breaking news
intercontinental missile
-
వచ్చేస్తోంది మన బాహుబలి
న్యూఢిల్లీ: ఇరాన్‌లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు ఆత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా రంగం సిద్ధంచేసిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన అగ్ని–5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిస్సైల్‌ను మరింత ఆధునీకరిస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లోని భూగర్భ అణుకేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసిందన్న వార్తల నడుమ అధునాతన బంకర్ బస్టర్ బాంబు తయారీకి ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. ఏకంగా 100 మీటర్లు నేలలోకి చొచ్చుకుపోయేలా..అగ్ని–5 ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్‌కు అత్యంత బరువైన వార్‌హెడ్‌ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డీఆర్డీవో తెలిపింది. తొలుత రెండు వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్‌ను తయారుచేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యంమీదకు జారవిడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణుకేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్–అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారత్ తలపోస్తోంది. అందులో భాగంగానే బంకర్ బస్టర్ బాంబులతో సంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని–5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్తవేరియంట్లను సిద్ధంచేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7,500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనిని అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకుని పోయేలా కొత్తతరహా మెకానిజంతో దీనిని సిద్ధంచేస్తున్నారు. తక్కువ ఖర్చులో పని పూర్తయ్యేలా..అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణు లు మోసుకెళ్లలేవు. వాటిని మోసేందుకు, లక్ష్యంపై జారవిడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ రకంగా నార్త్రోప్ బీ–2 స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనిని ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే తన అమ్ములపొదిలో ఉన్న అగ్ని–5ను ఈ కార్యం కోసం డీఆర్డీఓ ఎంచుకుంది. ఒకటి భూతలంపై.. మరోటి భూగర్భంలో..రెండు వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను చేధిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాల్లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లాన తర్వాతే పేలుతుంది. రెండు వేరియంట్లు గరిష్టంగా 8,000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధంచేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి వేలకేజీల బరువైన బంకర్‌బస్టర్ బాంబులున్న దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువుల కమాండ్–కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బకొ ట్టాలన్నా భారత్‌కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పేర్కొంది.హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా...ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ రెండు వేరియంట్లను తయారుచేస్తున్నారు. భూతల లక్ష్యాలను చేధించే వేరియంట్ మ్యాక్8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ఛిద్రంచేసే వేరియంట్ మ్యాక్20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.బంకర్ బస్టర్ ఉపయోగాలేంటి?సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కార్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. జీపీఎస్ ట్రాకింగ్, అతి వేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రంచేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటివైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణంగా ఉంటుంది. యుద్ధక్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధట్యాంక్‌లు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు. ఈ కంట్రోల్ సెంటర్‌ను నాశనంచేస్తే రణక్షేత్రంలోని బలగాలకు సరైన దిశానిర్దేశం కరువవుతుంది. దీంతో ఆ శత్రుబలగాలను నిలువరించడం భారత బలగాలకు తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంఛర్ నుంచే దూసుకొస్తాయి. వీటిని భూస్థాపితం చేయాల న్నా బంకర్బస్టర్లు అవసరమే. -
చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పు
బీజింగ్: పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించినట్లు చైనా వెల్లడించింది. ఇది అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పుగా పరిణమించనున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్షిపణిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ ప్రయోగించిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంలో జారవిడిచారు.దేశ వార్షిక శిక్షణ ప్రణాళికలో భాగంగానే ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు చైనా పేర్కొంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ క్షిపణి ప్రయోగం ఆయుధ పనితీరు, సైనిక శిక్షణ ప్రభావాన్ని పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలను సాధించింది. 1989 తర్వాత మొదటిసారిగా ఐసీబీఎం పరీక్ష గురించి చైనా బహిరంగంగా తెలియజేసింది. చైనాకు చెందిన ఐసీబీఎం తొలి పరీక్ష 1980 మేలో జరిగింది. అనంతరం చైనా తన అణ్వాయుధ పరీక్షలు భూగర్భంలో నిర్వహిస్తూ వస్తోంది.చైనా తాజాగా చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష అంతర్జాతీయ ఆందోళనలను పెంచే అవకాశం ఉంది. మరోవైపు, దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్‌తో సహా అనేక దేశాలతో చైనాకు వివాదం నడుస్తోంది. మీడియాకు వెల్లడైన వివరాల ప్రకారం చైనా వద్ద 500కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 350 ఐసీబీఎంలున్నాయి. 2030 నాటికి చైనా వద్ద వెయ్యికి మించిన అణ్వాయుధాలు ఉంటాయని అంచనా. చైనా సైన్యం వందలాది రహస్య క్షిపణులను తయారు చేస్తోందని పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది.ఇది కూడా చదవండి: పని ఒత్తిడి పనిపడదాం..!హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చేద్దాం ఇలా..! -
మిస్సైల్ విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. శత్రుదేశాల ఖండాంతర క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తుత్తునియలు చేయగల కొత్తరకం క్షిపణి ఎండో–అట్మాస్ఫెరిక్ ఇంటర్‌సెప్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని యుద్ధ నౌక నుంచి శనివారం డీఆర్డీవో (రక్షణ పరిశోధన పరిశోధన సంస్థ), నావికా దళం ఈ పరీక్ష నిర్వహించాయి. శత్రు దేశాల క్షిపణిని మధ్యలోనే అడ్డుకుని, ధ్వంసం చేయగలిగే సరికొత్త బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను సొంతం చేసుకున్న దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలో పాలుపంచుకున్న డీఆర్డీవో, నేవీ, రక్షణ పరిశ్రమల ప్రతినిధులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. -
రహస్య అణు నగరాన్ని నిర్మిస్తున్న భారత్: పాక్
ఇస్లామాబాద్: భారత్ రహస్య అణు నగరాన్ని నిర్మిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. భారీగా అణు ఆయుధ నిల్వలను పెంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక సంతులనాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా వ్యాఖ్యానించారు. భారత్ ఖండాంతర క్షిపణి ప్రయోగాలు చేస్తోందన్నారు. ప్రాణాంతక ఆయుధాలను భారీగా తయారుచేస్తున్న భారత్‌పై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని కోరారు. పొరుగున ఉన్న దేశాలతో సఖ్యత, శాంతి కోసం పాకిస్తాన్ చేస్తున్న చర్యలకు భారత్ భంగం కలిగిస్తోందన్నారు.