breaking news
india stock market
-
మార్కెట్లలో మురిపించిన రికవరీ
గత కొన్ని రోజులుగా ఆచితూచి అడుగులు వేస్తున్న భారత స్టాక్ మార్కెట్ ఈరోజు ఆరంభంలో నష్టాల్లోకి జారినా మార్కెట్ ముగిసే సమయానికి ‘అంతకంటే తీపి లేదు’ అన్నట్లుగా ఆశాజనక వాతావరణంలో లాభాల బాట పట్టింది. ఆగస్టు 25, 2026 నాటి ట్రేడింగ్‌లో దేశీయ ప్రధాన సూచీలు రికవరీని సాధించాయి. తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన ఈనాటి సెషన్లో నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకొని 24,334 వద్ద ముగియగా, సెన్సెక్స్ 286 పాయింట్లు ఎగబాకి 77,656 పాయింట్ల స్థాయికి చేరింది.గ్లోబల్ సెంటిమెంట్.. మార్కెట్ గమనంఅంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఉదయం అడుగడుగునా గండం అన్నట్లు ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్న సమయానికి కొనుగోళ్ల మద్దతుతో ఊపందుకున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌పై అమెరికా తాజా ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 90 డాలర్లకు పైగా ట్రేడ్ అవ్వడం మన మార్కెట్లను మొదట్లో భయపెట్టింది. అయితే అంతర్జాతీయంగా అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మున్ముందు వడ్డీ రేట్ల తగ్గింపుపై సానుకూల ధోరణి కనబరచవచ్చన్న అంచనాలు మార్కెట్‌కు ఊపిరి పోశాయి.మద్దతుగా విదేశీ నిధులుఇన్వెస్టర్లు సురక్షితమైన లార్జ్‌క్యాప్ కంపెనీల వైపే మొగ్గు చూపారు. విదేశీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల షేర్లలో భారీగా సాగిన షార్ట్ కవరింగ్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎయిర్‌లైన్ దిగ్గజం ఇండీగో షేర్లు లాభాలు.. వంటివి సూచీల రికవరీకి కారణమయ్యాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తిరిగి నికర కొనుగోలుదారులుగా మారడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.విశ్లేషకుల అభిప్రాయంఅంతర్జాతీయ జియోపోలిటికల్ ఉద్రిక్తతలు ‘చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు’ తాత్కాలికంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేపినా భారత ఆర్థిక వ్యవస్థలోని బలమైన ప్రాథమిక సూచికలు ఆసియా మార్కెట్లలో మన స్థానాన్ని మళ్లీ అగ్రభాగాన నిలబెడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ధరల ఊగిసలాటపై దృష్టి పెట్టాలని, గుడ్డిగా పెట్టుబడులు పెట్టకుండా ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అన్న రీతిలో ముందస్తు వ్యూహంతో అడుగులు వేయాలని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
దేశీ స్టాక్ మార్కెట్‌కు తగ్గిన ప్రాధాన్యం
ప్రస్తుతం ఆసియాలోకెల్లా భారత్ స్టాక్ మార్కెట్‌కు అత్యల్ప ప్రాధాన్యమిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవోఎఫ్‌ఏ) చేపట్టిన సర్వే పేర్కొంది. ఈ నెల 7–13 మధ్య ఆసియా ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైనట్లు నివేదికలో బీవోఎఫ్‌ఏ సర్వేలో తెలియజేసింది. దీంతో ఇండొనేసియా స్థానంలో భారత్‌ను చేర్చినట్లు వెల్లడించింది. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 272 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులను నిర్వహిస్తున్న 98 ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో బీవోఏ మరిన్ని అంశాలను పేర్కొంది. వివరాలు ఇలా..27 శాతానికి డౌన్ భారత్‌తో పోలిస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంటు ఇండొనేసియావైపు మొగ్గు చూపుతోంది. జూలైలో 32 శాతంగా నమోదైన నెట్ అండర్‌వెయిట్(పెట్టుబడుల ప్రాధాన్యం) ఆగస్ట్ రెండోవారానికల్లా 27 శాతానికి క్షీణించింది. ఇదే సమయంలో ఇండొనేసియాకు ప్రాధాన్యం పెరిగింది. ఆసియా ప్రాంతంలో తైవాన్, జపాన్ మార్కెట్లకు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి భారత్ చైనా, ఫిలిప్పీన్స్కంటే వెనుకబడినట్లు సర్వే పేర్కొంది.