breaking news
Inclusive education Resource Persons
-
తరగతి గదిలో విభజన రేఖలు!
విద్య అనేది సమసమాజ నిర్మాణా నికి, సామాజిక సమానత్వానికి ప్రాథమిక పునాది. విభిన్న సామా జిక నేపథ్యాలు ఉన్న పిల్లలను ఒకే తాటిపైకి తెచ్చే గొప్ప సామాజిక వేదిక. కానీ, నేడు మన విద్యా వ్యవస్థ గురుకులం, బీసీ వెల్ఫేర్, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ స్కూళ్లు... అంటూ కులాలు, వర్గాల వారీగా విడిపోయింది.సంక్షేమం పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక పాఠశాలలు విద్యా వ్యవస్థను వర్గాల వారీగా విడదీస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం చాటే భారతీయ సమాజంలో విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలు ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్నప్పుడే పరస్పరం గౌరవించుకునే సంస్కృతి అల వడుతుంది. కులాలు, వర్గాలకు వేర్వేరు పాఠశాలల వల్ల చిన్నతనం నుంచే ‘మేము–వారు’ అనే భావన రూపుదిద్దుకుంటుంది. ఇది విద్యార్థికే కాదు, సమాజానికే ప్రమాదకరం.వెనకబడిన వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడమనే మంచి లక్ష్యంతోనే ఈ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక పాఠశాలలు పేద కుటుంబాలపై విద్యా భారాన్ని తగ్గించి, ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఒకే విధమైన నేపథ్యం ఉన్న విద్యార్థులు ఒకే చోట చదవడం వల్ల, వారు బాహ్య సమాజంలోని వైవిధ్యాన్ని అనుభవించే అవ కాశం తగ్గుతుంది. ఇది వారిలో ‘మేము ప్రత్యేక వర్గానికి చెందినవారం’ అనే భావనను పెంచుతుంది. రేపు వీరు సమా జంలోకి వచ్చాక మిగిలిన వర్గాలు, ప్రజలతో మమేకం కాలేరు. కలిసిపోయి బతకాలి అనేది వీరిలో ఏమాత్రం ఉండదు.కొఠారీ కమిషన్ సిఫార్సులువేర్వేరు వర్గాల పిల్లలు చిన్నతనం నుంచి కలిసి పెరిగి నప్పుడే కుల, మతరహిత ఆలోచనా ధోరణి పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ సమాన విద్యా అవకాశాలు సాధించా లంటే పాఠశాలల విభజన కంటే ప్రతి ప్రభుత్వ పాఠశాల లోనూ ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలు, ఆధునిక వస తులు కల్పించడం ద్వారానే నిజమైన సమగ్ర వికాసం సాధ్య మవుతుంది. ఇందుకోసం కొఠారీ కమిషన్ సిఫార్సు చేసిన ట్లుగా ప్రాంతీయ ఆధారిత సాధారణ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలి.కుల, మత, వర్గ వ్యత్యాసాలు లేకుండా సమీపంలోనే ఉన్న పాఠశాలలో విద్యార్థులందరూ కలిసి చదు వుకునే వాతావరణాన్ని ప్రోత్సహించాలి. ప్రత్యేక పాఠశాల లను నిర్వహించడానికి బదులుగా సాధారణ ప్రభుత్వ పాఠ శాలల్లోనే వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్ షిప్‌లు, వసతి, పోషకాహార సౌకర్యాలు కల్పించాలి. ప్రతి గ్రామ, మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలలోనూ సమాన స్థాయి వసతులు, బోధనా ప్రమాణాలు కల్పించాలి. ప్రత్యేక గురుకులాల్లో నిర్దిష్ట శాతాన్ని మాత్రమే ఆ యా వర్గాలకు పరి మితం చేసి, మిగిలిన సీట్లను సాధారణ ప్రాతిపదికన వర్గాల కతీతంగా కేటాయించడం ద్వారా వైవిధ్య మైన విద్యా వాతావరణాన్ని సృష్టించాలి.ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన విద్యా వ్యవస్థలను పరిశీలిస్తే అవి ప్రత్యేక విభాగాలు లేదా వర్గీకరణల కంటే సమగ్ర విద్య, కామన్ స్కూల్ సిస్టమ్‌లకే ప్రాధాన్యత ఇస్తు న్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థగా పేరొందిన ఫిన్లాండ్లో ప్రైవేట్ లేదా ప్రత్యేక వర్గాల పాఠశాలలు దాదాపు ఉండవు. ధనిక, పేద, విభిన్న సామాజిక నేపథ్యాలు ఉన్న పిల్లలందరూ ఒకే రకమైన పబ్లిక్ స్కూల్స్‌లోనే కలిసి చదువుకుంటారు. అమెరికాలో నివాస ప్రాంతాల ప్రాతిపది కన నడిచే పబ్లిక్ స్కూళ్లలో విభిన్న జాతులు, ఆర్థిక నేపథ్యాల పిల్లలు ఒకే తరగతి గదిని పంచు కుంటారు. విద్యార్థుల్లో వైవిధ్యాన్ని గౌరవించే తత్వాన్ని పెంపొందించడానికి ఇది దోహదపడుతుంది. ఇక, భిన్న సంస్కృతులు, జాతులు ఉన్న సింగపూర్‌లో ప్రతి పాఠశాలలోనూ అన్ని వర్గాల పిల్లలు సమానంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది చిన్నతనం నుంచే జాతీయ ఐక్యతను పెంపొందిస్తుంది.విలువలు– బాధ్యతలుపిల్లలకు కేవలం పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, బ్యాగులు, మధ్యాహ్నం భోజనం వంటివి ఇవ్వడంతోనే సరి పోదు. వాళ్ల చదువు, పనితీరును నిరంతరం ట్రాక్ చేయాలి. నైతికత, విలువలు, సహకారం, దేశం పట్ల ప్రేమ, బాధ్యత వంటివి కూడా తప్పనిసరి పాఠ్యాంశాలుగా చేయాలి.మన దగ్గర హక్కుల గురించి మాట్లాడతారే కానీ బాధ్యతల గురించి ఎవరూ మాట్లాడరు. బాధ్యతల గురించి చిన్నతనం నుంచే నేర్పిస్తే ఆ సమాజం ఎదుగుతుంది. చదవడం, పెరగడం ఒకే గొడుగు కింద జరిగేలా చూడటమే నిజమైన ప్రగతిశీల సమాజ లక్షణం. పిల్లలను చిన్ననాటి నుంచే వర్గాలుగా విడదీయకుండా, సమాజంలో ఐక్యతను పెంపొందించేలా ఉండటమే సమగ్ర విద్య అసలైన లక్ష్యం.- నరేంద్ర కుమార్ కామరాజు, వ్యాసకర్త ప్రణీత్ గ్రూప్ ఫౌండర్–మేనేజింగ్ డైరెక్టర్ -
