సీబీఐ దర్యాప్తు జరపాలి ఏపీ భవన్ ఎదుట
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘర్షణలపై సమగ్ర దర్యాప్తునకు వీలుగా సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముస్లింలు గురువారం ఢిల్లీలోని ఏపీభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఘర్షణల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫ్రంట్ అధ్యక్షుడు అషఫ్ ్రమాట్లాడుతూ.. ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకొని జరిగిన కాల్పులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.