breaking news
IPL tournament
-
ఆర్సీబీ టికెట్ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ
బెంగళూరు (శివాజీనగర): ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఒక వారం మాత్రమే గడువు ఉంది. పోటీలను స్వస్థలం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిపేందుకు అనుమతి పొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు తన అభిమానులకు బంపర్ ఆఫర్‌ను ఇచ్చింది. టికెట్ కొనుగోలు చేసిన వారికి ‘నమ్మ మెట్రో’లో ఆయా రోజుల్లో ఉచితంగా ప్రయాణానికి అవకాశం లభించనుంది. మెట్రో ప్రయాణపు క్యూర్ కోడ్ సైతం లభించనుంది. టికెట్ కొనుగోలు ఎలా? ఈసారి ఆర్సీబీ జట్టు స్వస్థలంలో పోటీలకు ఆన్లైన్ టికెట్లకు మాత్రమే ప్రాధాన్యత కల్పించింది. జట్టు అధికారిక వెబ్సైట్ లేదా, యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. త్వరలో టికెట్ అమ్మకాల తేదీని ప్రకటిస్తారు. ఇతర వెబ్సైట్లకు గాని వ్యక్తులకు కాని టికెట్ అమ్మకాల హక్కులు లేవు. ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడు? 2026వ సంవత్సర ఐపీఎల్ టోర్నీ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయమై తొలి దశ టైం టేబల్‌ను సైతం విడుదల చేశారు. పశి్చమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా తొలి 20 పోటీల టైం టేబల్‌ను మాత్రం ప్రకటించారు. టోర్నీ ప్రారం¿ోత్సవ పోటీల్లో ప్రస్తుతం చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైసర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి తలపడతాయి. ఈ పోటీలకు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానం అతిథ్యం ఇస్తోంది. తొలి దశలో ఆర్సీబీ తలపడే మ్యాచ్‌లు: -
అట్టహాసంగా చంద్రగిరి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం (ఫొటోలు)
-
నేడు కింగ్స్‌తో ఆర్సీబీ ఢీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఐపీఎల్ టోర్నీలో భాగంగా స్థానిక ఆర్సీబీ జట్టు శుక్రవారం ఇక్కడ కింగ్స్ లెవన్ పంజాబ్‌తో ఢీ కొనబోతోంది. టోర్నీ ప్రారంభం నుంచి అనూహ్యమైన ఆట తీరును కనబరుస్తున్న పంజాబ్, స్థానిక జట్టుపై విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది. విధ్వంసకరమైన బ్యాట్స్‌మెన్‌గా పేరు గడించిన పంజాబ్‌కు చెందిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆర్సీబీకి చెందిన క్రిస్ గేల్ల మధ్య ఈ మ్యాచ్ మహా సమరంగా మారుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాల్సి ఉంది. 14 మ్యాచ్‌లు ఆడాల్సిన ఆర్సీబీ ఇప్పటికే సగం వాటిల్లో ఆడేసినా కేవలం ఆరు పాయింట్లతోనే ఉంది. అన్ని మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాయింట్లలోనే కాకుండా నిలకడలోనూ పంజాబ్‌తో ఆర్సీబీ పోటీ పడలేక పోతోంది. వర్షం ముప్పు నగరంలో గత రెండు రోజులుగా అడపా దడపా పడుతున్న వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడవ చ్చనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మ్యాచ్‌ను రద్దు చేయాల్సినంతగా ప్రస్తుతం వర్షం పడకపోయినప్పటికీ, మరో రెండు రోజుల పాటు వానలు పడవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. శుక్రవారం భారీ వర్షం పడితే మ్యాచ్ గతి ఏం కావాలని కొందరు అభిమానుల్లో చింత మొదలైంది. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడు పోయాయి. వారాంతం కనుక ఐటీ, బీటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి రావడం ఖాయం. ప్రత్యేక బస్సులు మ్యాచ్‌కు అభిమానులు తరలి రావడానికి బీఎంటీసీ అదనపు బస్సులను నడుపుతోంది. కాడుగోడి బస్టాండు, సర్జాపుర, ఎలక్ట్రానిక్ సిటీ, బన్నేరుఘట్ట నేషనల్ పార్కు, కగ్గలిపుర, కెంగేరి కేహెచ్‌బీ క్వార్టర్స్, జనప్రియ టౌన్షిప్, నెలమంగల, యలహంక శాటిలైట్ టౌన్, ఆర్కే. హెగ్డే నగర, బాగలూరు, హొసకోటె, కాడుగోడి బస్టాండు, అత్తిబెలె, బన్నేరుఘట్టల నుంచి సాయంత్రం అయిదు గంటలకు ఈ అదనపు బస్సులను నడుపుతారు. మ్యాచ్ ముగియగానే రాత్రి 11 గంటలకు బస్సులన్నీ తిరిగి గమ్య స్థానాలకు బయలుదేరుతాయి.


