breaking news
India Meteorological Department Director
-
చలి తీవ్రత ఎక్కువే
న్యూఢిల్లీ: డిసెంబర్ 2025– 2026 ఫిబ్రవరి వరకు మూడు నెలల సీజన్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. మధ్య భారత, వాయవ్య ప్రాంతాలు, దక్షిణాదిన సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమ భారతంలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌తోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలుల ప్రభావం ఈసారి నాలుగైదు రోజులపాటు అదనంగా ఉంటుందని అంచనా వేశారు. సాధారణంగా డిసెంబర్– ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లో ఆరు రోజులపాటు శీతల గాలులు వీస్తాయని మహాపాత్ర తెలిపారు. ఈ సీజన్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే తక్కువగానే ఉష్ణోగ్రతలుంటాయని పేర్కొన్నారు. నవంబర్8–18వ తేదీల మధ్య మొదటిసారి శీతల గాలుల ప్రభావం రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిందన్నారు. అదేవిధంగా, ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మధ్య, వాయవ్య ప్రాంతాల్లో శీతలగాలుల ప్రభావం ఉండొచ్చని వివరించారు. -
నవంబర్‌లో చలి ఎక్కువే!
న్యూఢిల్లీ: నవంబర్ నెలలో మొత్తమ్మీద దేశవ్యాప్తంగా చలి ఎక్కువగానే ఉండే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. వాయవ్య, మధ్య, పశి్చమ భారతం సహా చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వాయవ్యంలోని కొన్ని ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాలలో కనిçష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శుక్రవారం జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. భూమధ్యరేఖ, పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న బలహీనమైన లా నినా పరిస్థితులే ఇందుకు దోహద పడుతున్నాయని మహాపాత్ర వివరించారు. లా నినా పరిస్థితులు 2025 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో, నవంబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణాదిన సాధారణం కంటే తక్కువగానే వర్షాలుంటాయన్నారు. -
సెప్టెంబర్‌లోనూ భారీ వర్షాలు
న్యూఢిల్లీ: సెప్టెంబరు నెలలోనూ దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఏటా సెప్టెంబరులో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని, అయితే ఈ ఏడాది ఈ నెలలో సాధారణం కంటే 109 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడి జనజీవనం స్తంభించే ముప్పు ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్‌లో నదులు ఉప్పొంగి కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలకు దారితీయవచ్చని, దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్‌లలో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తాయని హెచ్చరించారు. 1980 నుంచి ఏటా సెప్టెంబరులో భారత్‌లో వర్షపాతం పెరుగుతోందని ఆయన తెలిపారు. అయితే 1986, 1991, 2001, 2004, 2010, 2015, 2019 సంవత్సరాల్లో సెప్టెంబరు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. సెప్టెంబరులో పశ్చిమ మధ్య, వాయవ్య, దక్షిణ భారత్‌లోని చాలా ప్రాంతాల్లో నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో, సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చని మోహపాత్రా తెలిపారు. ఇక, తూర్పు మధ్య భారత్, తూర్పు, ఈశాన్య, వాయవ్య భారత్‌లోని పలు ప్రాంతాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ స్థాయుల్లో ఉండొచ్చని వెల్లడించారు.3నెలలూ సాధారణం కంటే అధిక వర్షపాతం‘జూన్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య దేశంలో 743.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు 700.7 మి.మీ కంటే దాదాపు 6 శాతం ఎక్కువ. జూన్ నెలలో సాధారణం కంటే దాదాపు 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూలై నెలలో 294.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే దాదాపు 5 శాతం ఎక్కువ. ఆగస్టులో 268.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 శాతం ఎక్కువ. ఇప్పటివరకు వర్షాకాలం మూడు నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది’ అని మోహపాత్రా వివరించారు. -
నవంబర్‌లో చలి లేనట్లే!
న్యూఢిల్లీ: సాధారణంగా నవంబర్ మాసం వచి్చందంటే చలికాలం మొదలైనట్లే. చలి గాలులు గిలిగింతలు పెడుతుంటాయి. కానీ, ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర శుక్రవారం చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అక్టోబర్‌లో సాధారణంగా 25.69 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, ఈసారి 26.92 డిగ్రీలు నమోదైంది. 1901 తర్వాత అత్యంత వేడి కలిగిన అక్టోబర్‌గా రికార్డుకెక్కింది. నవంబర్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గిపోయే సూచనలు కనిపించడం లేదని మృత్యంజయ్ వివరించారు. చలి పెరగడానికి వీలుగా వాతావరణ పరిస్థితులు లేవని అన్నారు. నవంబర్‌లో చలికి వాయువ్య భారతదేశం నుంచి వీలే గాలులే కీలకమని వివరించారు. అక్కడ రుతుపవనాల ప్రభావం ఇంకా ఉండడంతో గాలులు వీచడం లేదని తెలియజేశారు. వాయువ్య భాగంలో మరో రెండు వారాలపాటు ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని చెప్పారు. రెండు వారాల తర్వాత మాత్రమే ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాస్తవానికి వాతావరణ విభాగం దృష్టిలో నవంబర్ నెల చలి మాసం కాదు. జనవరి, ఫిబ్రవరి మాత్రమే చలి మాసాలు. -
బిపర్‌జోయ్‌తో ఊహించని రేంజ్లో డ్యామేజ్!!
