breaking news
International City Parade
-
ఫ్లీట్.. ఫిదా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చేతక్ హెలికాప్టర్లు ఆకాశం నుంచి మువ్వన్నెల పతకాల్ని మోసుకొచ్చాయి. ఆ వెనుకే ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు బాణం ఆకారంలో దూసుకొచ్చాయి. సీకింగ్స్.. కమోవ్ వంటి హెలికాప్టర్ల సందడి నడుమ ఐఎస్‌వీ టాంగోలు సముద్ర జలాల్లోకి దూసుకుపోయాయి. మేఘాల్ని చీల్చుకుంటూ మిగ్–29 యుద్ధ విమానాలు బాంబుల మోత మోగించాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026లో భాగంగా.. విశాఖపట్నంలో గురువారం నిర్వహించిన సైనిక విన్యాసాలు ఔరా అనిపించాయి. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులో భారతదేశ సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రాణం పోసేలా నిర్వహించిన సిటీ పరేడ్ కనువిందు చేసింది.వీటిని వీక్షించిన విదేశీ ప్రతినిధులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఐఎఫ్ఆర్లో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన నౌకాదళాలు, కోస్ట్ గార్డ్ బృందాలు నిర్వహించిన కవాతు హైలైట్‌గా నిలిచింది. అత్యాధునిక డ్రోన్ విన్యాసాలు, మెరైన్ కమాండోల సాహసాలతో సముద్ర భద్రత విషయంలో కీలక పాత్ర పోషించబోతోందనే సంకేతాన్ని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి భారత్ సుస్పష్టం చేసింది. అతిథుల నడుమ అంబరమంటిన సంబరం గురువారం నాటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్‌సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నేవల్ బ్యాండ్ ఆధ్వర్యంలో వందేమాతరం, జనగణమనతో మొదలైన సిటీ పరేడ్ సంబరం అంబరాన్నంటింది. యుద్ధ విమానాల బాంబుల వర్షం చేతక్, ఏఎల్‌హెచ్, సీకింగ్స్, కమోవ్–28, కామోవ్–31, రోమియోలుగా పిలిచే ఎంహెచ్–60ఆర్ హెలికాప్టర్లతో భారత వాయుసేన ఒక్కసారిగా వినువీధిలో ఫైరింగ్ నిర్వహించి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇమ్మీడియట్ సపోర్ట్ వెసల్స్ ఐఎస్‌వీ టాంగోలు సముద్ర జలాల్లో దూసుకుపోతుండగా.. గగన తలంలో మేఘాల్ని చీల్చుకుంటూ మూడు మిగ్–29 యుద్ధ విమానాలు దూసుకొచ్చి బాంబుల మోత మోగించాయి. 16వ బెటాలియన్ ద్వారా ప్లటూన్ కమాండర్లు బీఎంపీ–2 యుద్ధ ట్యాంకర్లతో సముద్ర తీరంలోకి దూసుకొచ్చి అతిథులకు గౌరవ వందనం సమర్పించి యుద్ధ విన్యాసాల్ని ప్రదర్శించారు. ఎయిర్ స్క్వాడ్రన్ ఆధ్వర్యంలో నాలుగు డారి్నయర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వజ్రాకృతిలో విన్యాసాలు చేయగా.. మూడు కోస్ట్‌గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, భారత నౌకాదళానికి చెందిన పీ–8ఐ వచ్చీ రాగానే బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధ విన్యాసం.. రక్షణ సామర్థ్యం సముద్రపు దొంగల ఆటని ఎలా కట్టిస్తారు.. సముద్రంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షిస్తారనే అంశాల్ని ప్రదర్శించారు. సీకింగ్ హెలికాప్టర్లు మెరైన్ కమాండర్లు మార్కోస్ని ప్రవేశపెట్టి.. కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఆయిల్ రిగ్ని నాశనం చేసే ప్రదర్శనని వీక్షకుల ఒళ్లు గగుర్పొడించింది. మిగ్–29 యుద్ధ విమానాలు ఒక్కసారిగా దూసుకొచ్చి తక్కువ ఎత్తులో ఎగురుతూ.. పల్టీలు కొడుతూ బాంబుల వర్షం కురిపిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. మూడు మిగ్–29, నాలుగు హాక్ జెట్స్ ఫ్లై పాస్ట్ నిర్వహిస్తూ గగనతల యుద్ధ విన్యాసాల ప్రదర్శన ముగించాయి. అనంతరం ఐఎఫ్ఆర్ భాగస్వామ్య దేశాలైన ఆ్రస్టేలియా, రష్యా, మలేíÙయా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇరాన్, మయన్మార్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, మాల్దీవులు, సియాచెల్, వియత్నాం