breaking news
iiit campus
-
కూటమి వల.. క్యాంపస్విలవిల
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట మసకబారింది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీలో బయటి వ్యక్తుల పెత్తనంతో భ్రషు్టపట్టిపోయింది. కాలేజీలో పచ్చ బ్యాచ్‌ను నాన్ టీచింగ్ సిబ్బందిగా నియమించడం ద్వారా క్యాంపస్ ఎత్తివేత కుట్రలకు ప్రభుత్వం తెరదీసింది. ఏడాది పాటు ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్ అద్దె చెల్లించకుండా నిలిపేసింది. కరెంటు బిల్లులూ చెల్లించలేదు. మౌలిక సదుపాయాలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. చివరకు క్యాంపస్‌ను ఎత్తివేసింది. ఈ పరిణామాలతో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో చేరాలంటే విద్యార్థులు భయపడిపోయే పరిస్థితి దాపురించింది. తాజాగా జరిగిన కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు మిగిలిపోయిన కాలేజీగా నిలవడం పరిస్థితికి అద్దం పడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు ఉండగా ఒక్కో క్యాంపస్‌కు 1100 సీట్లున్నాయి. ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 5వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరిగింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 598 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఇందులో ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించి 183 సీట్లు ఖాళీగా మిగిలి రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు మిగిలిపోయిన కాలేజీగా నిలిచింది. గతంలో ఎన్నడూ ఇన్ని సీట్లు మిగలలేదని కాలేజీ ఉద్యోగులు చెబుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఈ సీట్లు ఎన్ని భర్తీ అవుతాయో చూడాలి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక పదవిలో ఉన్న మంత్రికి సన్నిహితుడైన ఒక ప్రైవేటు కాలేజీ అధినేత కాలేజీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. తన గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలకు నాన్ టీచింగ్ స్టాఫ్‌గా నియమించినట్లు సమాచారం. అప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగిన ఒంగోలు క్యాంపస్‌లో రచ్చ మొదలైంది. ఆ 50 మంది పచ్చ బ్యాచ్‌కు ఎలాంటి విధులు అప్పగించకుండా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. క్యాంపస్‌లోని ఎగ్జామ్ సెల్ పక్కనే ఉన్న ఒక గదిని డెన్‌గా మార్చుకున్న సదరు ఎల్లో బ్యాచ్ డ్యూటీ చేయకుండా టీవీలు చూస్తూ టైం పాస్ చేసేవారని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా కాలేజీ నిబంధనలకు వ్యతిరేకంగా తమ ఇష్టమొచ్చినప్పుడు కాలేజీకి వచ్చి సంతకాలు చేసేసి వెళ్లిపోయేవారని సమాచారం. దీంతో క్యాంపస్‌లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే క్యాంపస్ అద్దె చెల్లించలేదు. దాంతో రూ.2.50 కోట్ల అద్దె బకాయి మిగిలిపోయింది. కరెంటు బిల్లు సైతం కోటి రూపాయలకు పైగానే చెల్లించకుండా నిలిపేశారు. దీంతో తరచుగా కరెంటు కట్ చేయడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. మోటార్లు కాలిపోయి నీటి సరఫరా ఆగిపోయినా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. రకరకాల సాకులు చూపి రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌ను ఎత్తివేశారు. ఇది విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం చూపిందని కాలేజీ అధ్యాపకులు చెబుతున్నారు. ఎస్‌ఎస్‌ఎన్‌లో ఆదిలోనే హంసపాదు... రావ్ అండ్ నాయుడు క్యాంపస్ ఎత్తేసిన తరువాత ఒంగోలులో మిగిలింది