వింతగా మారిన అరేబియా సముద్ర వాతావరణం.. తీర ప్రాంత ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. బిపర్జోయ్ తుపాను విరుచుకుపడే నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్టల్‌గార్డు, ఆర్మీని మోహరింపజేసింది. సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే బిపర్జోయ్ కలిగించబోయే నష్టం మామూలుగా ఉండకపోవచ్చని అంటున్నారు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర. తుపాను ఇప్పటికే బలహీనపడి చాలా తీవ్రమైన తుపానుగా మారిందని గుర్తు చేస్తున్నారాయన. గురువారం అది తీరం తాకే సమయంలో తీవ్ర స్థాయిలోనే నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెబుతున్నారాయన. గురువారం కచ్, దేవ్‌భూమి ద్వారకా, జామ్‌నగర్, పోర్బందర్, రాజ్‌కోట్, జునాఘడ్, మోర్బీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తీరానికి అదిచేరుకునే సమయానికి గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, భారీ వర్షం తో పాటు గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా ఈదరుగాలులు వీస్తాయని మహోపాత్ర వివరించారు. ఆ ప్రభావం చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందునా.. అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులను ఆయన హెచ్చరించారు. అలాగే పంట నష్టం కూడా తీవ్రంగా ఉండొచ్చని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్ కోస్టల్ ఏరియాల్లో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని చెప్పారాయన. కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. జూన్ 6వ తేదీ నుంచి బిపర్జోయ్ ఉదృతి కొనసాగుతోందని, ఆ మరుసటి నాటికే అది తీవ్ర రూపం దాల్చిందని, జూన్ 11 నాటికి మహోగ్ర రూపానికి చేరుకుందని, ఈ ఉదయానికి కాస్త బలహీనపడి తీవ్రమైందిగా మారిందని మహోపాత్ర తెలిపారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఉదయం డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యి.. తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించారాయన. #CycloneBiparjoy moves menacingly towards Dwaraka, Jamnagar, Kutch in Gujarat at 135 kmph on Tuesday . At landfall on Thursday it may peak at 190kmph . pic.twitter.com/GxxevyPKlv — P.V.SIVAKUMAR #Amrit Kaal On 🇮🇳 (@PVSIVAKUMAR1) June 13, 2023 Live visuals from #Okha Port , Indian Coast Guard on Alert Okha IMD recorded 91mm #Rainfall between 8:30am-5:30pm#Gujarat #CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #BiparjoyUpdate pic.twitter.com/Yt12KUKr2h — Siraj Noorani (@sirajnoorani) June 13, 2023 జూహూ బీచ్‌లో విషాదం ఇదిలా ఉంటే.. సైక్లోన్ బిపర్‌జోయ్‌తో పశ్చిమ రైల్వేలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 67 రైళ్లు ఇప్పటికే రద్దు అయ్యాయి. ముంబైలో భారీ వర్షం కురుస్తుండగా.. ఎయిర్‌పోర్టులోనూ గందరగోళం నెలకొంది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జుహూ బీచ్‌లో విషాదం నెలకొంది. ఐదుగురు గల్లంతు కాగా.. అందులో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. -
ఈసారి వర్షపాతం తక్కువే!
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఈ సారి వర్షపాతం సగటు కన్నా తక్కువగా ఉంటుందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంలో జరిగిన ఆలస్యంతో పాటు ‘ఎల్‌నినో’ వాతవరణ పరిస్థితులను అందుకు కారణంగా పేర్కొంది. ఇప్పటికే సగటు కన్నా 44% తక్కువ వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోర్ వెల్లడించారు. ‘ఎల్‌నినో’ వాతావరణ పరిస్థితి జులై చివర్లో, ఆగస్టు మొదట్లో తీవ్రంగా ఉండొచ్చన్నారు. ఇప్పటివరకైతే అది బలహీనంగానే ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. జూన్ 14 వరకు నైరుతి రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా జూన్, సెప్టెంబర్ నెలల మధ్య రుతుపవన వర్షపాతం సగటు కన్నా తక్కువగా.. 93 శాతమే ఉండొచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక రంగ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోతే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సీడీకి డీజిల్, అదనంగా విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ తెలిపారు. అల్పపీడన ద్రోణి సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికితోడు విశాఖ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, తెలంగాణా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందంది. ఉష్ణోగ్రతల్లో కూడా సోమవారం వ్యత్యాసాలు నెలకొన్నాయి.