దేశాల నౌకాదళ సిబ్బంది కవాతు నిర్వహించారు. చివరిగా దేశ ఔన్నత్యాన్ని, భారత నౌకాదళం, రక్షణ దళాల వీరోచిత్వాన్ని చాటిచెప్పేలా లేజర్ షో, డ్రోన్ షోతో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమాన్ని ముగించారు. విన్యాసాలు కాదు.. విశ్వాసానికి ప్రతీకలు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలకు విశాఖపట్నం మరోసారి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది. సముద్ర సరిహద్దుల రక్షణలో మన నావికులు ప్రదర్శిస్తున్న సాహసాలు వెలకట్టలేనివి. అంతర్జాతీయ సిటీ పరేడ్ ప్రపంచ దేశాల మధ్య ఉన్న సముద్ర సంబంధాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకువచి్చంది. ఇప్పుడు జరిగినవి కేవలం విన్యాసాలు మాత్రమే కాదు. సముద్ర రక్షణకు, స్నేహపూర్వక వాతావరణానికి ప్రతీకలు. భారత్ నిరంతరం ప్రపంచ శాంతిని కాంక్షిస్తుంది. సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం, స్నేహం మెరుగుపడటం దేశ ఆరి్థక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. పరేడ్‌లో పాల్గొన్న విదేశీ ప్రతినిధులకు సాదర స్వాగతం పలుకుతున్నాను. ‘సముద్రాల ద్వారా స్నేహం‘ అనే నినాదం నేడు ప్రపంచానికి అత్యంత ఆవశ్యకంగా మారింది. వివిధ దేశాల నౌకాదళాలు ఒకే వేదికపై కవాతు చేయడం శాంతికి చిహ్నం. – జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్ బాధ్యతాయుతమైన శక్తిగా భారత్ 74 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం గర్వంగా ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో భారత్ ఒక బాధ్యతాయుతమైన శక్తిగా ఎదుగుతోంది. సముద్ర దొంగతనాలు, ఇతర అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి మిత్రదేశాల నావికాదళాల మధ్య సమన్వయం అత్యంత అవసరం. ఇందుకోసం భారత నౌకాదళం ఎల్లప్పుడూ లైట్‌హౌస్‌లా దారి చూపించడంలో ముందుంటుంది. – అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, భారత నౌకాదళాధిపతి -
సాగర వీర...సాహస ధీర
భళా ‘త్రివిధ’ విన్యాసం ♦ ఆకాశంలో, సముద్రంలో, నేలపైనా నావికాదళం పాటవ ప్రదర్శన ♦ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు ♦ ప్రధాని సమక్షంలో ప్రదర్శన ♦ ఘనంగా అంతర్జాతీయ సిటీ పరేడ్ ♦ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ♦ జనసంద్రమైన విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ సాగరతీరం సాక్షిగా భారత నౌకాదళం తన సామర్థ్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించింది. బంగాళాఖాతంలో అలల హోరుతో పోటీపడుతూ వేలాదిమంది కరతాళ ధ్వనులు చేస్తుండగా నౌకాదళం సాహసోపేత విన్యాసాల్ని ప్రదర్శించింది. గగనతలంలో దూసుకుపోయిన చేతక్ హెలికాఫ్టర్లు.. రివ్వున దూసుకుపోతూనే పల్టీలు కొడుతూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన హాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. అలల్ని చీల్చుకుంటూ దూసుకుపోతూ డేర్ డెవిల్ విన్యాసాలను ప్రదర్శించిన మెరైన్ కమెండోలు... సముద్రంలో ఠీవిగా నిల్చున్న యుద్ధనౌకల మీద నుంచి నేరుగా ఆకాశంలోకి చొచ్చుకొస్తూ గగుర్పాటుకు గురిచేసిన ఫాల్కన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు... ఇక భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా బీచ్‌రోడ్డులో వివిధ రాష్ట్రాల జానపద నృత్యాల ప్రదర్శన... ఐఎఫ్ఆర్లో పాల్గొన్న 51 దేశాల నౌకాదళాల కవాతు.. శకటాల ప్రదర్శన... ఓ వైపు సూర్యాస్తమయం అవుతూ పరుచుకుంటున్న చీకట్లను పారదోలుతూ వెలుగులు చిమ్మిన యుద్ధవిమానాలు.. మిరుమిట్లు గొలుపుతూ శోభాయమానంగా విరజిమ్మిన బాణసంచా వెలుగులు .. విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ఆదివారం ఈ సుందరదృశ్యం ఆవిష్కృతమైంది. అద్భుతరీతిలో విన్యాసాలు.. