breaking news
Intense
-
కార్చిచ్చుకు తోడైన వడగాడ్పులు
పారిస్: ఫ్రాన్స్, స్పెయిన్లలో వడగాడ్పులు కొనసాగుతుండటంతో కార్చిచ్చు మరింత తీవ్ర రూపం దాల్చింది. రెండు దేశాల్లో ఇప్పటి వరకు కనీసం 3.30 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాల్లోని సుమారు 4 వేల మందిని ఖాళీ చేయించినట్లు ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 2.20 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సుమారు 420 చదరపు కిలోమీటర్ల మేర మంటల్లో దహించుకుపోగా, మంటలు మరింతగా వ్యాపించకుండా ప్రస్తుతానికైతే అదుపు చేయగలిగామన్నారు. వేసవి తీవ్రత, పొడి వాతావరణం పెరుగుతుండటంతో కార్చిచ్చు ప్రమాదం పూర్తిగా తొలిగిపోనట్లేనని వారు తెలిపారు. ముందు జాగ్రత్తగా, లకనౌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లోని క్యాంపుసైట్లు, హాలిడే విలేజెస్, టూరిస్ట్ నివాసాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నామన్నారు. మంటలను అదుపు చేసే విధుల్లో ఇప్పటివరకు 93 మంది ఫైర్ ఫైటర్లు గాయపడ్డారన్నారు. అదేవిధంగా, స్పెయిన్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కార్చిచ్చు వ్యాపిస్తోందని ప్రభుత్వం తెలిపింది. వడగాడ్పులు కొనసాగుతుండటంతో మంటలు కూడా విస్తరిస్తున్నాయని, వాటిని నిలువరించేందుకు మిలటరీ ఎమెర్జెన్సీ విభాగాల సాయంతో వందలాదిమంది ఫైర్ ఫైటర్లు నిరంతరం శ్రమిస్తున్నాయని వెల్లడించింది. అధికారులు ఇప్పటి వరకు 79 వేల మందిని ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 30 వేల మందిని ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేశారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో మొట్టమొదటి సారిగా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. రాజధాని మాడ్రిడ్‌కు పశి్చమాన భారీ కార్చిచ్చు ఒకటి విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతోపాటు, కస్టెల్లోన్లో మంటల వ్యాప్తితో పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు. కొండప్రాంతం అవిలాలో రికార్డు స్థాయిలో మంటలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మంటలు 500 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని భస్మీపటలం చేశాయని అధికారులు తెలిపారు. ఇంతటి తీవ్ర స్థాయిలో కార్చిచ్చును ఇప్పటి వరకు తాము చూడలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎలన్ మస్క్, అమెజాన్ జెఫ్‌బేజోస్ మధ్య తీవ్రపోటీ
-
గ్రామీణ బ్యాంకులో గోల్మాల్
సాక్షి, రంగారెడ్డి: అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. తమ ఫిక్స్డ్ డిపాజిట్లలోని కోట్లాది రూపాయల డబ్బు ఖాతాదారులకు తెలియకుండానే మాయం అయింది. సమాచారం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకుకు తరలివస్తున్నారు. గ్రామస్తుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని బ్యాంకు సిబ్బంది ఫిక్స్డ్ డిపాజట్లలోని డబ్బును మాయం చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఎఫ్డీలో డబ్బు మాయం అయిందన్న సమాచారంతో నాగిరెడ్డిగూడెం వాసి అయిన ఓ ఖాతాదారు కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సలందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
పడగవిప్పిన పాతకక్షలు
ఐదుగురికి తీవ్ర గాయూలు, ఆస్పత్రికి తరలింపు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు, రెవెన్యూ అధికారులు విఫలం భూతగాదాలే ఘర్షణకు ప్రధాన కారణం రావుకుప్పం, న్యూస్‌లైన్: బందార్లపల్లె పంచాయుతీ పావునబోయునపల్లె గ్రావుంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు ఒక్కసారిగా భగ్గువున్నాయి. గురువారం రెండు వర్గాలవారు రావుకుప్పం పట్టణ నడిబొడ్డున పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూ రంలో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. తీవ్ర రక్తగాయూలతో తలలు బద్దలయ్యేలా కొట్టుకున్నారు. ఈ ఘటన వుండలంలో సంచ లనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పావునబోయునపల్లె గ్రావూనికి చెందిన జనార్ధన్‌రెడ్డి, కుందనందారెడ్డిలతో పాటు కాశిరెడ్డి, ఆనందప్పల వుధ్య మూడేళ్లుగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయుంపై రెండు వర్గాల వారు పలువూర్లు ఘర్షణలు పడి పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. అలాగే భూమూలు తవువంటే తవువే అంటూ ఇరువర్గాల వారు కోర్టులకెక్కారు. ప్రస్తుతం ఈ భూ సవుస్యలపై కోర్టులో విచారణ సాగుతోంది. బుధవారం సాయుంత్రం జనార్ధన్‌రెడ్డి సోదరుడు వేణుగోపాల్‌రెడ్డి(30) ప్రత్యర్థులతో గొడవపడ్డాడు. ఈ ఘర్షణలో వే ణుగోపాల్‌రెడ్డి గాయుపడి ఆస్పత్రి పాలయ్యూడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను శాంతింపజేశారు. మూందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం రాత్రి గ్రావుంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయుం పోలీసులు గ్రావుం విడిచి వెళ్లిపోయూరు. ఎప్పటిలాగే రెండు వర్గాలవారు పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు రావుకుప్పం పట్టణానికి వచ్చారు. విజలాపురం క్రాస్ వద్ద ఒకరికొకరు ఎదురుపడ్డారు. వూటావూట పెరిగి వ్యక్తిగత దూషణలకు దిగారు. అంతలోనే కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో జనార్ధన్‌రెడ్డి(42), మూనిరెడ్డి(45), కుందనందారెడ్డి(48), కాశిరెడ్డి(30), ఆనందప్ప(45) తీవ్రంగా గాయుపడ్డారు. సవూచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయుపడినవారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బంధువులు కుప్పం తీసుకెళ్లారు. సవుస్యలను పరిష్కరించడంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కాలయూపన చేయుడంతోనే రక్తపాతం సంభవించిందని పలువురు వుండిపడుతున్నారు. అయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటావుని స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియుక గ్రావుస్తులు బిక్కుబిక్కువుని కాలం గడుపుతున్నారు. గ్రావుంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయూలని పలువురు కోరుతున్నారు.


