breaking news
inter university
-
విజేత ఉస్మానియా యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ జట్టు చాంపియన్‌గా అవతరించింది. మైసూర్లో జరిగిన ఫైనల్లో ఉస్మానియా 10 పరుగుల ఆధిక్యంతో విశ్వేశరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ (బెలగావి) జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఉస్మానియా జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు సాధించింది. కునాల్ దాస్వాని (41 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైభవ్ సజానా (27 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించగా... అన్విత్ రెడ్డి (38; 6 ఫోర్లు), పారస్ రాజ్ (37; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విశ్వేశరయ్య జట్టు 204 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. సమర్థ్ హెగ్డే (46), విష్ణు గౌడర్ (39) ఆకట్టుకున్నారు. ఉస్మానియా జట్టు బౌలర్లలో కెపె్టన్ వంశీ కుమార్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు... ధర్మపురి సాత్విక్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు... వీఎం ధనుష్ 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. యశ్వీర్కు ఒక వికెట్ లభించింది. -
సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
రాజరాజనరేంద్రపురం (రాజానగరం) : తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 27 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ పోటీలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఎం.చంటిబాబు (దేవరపల్లి), వై.కుమార్శివదుర్గావెంకటేష్ (రాజమహేంద్రవరం), ఎ¯ŒS.శ్రీరామ్, జి. వీరవెంకటసత్యనారాయణ (గొల్లలమామిడాడ), పి. చంద్రశేఖర్ (అమలాపురం) ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. ఈ క్రీడాకారులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, ఇతర అధ్యాపకులు అభినందనలు తెలిపారు. వాలీబాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : కేరళలోని కాలికట్ యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే సౌత్ జో¯ŒS ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ (మహిళలు) పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 12 మందిఎంపికయ్యారు. వీరిలో ఈ.సంధ్య, ఎం.సుబ్బలక్ష్మి, ఎల్.ఉషారాణి, కె.అరుణ, ఎం.ఈశ్వరి, సీహెచ్.గాయిత్రీ, ఎస్.కుమారి, షేక్, శిరీషా, కె.సంధ్యవెంకటదుర్గ, పి.స్వాతి, ఎం.దుర్గాభవాని, కె.శైలజ ఉన్నారని యూనివర్సిటీ పీడీ ఎసత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు అభినందనలు తెలిపారు. -
ఓయుూ హ్యాండ్‌బాల్ సారథి రవ్యుకృష్ణ
ఎల్బీ స్టేడియుం: ఇంటర్ యుూనివర్సిటీ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఉస్మానియూ యుూనివర్సిటీ (ఓయుూ) జట్టు కెప్టెన్‌గా పి.రవ్యుకృష్ణ వ్యవహరించనుంది. ఈ టోర్నమెంట్ పోటీలు ఈనెల 29 నుంచి సేళంలోని పెరియూర్ యుూనివర్సిటీలో జరుగుతారుు. ఓయుూ హ్యాండ్‌బాల్ జట్టు: పి.రవ్యుకృష్ణ (కెప్టెన్), వైష్ణవి భట్, కె.వి.శరణ్య, కె.ప్రియూంక, కె.లక్ష్మీప్రసన్న, పి. ద్వారక, డి.శ్రావణి రెడ్డి (భవాన్స్ కాలేజి), వి.రాణి, ఝాన్సీ (సెరుుంట్ ఆన్స్ కాలేజి), నిషా కువూరి, నిస్సి వుర్నాతి (సెరుుంట్ పారుుస్ కాలేజి), కార్తీక (సెరుుంట్ ఫ్రాన్సిస్ కాలేజి), వువుత (కస్తూర్బా గాంధీ కాలేజి), రవళి, అంకిత (లయోలా అకాడమీ), కె. దీపక్ ప్రసాద్ (కోచ్), గంగాధర్ (మేనేజర్).