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)లో భాగంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ఆదివారం సాయంత్రం భారత నౌకాదళం తన సాహస విన్యాసాలను సగర్వంగా ప్రదర్శించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, త్రివిధ దళాధిపతులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, 51 దేశాల నౌకాదళాల ప్రతినిధులతోపాటు వేలాదిగా హాజరైన ప్రజలతో బీచ్‌రోడ్డు కిక్కిరిసిపోయింది. సాయంత్రం 5 గంటలకు వేదిక వద్దకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అడ్మిరల్ ఆర్కే ధోవన్, వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుల్లెట్‌ప్రూఫ్ వేదికలో ప్రధాని ఆశీనులైన మరుక్షణంలోనే ఆకాశంలో మూడు చేతక్ హెలికాఫ్టర్లు రివ్వున దూసుకువచ్చి నౌకాదళ విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. వెనువెంటనే హాక్ యుద్ధవిమానాలు పల్టీలు కొడుతూ అద్భుతరీతిలో విన్యాసాల్ని ప్రదర్శించాయి. అంతలోనే సముద్రంలో ఐఎన్ఎస్ జలాశ్వ నుంచి నాలుగు మెరెన్ బోట్లలో మార్కోవ్స్ కమెండోలు దూసుకొచ్చారు. బీచ్‌లో నిర్దేశించిన లక్ష్యాల్ని ఛేదించారు. చేతక్ హెలికాఫ్టర్ల పై నుంచి సంద్రంలోకి దిగిన మార్కోవ్స్ తమ సాహసాన్ని చాటిచెప్పారు. మళ్లీ తాళ్ల సహాయంతో హెలికాప్టర్లోకి చేరుకుని అబ్బురపరిచారు. అంతవరకు దూరంగా లంగరు వేసిన యుద్ధనౌకలు మెల్లగా తీరంవైపు రాసాగాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, శివాలిక్ మీద నుంచి ఫాల్కన్, బ్లాక్ఫాంథర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు జతల జతలుగా గాలిలోకి దూసుకుపోయి సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. బాంబులు వేస్తున్న తీరును తలపిస్తూ వెలుగుపూల బాంబులు విరజిమ్ముతూ సముద్రంలోని లక్ష్యాలను ఛేదించాయి. పీ 8ఐ హెలికాప్టర్లు వెలుగులు విరజిమ్ముతూ గగనతలాన్ని కాంతివంతం చేసి చూపరుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. అంతలోనే ఆకాశం నుంచి 16 మంది స్కైడైవర్స్ పారాచ్యూట్లతో దిగుతూ కనిపించారు. గింగిరాలు తిరుగుతూ ప్రధాని మోదీ ఆశీనులైన వేదిక ముందు దిగారు. వారిలో ఒక డైవర్.. నౌకాదళం రూపొందించిన ‘మారిటైమ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా’ అనే పుస్తక ప్రతిని పట్టుకుని దిగి.. నేరుగా ప్రధాని మోదీ ఉన్న వేదిక మీదికెళ్లి దాన్ని ఆయనకు అందజేశారు. ఆ వెంటనే మోదీ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆకట్టుకున్న సిటీ పరేడ్ నౌకాదళ విన్యాసాల అనంతరం అంతర్జాతీయ సిటీ పరేడ్‌ను బీచ్‌రోడ్డులో ఘనంగా నిర్వహించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన యోగా విశిష్టతను చాటుతూ కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అనంతరం పరేడ్‌ను ప్రారంభించారు. కమాండర్ పర్వీన్ మల్లిక్ నేతృత్వంలో భారత నౌకాదళ బృందం పరేడ్‌ను నిర్వహించింది. భారత వాయుసేన, కోస్టుగార్డు, ఏపీ పోలీస్, ఎన్సీసీ, కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థులు దాన్ని అనుసరించారు. భారత్‌తోపాటు ఐఎఫ్ఆర్లో పాల్గొన్న విదేశీ నౌకాదళాల సిబ్బంది కవాతు చేస్తూ ప్రధాని మోదీకి గౌరవ వందనం సమర్పించాయి. చివరగా 30 బుల్లెట్ బైక్‌లపై నౌకాదళ సిబ్బంది రైడ్ నిర్వహించారు. తదుపరి ఐఎఫ్ఆర్ థీమ్సాంగ్ ప్రదర్శన, నేవీ స్కూల్ విద్యార్థినుల నృత్య ప్రదర్శనలతో ఈ వేడుకలు ముగిశాయి. ఆ వెనువెంటనే బాణసంచా మెరుపులతో ఆకాశం శోభాయమానంగా మారింది. లేజర్ కాంతులు విరజిమ్ముతూ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి.