ఎస్ఎస్ఎన్ క్యాంపస్. కాలేజీ తరగతులు ప్రారంభం కాకముందే ఇక్కడ మరో పచ్చ బ్యాచ్ రచ్చ రచ్చ చేసి విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ క్యాంటిన్ నిర్వహణను రెండుగా విభజించి ఇద్దరికి ఇచ్చారు. బాలికల క్యాంటిన్‌ను చవటపాలెం గ్రామానికి చెందిన ఒకరికి, బాలుర క్యాంటిన్‌ను కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు. ఈ ఇద్దరూ టీడీపీ నాయకులు, సానుభూతిపరులు కావడం గమనార్హం. గత బుధవారం బాలికల క్యాంటిన్‌ను తెరవడంతో బాలుర క్యాంటిన్ కాంట్రాక్టర్ గొడవకు దిగారు. 20 మంది యువకులను తీసుకొచ్చి కాలేజీలోకి బలవంతంగా ప్రవేశించి బాలికల క్యాంటిన్ నిర్వాహకురాలి భర్త మీద దాడి చేశారు. క్యాంటిన్లోని వస్తువులతోపాటు ఆహార పదార్థాలను రోడ్డు మీద పడేశారు. ఈ దాడితో కాలేజీలో రిపోరి్టంగ్ చేయడానికి వచ్చిన విద్యార్థులు, వారి తలిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అసలు క్యాంటిన్ నిర్వహణ బాధ్యతను ఇద్దరికి కట్టబెట్టడం వలన గొడవలు జరిగే అవకాశం ఉందని అంచనా వేయడంలో అధికారులు వైఫల్యం చెందారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఎస్ఎస్ఎన్ క్యాంపస్‌ను కూడా ఎత్తివేసే క్రమంలోనే అధికార పార్టీ పక్కా ప్రణాళికతో గొడవలు సృష్టించిందని కొందరు విశ్లేషి స్తున్నారు. సొంత భవనాలు ఎప్పుడు నిర్మిస్తారో... ఒంగోలు ట్రిపుల్ ఐటీలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి తరచుగా క్యాంపస్‌లను మార్చడం. తొలుత ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీలో ఒంగోలు క్యాంపస్‌ను నిర్వహించారు. అక్కడ నుంచి మార్చి ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. అంతా బాగుందనుకుంటున్న విద్యార్థులకు ఐదేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం వచ్చి ఒంగోలు క్యాంపస్‌ను నూజివీడుకు మార్చింది. పిల్లి పిల్లను తీసుకొని ఇంటింటికి తిరుగుతున్నట్లు విద్యార్థులు తరచుగా క్యాంపస్‌లు మారాల్సి రావడంతో చిరాకుకు గురౌతున్నారు. కొత్తగా చేరే విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడింది. ఒంగోలులో ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలను నిర్మించడం ఒక్కటే దీనికి పరిష్కారమని కొందరు అధ్యాపకులు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కూడా తరచుగా మాట మారుస్తోంది. తొలుత పామూరులో ట్రిపుల్ ఐటీ కాలేజీని నిర్మిస్తామన్నారు. తాజాగా కనిగిరిలో ట్రిపుల్ ఐటీ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఒకవేళ మార్కాపురాన్ని జిల్లాగా మారిస్తే కనిగిరి.. మార్కాపురం జిల్లా పరిధిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఒంగోలుకు అసలు ట్రిపుల్ ఐటీ కాలేజే లేకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కాలేజీకి సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.పోలీసు బందోబస్తు మధ్య క్యాంటిన్ నిర్వహణ..బాలికల క్యాంటిన్ నిర్వాహకుడి మీద దాడి జరిగిన రోజు రాత్రి జిల్లాకు చెందిన ఒక కీలక ఎమ్మెల్యే నివాసంలో అర్ధరాత్రి వరకు రాజీ ప్రయత్నాలు సాగినట్లు ప్రచారం జరిగింది. అంతా అయిపోయింది. తెల్లారేసరికల్లా ఇద్దరూ కలిసిపోయారని చెప్పారు. ఈ లోపు ఏం జరిగిందో ఏమో కానీ దాడికి గురైన బాలికల క్యాంటిన్ నిర్వాహకులు శుక్రవారం సంతనూతలపాడు పోలీసు స్టేషన్లో కేసు పెట్టినట్లు సమాచారం. అదే రోజు క్యాంపస్‌కు వచ్చిన పోలీసులు విచారణ జరిపి దాడి తాలుకు సీసీ ఫుటేజీలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి పోలీసు బందోబస్తు మధ్య బాలికల క్యాంటిన్‌ను నిర్వహిస్తున్నారని సమాచారం. కాలేజీ క్యాంపస్‌లో పోలీసు పహారా మధ్య విద్యార్థులు భోజనాలు చేయడానికి భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఐటీ అధికారుల వైఫల్యం వల్లనే ఇలాంటి దౌర్భాగ్యం నెలకొందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ట్రిపుల్ ఐటీలో కొరియా భాష బోధన