విద్యాశాఖ ‘ఔట్సోర్సింగ్’ ఆకలి కేకలు
కైకలూరు, న్యూస్‌లైన్ : అధికారుల అలసత్యం చిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. రెండు నెలలుగా జీతాలందక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. కేంద్రం ఎస్ఎస్ఏ ఔట్‌సోర్పింగ్ సిబ్బందికి బడ్జెట్ కేటాయించిన జీతాల చెల్లింపు బిల్లులపై స్పష్టత రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్ సర్వశిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ) పరిధిలోని క్లస్టర్ రిసోర్స్‌పర్సన్ (సీఆర్పీ), ఇన్‌క్లూజీవ్ ఎడ్యూకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్టీ), మేనేజ్మెంట్ ఇన్ఫరేషన్ సిస్టమ్ కో-ఆర్డనేటర్స్ (ఎంఐఎస్), డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (డీఈవో), మేసెంజర్స్, పార్ట్‌టైమ్ ఇన్స్టక్చర్స్ తదితర కేటగిరీలకు సంబంధించి 738 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ గత విద్యాసంవత్సరానికి ఏప్రిల్ 23తో కాంట్రాక్టు గడువు ముగిసింది. దీంతో 2014-15 విద్యాసంవత్సరానికి వీరు తిరిగి అదే నెల 28 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ నెల జీతాలు ఇప్పటికీ అందలేదు. అదే విధంగా మే ముగుస్తున్నా జీతాలపై అయా అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందడం లేదని సిబ్బంది వాపోతున్నారు. సమీప పశ్చిమగోదావరి జిల్లా, గుంటూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏప్రిల్, మే నెల జీతాలు సిబ్బందికి అందాయని, ఇక్కడ కూడా ఆ విధంగా అందించాలని సిబ్బంది కోరుతున్నారు. ఆలస్యమవుతున్న క్రమబద్ధీకరణ దస్త్రాం.. రాజీవ్ విద్యామిషన్ (ఎస్ఎస్ఏ) పరిధిలోని వివిధ విభాగాల ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఏప్రిల్ 28 నుంచి తిరిగి రెన్యూవల్గా గుర్తించి విధులు అప్పగించాలని రాష్ట్ర అధికారుల నుంచి అదేశాలు వచ్చాయని సిబ్బంది చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం నోటిమాటగా వీరిని తిరిగి విధులు నిర్వహించమన్నారు. రెన్యూవల్‌కు సంబంధించి పత్రాలు ఇప్పటికీ రాలేదని చెబుతున్నారు. ఇన్‌క్లూజీవ్ ఎడ్యూకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్టీ)లు మాత్రం రెన్యూవల్‌కు సంబంధించి బాండు పేపర్లు అధికారులకు అందించారు. మిగిలిన వివిధ కేటగిరిల సిబ్బందిని ఆయా మండల విద్యాశాఖాధికారులకు అందించాలని చెప్పారు. అయితే వీరినుంచి బాండు పేపర్లు తీసుకోకుండా కొంతమంది ఎంఈవోలు కావాలనే ఆలస్యం చే స్తున్నారనే విమర్శలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అన్ని జిల్లాలకు భిన్నంగా ఇక్కడ జరగడంపై సిబ్బంది అసహానికి గురవుతున్నారు. భారంగా మారుతున్న విధులు.... ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి ఆయా మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. రోజూ రైలు, బస్సుల ద్వారా కేంద్రాలకు వెళుతున్నారు. ఇప్పటి వరకు జీతాలందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా బడులు తెరిచే వేళకు ఆయా గ్రామాల్లో విద్యార్థులను గుర్తించడం, అదే విధంగా ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలను గుర్తించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకూ జీతాలు చెల్లింపు లేకపోవడం వల్ల కుటుంబపోషణ కష్టమవుతుందని, అధికారులు జీతాలను చెల్లించాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు. కలెక్టర్ పరిశీలనలో ఉంది... రాజీవ్ విద్యామిషన్ (ఎస్ఎస్ఏ) ఔట్సోర్సింగ్ బిల్లును కలెక్టర్ నోటీసుకు పంపించామని ప్రాజెక్ట్ ఆఫీసర్ పద్మావతి చెప్పారు. ఆయనకు మరోసారి సిబ్బంది బిల్లు అవశ్యకతను వివరిస్తానన్నారు. అన్ని మండలాల నుంచి జీతాలకు సంబంధించి బిల్లులు చేరలేదన్నారు. త్వరలో జీతాలు వచ్చే ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు.