ఏఐలో వెనుకబాటుప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో పటిష్టస్థాయిలో ఎక్స్పోజర్ లేకపోవడానికితోడు.. బలహీన ఆర్థిక వృద్ధి దేశీ ఈక్విటీలపట్ల సమస్యాత్మకంగా భావిస్తున్నట్లు బీవోఎఫ్‌ఏ సర్వే పేర్కొంది. సంస్కరణలలేమి, షేర్ల అధిక ధరలు, రూపాయి బలహీనత సైతం ప్రతికూలంగా పరిణమించినట్లు వివరించింది. గత రెండు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడిన సందర్భంలో సర్వే వివరాలు వెలువడటం గమనార్హం! అయితే ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతుండటం, కంపెనీల ఆర్జన అంచనాలు మెరుగుపడటం, మార్కెట్ అంతర్గత మూలాలు మెరుగుపడుతుండటం తదితర సానుకూలతలను ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా స్పందించినట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. తొలి 6 నెలలు డీలా..ఈ క్యాలండర్ ఏడాది(2026) తొలి ఆరు నెలలు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో భాగమైన కంపెనీల సగటు ఆర్జన వార్షికంగా 18 శాతం పుంజుకోగా.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనాలు 10 శాతాన్ని మించడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం మే నెలలోనూ బీవోఎఫ్‌ఏ సర్వేలో ఇండియా అత్యల్ప ప్రాధాన్యతగల మార్కెట్‌గా నిలిచింది. ఇందుకు యూఎస్ ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం ప్రభావం చూపింది. దీంతో ఇంధన వ్యయాల భారంతో ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెరిగినట్లు సర్వే అభిప్రాయపడింది.దీనికితోడు రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలకు సమీప భవిష్యత్‌లో పరిష్కారం కనిపించకపోవడం, పెరుగుతున్న చమురు ధరలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమయ్యాయి. అయితే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 8 శాతం రికవరీ అయినప్పటికీ ఈ ఏడాది దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా 8 శాతం క్షీణించాయి. దీంతో ఆసియాలో బలహీనపడిన ప్రధాన మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలిచినట్లు సర్వే తెలియజేసింది. ఇదే కాలంలో ఇండొనేసియా మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. జకార్తా కాంపోజిట్ ఇండెక్స్ జూన్ కనిష్టం నుంచి 20 శాతం పుంజుకున్నట్లు పేర్కొంది. ఇందుకు ఆ దేశ కరెన్సీ నిలకడకు కేంద్ర బ్యాంకు తీసుకున్న చర్యలు కొంతమేర దోహదపడినట్లు ప్రస్తావించింది. ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! -
లాభాల వరద పారించిన LIC స్టాక్.. 20 వేల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..
-
స్టాక్ మార్కెట్ పై అవగాహన లేనోళ్ళు ఇలా చేయండి
-
భారత మార్కెట్లో మారిన ఎఫ్‌పీఐల ప్రాధాన్యతలు
విదేశీ ఇన్వెసర్లు భారత స్టాక్ మార్కెట్లో మే-జూన్ మధ్యకాలంలో రూ.35వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఒక్క మే నెలలో రూ.14,569 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయగా, ఈ జూన్‌లో ఇప్పటి వరకు రూ.19,970 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఎఫ్‌పీఐల ప్రాధాన్యతలు మారాయి. ఈ రంగాల షేర్లను కొన్నారు టెలికాం, అటో, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మీడియా రంగాల షేర్లలో అధికంగా కొనుగోళ్లు జరిపారు. అలాగే ఆహార, బేవరీజెస్ అండ్ టోబాకో, ట్రాన్స్‌పోర్టేషన్, హోటల్స్, రిస్టారెంట్స్ అండ్ టూరిజం, ఫార్మా అండ్ బయోటెక్నాలజీ, ఇన్సూరెన్స్, ఎయిర్‌లైన్స్ రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడులను 1శాతం వరకు పెంచుకున్నారు. టెలికాం రంగానికి సంబంధించి విదేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో మే 31నాటికి రూ.89,120 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. అంతకు ముందు ఏప్రిల్‌లో ఇదే రంగానికి చెందిన రూ.75,452 కోట్ల ఈక్విటీ షేర్లతో పోలిస్తే ఇది 18.11శాతం అధికం. కన్స్ట్రక్షన్ మెటీరియల్ రంగానికి చెందిన షేర్లను 9శాతం పెంచుకున్నారు. అటో, అటో విడిభాగాల కంపెనీలకు చెందిన షేర్లను 6.4శాతానికి పెంచుకున్నారు. ఈ రంగాల షేర్లను విక్రయించారు ఇదే సమయంలో వారు బ్యాంకింగ్, రోడ్లు, హైవేలు, నౌకాయాన రంగాల షేర్లను విక్రయించారు. టెక్స్టైల్స్, యూటిలిటీ, కన్జూ్యమర్ డ్యూరబుల్స్, రియల్ ఎస్టేట్, కెమికల్స్ రంగాలకు చెందిన షేర్లలో వాటాలను తగ్గించుకున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లను అధికంగా విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి విదేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో మే 31నాటికి రూ.4,15,061 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. అంతకు ముందు ఏప్రిల్‌లో ఇదే రంగానికి చెందిన రూ.4,65,367 కోట్ల ఈక్విటీ షేర్లతో పోలిస్తే ఇది 10.81 శాతం తక్కువ. మన మార్కెట్లోనే కొనుగోళ్లు ఎందుకు..? భారీ పతనం తర్వాత, ప్రస్తుతం భారత స్టాక్ వాల్యూయేషన్లు లాంగ్ టర్మ్ యావరేజ్‌ల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల విలువలతో పోలిస్తే మరింత తక్కువగా ఉన్నాయి. బహుశా ఈ కారణమే ఎఫ్‌పీఐలకు ఇండియా ఈక్విటీ మార్కెట్ల వైపు నడిపించి ఉండవచ్చు. మార్చి ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐలు విక్రయించిన షేర్లలో సగానికి పైగా షేర్లను తిరిగి కొనుగోలు చేశారు. సమీప కాలంలో, లిక్విడిటీ అధికంగా ఉండే రంగాల్లో కొనుగోళ్లు జరపవచ్చు అని నిర్మల్ బంగ్ ఈక్విటాస్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. -
ఫెడ్ మీటింగ్‌తో ఇన్వెస్టర్ల జాగ్రత్త
109 పాయింట్ల నష్టంతో 27,253కు సెన్సెక్స్ * 24 పాయింట్ల నష్టంతో 8,233కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంభించడంతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 27,253 పాయింట్ల వద్ద. ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 8,233 పాయింట్ల వద్ద ముగిశాయి. సోమవారం కూడా సెన్సెక్స్ 109 పాయింట్లే నష్టపోవడం విశేషం. లుపిన్ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశకు గురిచేయడం, అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండడం.. ఈ అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. క్యాపిటల్ గూడ్స్, లోహ, ఆయిల్ షేర్లు నష్టపోయాయి. రెండు రోజుల పాటు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం ప్రారంభమైన నేపథ్యంలో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగానే ట్రేడయ్యాయి. ఈ సమావేశాల్లో వడ్డీరేట్ల పెంపు విషయమై ఏమైనా సంకేతాలు అందుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారన్నది నిపుణుల అభిప్రాయం. మంగళవారం సెన్సెక్స్ 27,291 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది. లుపిన్ 5 శాతం డౌన్ కన్సాలిడేటెడ్ నికర లాభం 35 శాతం క్షీణించడంతో లుపిన్ షేర్ 5.2 శాతం నష్టపోయి రూ.1,946 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ షేర్లలో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే. -
గ్లో‘బుల్’ ర్యాలీ..!
