breaking news
india test
-
ఆఖరి అవకాశం!
►పరువు కోసం దక్షిణాఫ్రికా ఆరాటం ► నేటి నుంచి భారత్‌తో చివరి టెస్టు ► ఆత్మవిశ్వాసంతో కోహ్లిసేన గత తొమ్మిదేళ్లుగా ఆతిథ్య జట్ల నుంచి ఎలాంటి విషమ పరీక్ష ఎదురైనా అలవోకగా ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా ఇప్పుడు పరువు కోసం పాకులాడుతోంది. నంబర్‌వన్ హోదాలో భారత్‌లో అడుగుపెట్టిన సఫారీలు ఊహించని రీతిలో టెస్టు సిరీస్‌లో ఘోరపరాజయం పాలయ్యారు. దీంతో నేడు మొదలుకానున్న ఆఖరి టెస్టులోనైనా గెలిచి పోయిన పరువు కొంతైనా కాపాడుకోవాలనే తాప త్రయంలో ఉన్నారు. మరోవైపు వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్ అతిపెద్ద సిరీస్ విజయం కోసం ఆసక్తిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ అంటే చర్చ నేరుగా పిచ్పైకే వెళ్లిపోతున్న నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (గురువారం) ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ప్రారంభంకానున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియాతో ప్రొటీస్ జట్టు అమీతుమీ తేల్చుకునేందు సిద్ధమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన కోహ్లిసేన మరో భారీ విజయంతో సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది. అయితే నాగ్‌పూర్ వికెట్ నాసిరకమని మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఫిరోజ్ షా పిచ్‌పై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. బ్యాటింగ్‌పై దృష్టి: ఓవరాల్‌గా స్పిన్నర్ల ప్రతిభతోనే సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ సిరీస్‌లో విజయ్, పుజారాలు మాత్రమే అర్ధసెంచరీలు చేశారు. లోకల్ హీరోలు ధావన్, కోహ్లిలలో ఒక్కరు భారీ ఇన్నింగ్స్ ఆడినా ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఢోకా ఉండదు. మూడో టెస్టులో ఆడిన రోహిత్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాల్లేవు. ఎందుకంటే సహజంగానే స్లో, లో బౌన్స్ కలిగిన కోట్లా పిచ్ ప్రతి రోజు ఉదయం సీమర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి రోహిత్ స్థానంలో మరో సీమర్‌కు అవకాశం దక్కవచ్చు. గత కొన్ని రోజులుగా భారత్ ఏ ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు చేయలేకపోతుండటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆ లోటును భర్తీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక బౌలింగ్‌లో ‘స్పిన్ త్రయం’ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. దీనికి తోడు సొంతగడ్డపై ఇషాంత్ చెలరేగితే ప్రొటీస్‌కు కష్టాలు తప్పవు. రెండో సీమర్‌గా వరుణ్ ఆరోన్ లేదా బిన్నీలలో ఒకర్ని తీసుకోవచ్చు. మోర్కెల్పైనే భారం: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికాను గాయాల బెడద పీడిస్తోంది. గజ్జల గాయంతో స్టెయిన్ ఆఖరి టెస్టుకూ దూరమయ్యాడు. దీంతో పేస్ అటాకింగ్ భారం మొత్తం మోర్కెల్పైనే పడింది. అబాట్, రబడ, డిలాంజ్లకు అనుభవం తక్కువగా ఉండటం భారంగా మారింది. అయితే పిచ్ పేస్‌కు అనుకూలిస్తే వీళ్లలో ఒక్కరు ఫామ్‌లోకి వచ్చినా భారత బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవు. ప్రధాన స్పిన్నర్ తాహిర్ మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్గర్, హార్మర్ వాళ్ల స్థాయిలో రాణిస్తున్నా... కీలక సమయంలో భాగస్వామ్యాలను విడగొట్టలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ మొత్తం డివిలియర్స్‌పైనే ఆధారపడి ఉంది. ఆమ్లా, ఎల్గర్, వాన్ జెల్, డు ప్లెసిస్‌లు పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఏబీపై ఒత్తిడి పెరిగిపోతోంది. లోయర్ ఆర్డర్ కనీసం ఓ స్థాయి పోరాటం కూడా చేయలేకపోవడం మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. ఓవరాల్‌గా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్‌ను నిలువరించడం ప్రొటీస్‌కు తలకు మించిన పనే. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, మిశ్రా, ఇషాంత్, రోహిత్ / ఆరోన్ / బిన్నీ. దక్షిణాఫ్రికా: ఆమ్లా (కెప్టెన్), ఎల్గర్, వాన్ జెల్/బావుమా, డివిలియర్స్, డు ప్లెసిస్, డుమిని, విలాస్, హార్మర్ / పిడెట్ / డిలాంజ్, రబడ / అబాట్, మోర్కెల్, తాహిర్. పిచ్: వికెట్‌పై పచ్చికను బాగా తొలగించారు. తొలి సెషన్ నుంచే స్పిన్‌కు అనుకూలమైనా... పొగమంచు, తేమ కారణంగా ఆరంభంలో పేసర్లకూ అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం: వర్షం ముప్పు లేదు. మంచి ఎండ కాస్తోంది. ఐదు రోజులు మ్యాచ్‌కు ఎలాంటి అడ్డంకి లేదు. -
పుజారా ‘షో’
-
బీసీబీపై భారత్ ఆగ్రహం
బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టును ఫతుల్లాలో నిర్వహించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢాకా నగరంలో ఫతుల్లా, మిర్పూర్ ప్రాంతాలలో రెండు స్టేడియాలు ఉన్నాయి. సాధారణంగా ఏ పెద్ద జట్టు వచ్చినా మిర్పూర్‌లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తారు. భారత్‌తో మూడు వన్డేలకు కూడా మిర్పూర్ స్టేడియం వేదిక. కానీ టెస్టు మ్యాచ్‌ను ఫతుల్లాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవు. జూన్‌లో భారీ వర్షాలు ఉంటాయని తెలిసి కూడా సరైన సౌకర్యాలు లేని స్టేడియంను ఎందుకు ఎంచుకున్నారని బీసీసీఐ ప్రశ్నించినట్లు సమాచారం. ఇక్కడి స్టేడియంలో కేవలం ఒక్క సూపర్ సాపర్ మాత్రమే ఉంది. దీంతో వర్షం ఆగినా స్టేడియంను సిద్ధం చేయడానికి సమయం పడుతోంది. మిర్పూర్లో సూపర్ సాపర్ యంత్రాలు చాలా ఉన్నాయి. కనీసం వాటిని ఇక్కడికి తీసుకొచ్చినా బాగానే ఉండేది. కానీ బీసీబీ ఇవేం చేయలేదు. కానీ బంగ్లా బోర్డు వాదన మరోలా ఉంది. మిర్పూర్తో పోలిస్తే ఫతుల్లాలో డ్రైనేజ్ వ్యవస్థ బాగుందని, ఇక్కడ స్టేడియంను సిద్ధం చేయడానికి ఒక్క సూపర్‌సాపర్ సరిపోతుందని చెబుతోంది. అయితే భారీ వర్షం వల్ల తామేమీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. మొత్తం మీద వర్షంతో పాటు సౌకర్యాల లేమి కూడా భారత్‌ను చిరాకు పరుస్తోంది.