
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో ఐఐఐటీని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తాను గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో ఐఐఐటీని కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కోరుతూ 2018 ఆగస్టులో సీ ఎం ద్వారా పంపిన లేఖకు కొనసాగింపుగా సీఎం ద్వారా మరో లేఖ పంపినట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత కరీంనగ ర్ పట్టణం పారిశ్రామికంగా అభి వృద్ధి చెందిందని, కరీంనగర్‌కు ఐఐఐటీని ఏర్పాటు చేయలని లేఖలో కోరినట్లు తెలిపారు.