ఎచ్చెర్ల క్యాంపస్: ప్రపంచం కుగ్రామమైపోయింది. ఉపాధి అవకాశాలు ఎంత సులభంగా వస్తున్నాయో అంతే తొందరగా పోతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో సరైన ఉపాధి అవకాశాలను అన్వే షించడం విద్యార్థులకు అత్యవసరం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఈ దిశగా తర్ఫీదు ఇస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలో ఇంజినీరింగ్ చేశాక వంద శాతం ఉద్యోగం లభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీయూసీ కోర్సు నుంచే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, యాప్స్ వంటివాటిపై తర్ఫీదు అందుతోంది. దీంతో పాటు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్‌షిప్ ప్రోత్సహించే విధంగా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం కొరియా సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో దూసుకుపోతోంది. ఆ దేశంలో మన విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొరియా భా షను నేర్పించేందుకు వర్సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా కొరియాలో పనిచేయాలంటే నైపుణ్యంతో పాటు భాష కూడా ప్రధానమే. అందుకే మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్న ఆ దేశంలో పనిచేసే విధంగా, విద్యార్థులను ప్రొత్సహించే దిశగా కొరియా భాషను ట్రిపుల్ ఐటీలో పరిచయం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు.. రాష్ట్రం యూనిట్‌గా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కొరియా భాషను ప్రవేశ పెట్టే చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు కొరియన్ కల్చరల్ అండ్ టెక్నాలజీ సెంటర్‌తో ఎంఓయూ (ఒప్పందం) కుదుర్చుకున్నా రు. మరో పక్క సౌత్‌కొరియా సంస్థలు కళాశాలలకు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూ లు నిర్వహించటం, భారత దేశంలో పలు ప్రధాన నగరాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేయడం కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మంచి ప్యాకేజీలకు ఎంపికయ్యే అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలో విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతిభావంతమైన వి ద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో చేరుతున్నా రు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యంతో పాటు భాషా నైపుణ్యం అవసరవుతోంది. ఈ నేపథ్యంలో కొరియా వంటి భాషలను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. – డాక్టర్ జి.భానుకిరణ్,శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ -
ప్రధాని నరేంద్రమోదీకి సీఎం లేఖ
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో ఐఐఐటీని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తాను గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో ఐఐఐటీని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని కోరుతూ 2018 ఆగస్టులో సీ ఎం ద్వారా పంపిన లేఖకు కొనసాగింపుగా సీఎం ద్వారా మరో లేఖ పంపినట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత కరీంనగ ర్ పట్టణం పారిశ్రామికంగా అభి వృద్ధి చెందిందని, కరీంనగర్‌కు ఐఐఐటీని ఏర్పాటు చేయలని లేఖలో కోరినట్లు తెలిపారు. -
