచెప్పాలని ఆ పార్టీ, దాని నేతృత్వంలోని ప్రభుత్వాలూ ఏనాడూ అనుకోలేదు. మొక్కుబడి నివాళులతో సరిపెట్టడమే రివాజైంది. కనీసం 2009లో బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా ఎల్కే అద్వానీని రంగంలోకి దింపి, ఆయన్ను ‘అభినవ సర్దార్’గా అభివర్ణించడం మొదలుపెట్టా కైనా కాంగ్రెస్ మేల్కొనలేదు. ఎప్పటినుంచో తనకలవాటైన విధానాలనే కొనసాగించింది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా రంగప్రవేశం చేసి, పిడుగులు కురిపిం చడం మొదలెట్టాక పటేల్ చరిత్రను, ఇతర నాయకుల చరిత్రను పఠించడం ప్రారంభించింది. ఇటు బీజేపీ కూడా సర్దార్ పటేల్‌కు ప్రాముఖ్యం ఇస్తూనే చరిత్రలో నెహ్రు స్థానాన్ని తక్కువ చేసి చూపడానికి వీలైనప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉంది. ఒకరకంగా ఆ పార్టీ కాంగ్రెస్ ఇంతక్రితం చేసిన తప్పునే మరో పద్ధతిలో చేస్తోంది. గత పాలకులు విస్మరించిన స్వాతంత్య్రోద్యమ సారథు లను, వారి కృషిని వెలికితీయాల్సిందే. దాన్నెవరూ కాదనరు. కానీ అందుకోసం నెహ్రూ వంటి శిఖరసమానుల పాత్రను తగ్గించి చూపనవసరం లేదు. నరేంద్రమోదీ బుధవారం ప్రతిష్టించిన ‘ఐక్యతా ప్రతిమ’ 597 అడుగులతో ఇప్పటికైతే ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం. ఈ ప్రతిమ కాలావధుల్ని దాటి ఐక్యతా పరిమళాలు వెదజల్లాలంటే... జన హృదయాల ఐక్యతకు అది స్ఫూర్తి నీయాలంటే ఆ దిశగా ప్రభుత్వాల కార్యాచరణ ముఖ్యం. -
అదంతా పటేల్ కృషి వల్లే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 114వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో జెండా ఊపి ‘రన్ ఫర్ యూనిటీ’ మారదాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ఏక్ భారత్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని, దేశ ప్రజలందరినీ ఒకే తిరంగా జెండా కింద ఉంచడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. దేశం బలోపేతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అయితే అది సాధ్యం కావాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండాలని మోదీ అన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి పటేల్ చేసిన కృషి శ్లాఘనీయమని, దానిని ఎప్పటికీ మరచిపోరాదని మోదీ అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రతిజ్ఞ చేయించిన ప్రధాని, దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటానికి మరింత శ్రమించాలని పిలుపునిచ్చారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ డిజిటల్ మ్యూజియమును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. కాగా అంతకు ముందు ప్రధాని మోదీ... మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. -
ఉక్కు మనిషి