చైనా సంస్కరణలు, అమెరికా ఫెడ్ ఉద్దీపన అంచనాల కారణంగా ప్రపంచ మార్కెట్ల ర్యాలీ సాగించిన ప్రభావంతో భారత్ స్టాక్ సూచీలు కూడా ఉవ్వెత్తున ఎగిసాయి. సోమవారం 171 పాయింట్ల గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ రోజంతా అలుపెరగని ర్యాలీ సాగించి 20,851 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 451 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇండెక్స్ 133 పాయింట్ల పెరుగుదలతో 6,189 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. స్టాక్ సూచీలు ఇంతభారీగా పెరగడం నెలరోజుల తర్వాత ఇదే ప్రధమం. దాంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. లక్ష కోట్లకుపైగా పెరిగింది. తాజా ర్యాలీతో స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల విలువ రూ. 67,94,300 కోట్లకు చేరింది. దేశీయ, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులపై అనుమానంతో కొద్దిరోజుల క్రితం ఇన్వెస్టర్లు షార్ట్ చేసిన ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు లార్సన్ అండ్ టూబ్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ కౌంటర్లలో కవరింగ్ జరగడంతో సూచీల భారీ ర్యాలీ సాధ్యపడింది. రూపాయి మారకపు విలువ నాటకీయంగా 62,41 స్థాయికి మెరుగుపడటం సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అమలుచేస్తున్న ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని వచ్చే మార్చి వరకూ ఉపసంహరించబోదన్న అంచనాలు ఏర్పడటంతో పాటు చైనా కమ్యూనిస్టు నాయకత్వం పలు ఆర్థిక, సామాజిక సంస్కరణలను ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గత శుక్రవారం రాత్రి కొత్త రికార్డుస్థాయికి అమెరికా మార్కెట్లు చేరడంతో సోమవారం ప్రధాన ఆసియా సూచీలైన హాంకాంగ్ హాంగ్‌సెంగ్, చైనా షాంఘై, ఇండోనేసియా జకార్తా కాంపోజిట్లు 2-3 శాతం మధ్య పెరిగాయి. ఇదే బాటలో యూరప్‌లోని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు కూడా ర్యాలీ జరిపాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా ఎస్ అండ్ పీ, డోజోన్స్ ఇండెక్స్‌లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. విదేశీ నిధుల ప్రవాహం... ఇక దేశీ మార్కెట్లో క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లు బాగా పెరిగాయి. దాంతో ఈ రంగాల సూచీలు 3 శాతంపైగా ఎగిసాయి. ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీలు 4 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతం, ఐటీసీ 3.5 శాతం రిలయన్స్ 2 శాతం చొప్పున పెరిగాయి. మెటల్ షేర్లు హిందాల్కో, టాటా స్టీల్ 3.5 శాతం మేర ర్యాలీ జరిపాయి. కొద్దిరోజులుగా లాభాల స్వీకరణకు లోనవుతున్న ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రాలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 1.5 శాతం పెరుగుదలతో 52 వారాల గరిష్టస్థాయి 3,405 వద్ద ముగిసింది. మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 4-7 శాతం మధ్య ఎగిసాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 26 షేర్లు పాజిటివ్‌గా ముగియడం విశేషం. కొద్దిరోజులుగా నెమ్మదించిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) కొనుగోళ్లు తిరిగి స్పీడందుకున్నాయి. తాజాగా ఎఫ్ఐఐలు రూ. 1,159 కోట్ల విలువైన పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ.655 కోట్లు వెనక్కి తీసుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ బిల్డప్ నగదు విభాగంలో బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లతో పాటు డెరివేటివ్ విభాగంలో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 3 శాతంపైగా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో తాజాగా 51 వేల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 16.36 లక్షల షేర్లకు చేరింది. లాంగ్ బిల్డప్‌ను సూచిస్తూ స్పాట్ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం రూ. 54 వరకూ పెరిగింది. స్పాట్ బ్యాంక్ నిఫ్టీ 11,142 పాయింట్ల వద్ద ముగియగా, ఫ్యూచర్ 11,196 వద్ద క్లోజయ్యింది. 11,000 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరగడంతో ఈ కాల్ ఆప్షన్ నుంచి 23 వేల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 77 వేల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ రెండు ఆప్షన్లలోనూ దాదాపు 2 లక్షల షేర్ల వరకూ ఓఐ వుంది. 11,200 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ జరగడంతో ఈ ఆప్షన్లో ఓఐ 1.34 లక్షల షేర్లకు పెరిగినప్పటికీ, 11,500 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్‌తో ఓఐ 2.31 లక్షల షేర్లకు తగ్గింది. సమీప భవిష్యత్తులో బ్యాంక్ నిఫ్టీ 11,200 స్థాయిని దాటితే 11,500 వరకూ పెరగవచ్చని ఈ డేటా సూచిస్తున్నది.