చదువుల తల్లి శాశ్వత ‘సెలవు’
భీమ్‌గల్, న్యూస్‌లైన్ : చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిం దని సంబరపడ్డ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 2010-11లో పదో తరగతి లో భీమ్‌గల్ మండల టాపర్‌గా నిలిచిన స్రవంతి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకుంది. ఉన్నత విద్యాభ్యాసం చేసి తమకు పేరు తెస్తుందనుకున్న బిడ్డ ఇప్పుడు వారి నుంచి శాశ్వతంగా దూరమైపోయిందన్న వేదనను తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఈ-1 చదువుతున్న స్రవంతి సెలవుల కోసం వచ్చి ఇంటి వద్ద సోమవారం కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంటికి వెళ్లి.. ట్రిపుల్ ఐటీలో పరీక్షలు ముగిశాయి. సెలవుల్లో అందరితోపాటు గత నెల 24న స్రవంతి ఇంటికి వచ్చింది. బడా భీమ్‌గల్‌కు చేరుకున్న స్రవంతి సోమవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిం ది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా కాలిపోయిన బాధితురాలిని కుటుంబ సభ్యులు హుటాహుటీన నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్రవంతి(19) మరణిం చింది. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నిరుపేద కుటుంబం స్రవంతి తండ్రి రాజా గంగారాం కూలి పనులు చేస్తూ, తల్లి భూదేవి ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతుల పెద్ద కూతురు స్రవంతికి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిందని ఎంతో సంబరపడ్డారు. నిరుపేద కుటుంబం కావడంతో స్రవంతి తండ్రి రాజాగంగారాం కుటుంబాన్ని పోషించేందుకు దుబాయి వెళ్లాడు. తల్లి భూదేవి బడాభీమ్‌గల్‌లో ఉంటూ పిల్లలను చదివిస్తోంది. పెద్ద కూతురు ట్రిపుల్ ఐటీలో చదువుతుంటే కుమారుడు ప్రసాద్ స్థానికంగా తొమ్మిదో తరగతి, చిన్నకూతురు శ్రావణి ఏడో తరగతి చదువుతున్నారు. చదువుల తల్లి తమ కళ్లముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ట్రిపుల్ ఐటీలో విషాదం భైంసా : స్రవంతి చనిపోయిందని తెలియగానే బాసరలోని ట్రిపుల్ ఈ-1లో చది వే తోటి విద్యార్థులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండేదని పేర్కొన్నారు. సెలవుల కోసం వెళ్లిన స్నేహితురాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలి సి విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో పని చేసే మెంటర్లు విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకుని విస్మయానికి లోనయ్యారు. తోటి విద్యార్థులంతా ఈ విషయాన్ని తెలుసుకుని ఇదే విషయంపై చర్చించారు. ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భీమ్‌గల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
ట్రిపుల్ ఐటీ ‘క్యాంపస్’లో పల్లె వెలుగు
పుట్టి పెరిగింది పల్లెలోనే కావొచ్చు.. కాస్త ప్రోత్సహిస్తే ‘కార్పొరేట్’ విద్యార్థులతోనూ పోటీపడగలమనే ఆత్మవిశ్వాసం.. తాను నేర్చుకున్న విద్య రైతన్నలకు వెన్నుదన్నుగా ఉండాలనే సంకల్పం.. వెరసి ఆ విద్యార్థిని విజేతగా నిలిపాయి. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమల ప్రతిభ మసకబారకూడదన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ట్రిపుల్ ఐటీల్లో ఇటీవల తొలి ప్రాంగణ నియామకాలు జరిగాయి. వీటిలో రూ. 