breaking news
indecent pictures
-
పిల్లల కంటెంట్‌లో అసభ్య యాడ్స్..
న్యూఢిల్లీ: పిల్లలు సహా అన్ని వర్గాలకు అనువైనదిగా మార్క్ చేసిన కంటెంట్‌లో తరచుగా అసభ్య ప్రకటనలు వస్తున్నాయని ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ సర్వే నివేదికలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది తల్లిదండ్రులు ఈ విషయం తెలిపారు. గత మూడేళ్లుగా గ్యాంబ్లింగ్/గేమింగ్, లోదుస్తులు, సెక్సువల్ వెల్నెస్కి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వివరించారు. పిల్లలకు అనువైనదిగా పేర్కొన్న కంటెంట్‌లో గ్యాంబ్లింగ్/గేమింగ్ (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) సంబంధ ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని 41 శాతం మంది తెలిపారు. లోదుస్తుల ప్రకటనలు తరచుగా ఉంటున్నాయని 35 శాతం మంది, సెక్సువల్ వెల్నెస్ యాడ్స్ ఉంటున్నాయని 29 శాతం మంది, మద్యం .. పొగాకు సంబంధ ప్రకటనలు ఉంటున్నాయని 24 శాతం మంది పేర్కొన్నారు. వయస్సుకు తగని ప్రకటనలు ప్రసారం చేస్తే నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించాలని 88 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల డివైజ్‌నే ఉపయోగిస్తారు కాబట్టి .. డివైజ్ ఓనర్ ప్రొఫైల్‌ను బట్టి కాకుండా లైవ్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ ప్రకారం ప్రకటనలు ఉండేలా ఆయా ప్లాట్‌ఫాంలు, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. 10,698 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వివిధ ప్రశ్నలకు దేశవ్యాప్తంగా 305 జిల్లాల నుంచి 30,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి. -
అశ్లీల చిత్రాల్లో నటించిన యువకుడి అరెస్ట్
ఆమదాలవలస: శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన ఆమదాలవలసలో అశ్లీల చిత్రాల చిత్రీకరణ ముఠా ప్రధాన సూత్రధారి చింతాడ మహేష్ పోలీసులకు చిక్కాడు. అతడిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. ఇక నుంచి సెల్ఫోన్లు తనిఖీలుచేస్తామని, అశ్లీల చిత్రాలు ఉంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని జిల్లా ఎస్పీ బ్రహ్మరెడ్డి తెలిపారు. అశ్లీల చిత్రాల చిత్రీకరణకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐ నవీన్‌కుమార్ శనివారం వెల్లడించారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలతో కేసు దర్యాప్తు చేశామని అందులో కొత్తకోటవారివీధికి చెందిన చింతాడ మహేష్ అనే యువకుడు తానే స్వయంగా అశ్లీల చిత్రంలో ఉంటూ చిత్రీకరించిన వీడియో ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. ఈ క్రమంలో మహేష్ స్నేహితులైన ఆమదాలవలస పట్టణానికి చెందిన సీపాన రమేష్, నానుపాత్రుని సంతోష్, పేడాడ వెంకటరావులను మూడు రోజుల కిందట అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా ఒక హార్డు డిస్క్, మూడు సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నామని అందులో అశ్లీల చిత్రాలు చిత్రీకరించినది, వేరొక ప్రాంతాలకు చెందినవి లభ్యమయ్యాయని తెలిపారు. ప్రధాన సూత్రధారి మహేష్‌తో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న సమయంలో ఆ చిత్రాలను చేజిక్కించుకున్న రమేష్, సంతోష్ అక్కడితో ఆగకుండా అవి పట్టణంలో చాలా మంది వ్యక్తుల మెుబైల్స్‌కు, కంప్యూటర్లకు పంపిస్తూ ప్రచారం చేసినట్టు వారే స్వయంగా ఒప్పుకున్నారని సీఐ చెప్పారు. వీరితో పాటు కొర్లకోట గ్రామానికి చెందిన క్రిష్ణారావు ఈ చిత్రాలను ప్రసారం చేశాడనే ఆరోపణలతో అరెస్టు చేసి వీరిపై పలు సెక్షన్లు కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మహేష్ ఉచ్చులో ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, అతడి వద్ద ఉన్న వీడియోలు బయటకు రాకుండా చూసే బాధ్యత పోలీసులేదనని తెలిపారు. సెల్‌ఫోన్ దుకాణాల్లో, కంప్యూటర్ సెంటర్లలో, యువకుల సెల్ఫోన్లలో అటువంటి నీలిచిత్రాలు బయటపడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.