5.2 లక్షల వార్షిక వేతనంతో ‘ఎఫ్ఎన్ సీ టె క్నాలజీస్’ కంపెనీకి ఎంపికైన గుణపాటి రామ్మోహన్ సక్సెస్ స్పీక్స్.. మాది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చిన్నారెడ్డి పాలెం అనే పల్లెటూరు. నాన్న రఘురామిరెడ్డి చిన్న రైతు. ఉన్న రెండెకరాల్లో సేద్యం చేస్తుంటారు. పొలం పనిలో ఎక్కువగా తేలికపాటి పనిముట్లు ఉపయోగించడం వల్ల శ్రమ తెలిసేది కాదు. దీంతో నాకు వ్యవసాయ పనిముట్లపై ఉత్సుకత పెరిగింది. ఆర్థిక అండ లేకనే: అమ్మానాన్నలు నిరక్షరాస్యులు. అందుకే మమ్మల్ని బాగా చదివించాలని తపిస్తుండేవారు. అయితే ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల ఇద్దరు అక్కయ్యల చదువు పదో తరగతితోనే ఆగిపోయింది. నా ఆసక్తిని గమనించి ఎలాగైనా కష్టపడి చదివించాలనుకున్నారు. బిట్రగుంటలో హోలీ ఫ్యామిలీ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి వరకూ చదివా. 600కు 533 మార్కులు రావడంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటొచ్చింది. నాకిష్టమైన మెకానికల్ ఇంజనీరింగ్ (ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్) చేసేఅవకాశం వచ్చింది. చేయడం ద్వారా నేర్చుకోవడం: ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. చేయడం ద్వారా నేర్చుకోవడం (లెర్నింగ్ బై డూయింగ్) విధానం విద్యార్థుల్లో అప్లికేషన్ నైపుణ్యాల మెరుగుదలకు ఉపయోగపడుతోంది. క్యాంపస్‌లో చదువుతున్న కోర్సు.. రేపటి అవసరాలకు, క్షేత్రస్థాయిలో సంస్థల అవసరాలకు తగిన విధంగా సాగుతుంది. అకడమిక్స్‌లో ఇంటర్న్‌షిప్ కూడా కీలకం. నేను టాటా మోటార్స్‌లో 45 రోజులు ఇంటర్న్‌షిప్ చేశా. గేర్‌బాక్సు యూనిట్లో పనిచేశా. ఆర్మీ ట్రక్కులు, లారీలు తక్కువ ఇంధనంతోనే భారీ బరువులను తీసుకెళ్లేందుకు ఉపయోగపడే పరిజ్ఞానంపై నేను అందజేసిన నివేదికకు మంచి గుర్తింపు లభించింది. ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు: క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం ఇడుపులపాయ, బాసర, నూజివీడు క్యాంపస్‌ల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రూపు నుంచి 45 మందిని ఎంపిక చేశారు. తర్వాత 15 మంది ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. చివరకు ఇద్దరు ఎంపికయ్యారు. ఎంపిక ఐదు దశల్లో జరిగింది. అవి.. రాతపరీక్ష, బృందచర్చ, హెచ్ఆర్, టెక్నికల్ రౌండ్ -1, టెక్నికల్ రౌండ్-2, ఇంటర్వ్యూ. కోర్ మెకానికల్, బేసిక్ అప్లికేషన్స్ తదితరాలపై రాతపరీక్షలో ప్రశ్నలు వచ్చా యి. బృంద చర్చకు ‘సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా’ అంశమిచ్చారు. హెచ్ఆర్ రౌండ్లో కుటుంబ వివరాలు, నా బలాలు-బలహీనతలు, ట్రిపుల్ ఐటీలో బోధనా విధానం గురించి అడిగారు. రాతపరీక్షలో కరెక్టుగా రాసిన ప్రశ్నలను విశ్లేషించమన్నారు. ఇంటర్వ్యూలో ఇంటర్న్‌షిప్, కంపెనీ అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సిన విధానాలపై ప్రశ్నించారు. ప్లేస్‌మెంట్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. కాలేజీలో నిర్వహించిన మాక్ టెస్ట్‌లు, బృందచర్చలు ఉపయోగపడ్డాయి. సాక్షి భవితలో వచ్చే విజేతల కథనాలు స్ఫూర్తినింపాయి. అధ్యాపకులు మధుసూదన్‌రెడ్డి ప్రోత్సాహం మరవలేనిది. తక్కువ ధరకే వ్యవసాయ పరికరాలు: వ్యవసాయంలో రైతుల కష్టాన్ని తగ్గించేందుకు ఏదైనా చేయాలనుకునే వారు నాన్న. మా దగ్గర చిన్న ట్రాక్టరు ఉండేది. దానికి చిన్నచిన్న మార్పులు చేస్తూ వివిధ రకాల వ్యవసాయ పనులకు ఉపయోగించేవారు. ఇవన్నీ నా మనసులో నాటుకుపోయాయి. రైతులకు వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే పనిముట్లను తక్కువ ధరకే లభ్యమయ్యేలా చేయాలన్నది నా లక్ష్యం. తగిన ఆర్థిక వనరులు, పరిజ్ఞానం సంపాదించిన తర్వాత తప్పకుండా సొంతంగా పరిశ్రమను ఏర్పాటు చేస్తానన్న ఆత్మవిశ్వాసం ఉంది. నా జీవిత లక్ష్యం అదే!