breaking news
Ice Cube
-
నోబెల్ తెచ్చిపెట్టిన మంచు ‘ఘనం’!
కిలోమీటరు పొడవు, వెడల్పు, ఎత్తు మంచు ముద్ద... అది కూడా అంటార్కిటికాలో... భూమికి రెండు కిలోమీటర్ల లోతులో! .. 5,160 డిజిటల్ ఆప్టిక్ మాడ్యూళ్లు.... ఒక్కో దాంట్లో కాంతిని పట్టుకోగల సున్నితమైన సెన్సర్లు, మినీ కంప్యూటర్లు! .. వీటికి ఇంకో 324 డిజిటల్ ఆప్టిక్ మాడ్యూళ్లు కూడా కలిపేసుకోండి! ..ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ అవార్డు దక్కించుకున్న ఆవిష్కరణ వెనుక సెటప్ ఇదే! .. పేరు ‘ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ’. నిర్మాణంలో కీలకపాత్ర పోషించింది ఫ్రాన్సిస్ హాల్జెన్విశాల విశ్వాన్ని కళ్లారా చూసేందుకు మనిషి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాడు. గెలీలియో టెలిస్కోపుతో మొదలైన ప్రస్థానం అత్యంత శక్తిమంతమైన నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోపు వరకూ సాగింది. అయితే ఇవన్నీ కాంతి సాయంతో పని చేసేవి. టెలిస్కోపుల్లోని దర్పణాలపై కాంతి పడితేనే నక్షత్రాలైనా, గెలాక్సీలైనా మరేదైనా కనిపించేది. కానీ కొన్నిసార్లు కాంతికి కొన్ని అడ్డంకులు వస్తూంటాయి. కృష్ణబిలం అదేనండి బ్లాక్‌హోల్ లోపల, సూపర్నోవా పేలుళ్లలో, లేదా చాలా దూరంగా ఉన్న గెలాక్సీల్లోంచి కాంతి ఉండదు. కాబట్టి విశ్వంలోని ఆ భాగం కనిపించదు.ఇలా కాకుండా విశ్వం మొత్తం గురించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తెలుసుకోవాలంటే న్యూట్రినోలను అర్థం చేసుకుంటే సరి. కంటికి కనిపించనివి కోటానుకోట్ల మైళ్ల దూరం ప్రయాణించినా చెక్కు చెదరనివి. ఈ క్షణంలోనూ మన శరీరాన్ని దాటుకుని సునాయాసంగా ప్రయాణిస్తున్న అతి సూక్ష్మ కణాలివి. ఈ న్యూట్రినోలను గుర్తించేందుకు, తద్వారా విశ్వ రహస్యాలను ఛేదించేందుకు ఒక అద్భుతమైన ‘ఐస్ క్యూబ్ న్యూట్రినో’అబ్జర్వేటరీని నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్(అమెరికా) ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ హాల్జెన్కు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. అంటార్కిటికా ప్రాంతంలో దాదాపు రెండు కిలోమీటర్ల లోతులో (1,450 – 2,450 మీటర్లు) ఏర్పాటైంది ఈ వేదశాల. అలాగని ఇదేదో బిల్డింగ్ కాదండోయ్. ముందుగానే చెప్పినట్లు ఒక కిలోమీటరు సైజున్న మంచు ఘనం! గడ్డకట్టిన ఈ మంచు ఎంత పారదర్శకంగా ఉంటుందంటే న్యూట్రినోలు అణువును ఢీకొన్నప్పుడు వెలువడే విద్యుదావేశిత కణాల వెలుతురును డిజిటల్ ఆప్టికల్ మాడ్యూల్స్ స్పష్టంగా చూడగలిగేంత. ఈ ఐస్ క్యూబ్ చుట్టూ 5,160 మాడ్యూల్స్, భూ ఉపరితలంపై మరో 324 మాడ్యూల్స్ ఏర్పాటు చేశారు. కాంతి మాడ్యూళ్లను ఏ తీరున ఢీకొట్టాయి? వాటి ప్రకాశం ఎంత? ఏ కోణాల్లో ఢీకొట్టాయి? వంటి అంశాలను విశ్లేషించడం ద్వారా న్యూట్రినోల తీరుతెన్నుల సమాచారం తెలుసుకోవచ్చు. తద్వారా ఇప్పటికే ఉన్న సిద్ధాంతాలను ధ్రువీకరించుకోవచ్చు. కొత్త కొత్త విషయాలూ తెలుసుకోవచ్చు. అయితే మనకేంటి? ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ కేవలం ఖగోళ శా్రస్తానికి పరిమితం కాదు. దీన్ని నిర్మించేందుకు అభివృద్ధి చేసిన పలు టెక్నాలజీలు ఇప్పటికే మనకెంతో ఉపయోగపడుతున్నాయి. అత్యంత సున్నితమైన డిటెక్టర్ల తయారీ, డేటా అనాలసిస్ పద్ధతులు, దేశాల మధ్య సహకారానికి బాటలు వేసింది ఈ అబ్జర్వేటరీ. వ్యాధి నిర్ధారణలో ఎంతో కీలకమైన మెడికల్ ఇమేజింగ్‌ను మరింత కచ్చితంగా చేసేందుకు వీలు కల్పించింది. ఐస్‌క్యూబ్ కోసం అభివృద్ధి చేసిన డేటా అనాలసిస్ పద్ధతులను ఇప్పుడు కృత్రిమ మేధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో విద్యుత్తును మరింత ఆదా చేయగల టెక్నాలజీల అభివృద్ధికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తల అంచనా. – నేషనల్ డెస్క్ , సాక్షి ఫ్రాన్సిస్ హాల్జెన్కు భౌతిక శాస్త్ర నోబెల్ స్టాక్‌హోం: కంటికి కనిపించని న్యూట్రినో కణాలను గుర్తించేందుకు ఒక అత్యాధునిక వేదశాల (అబ్జర్వేటరీ) నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్ ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. అవార్డు కింద దాదాపు పది కోట్ల రూపాయలు (12 లక్షల అమెరికన్ డాలర్లు) దక్కనున్నాయి.‘‘హాల్జెన్ నేతృత్వంలోని ఇంజనీర్లు, పరిశోధకుల బృందం సిద్ధం చేసిన ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది’’ అని అవార్డు ప్రకటన సందర్భంగా నోబెల్ అవార్డు కమిటీ తెలిపింది. హాల్జెన్ ఇటలీ నుంచి నోబెల్ కమిటీతో ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా పెద్ద సర్ప్రైజ్. అవార్డు దక్కుతుందని అసలు ఊహించలేదు’’ అని వ్యాఖ్యానించారు. నోబెల్ అవార్డు దక్కవచ్చునని కొందరు అంచనా వేసినప్పటికీ దక్కడం మాత్రం కొంచెం చిత్రమైన అనుభూతి కలిగించిందని అన్నారు. బెల్జియంలో పుట్టి యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ (అమెరికా)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హాల్జెన్ వయసు ఇప్పుడు 82 ఏళ్లు. -
పోలీసులను చెడామడా తిట్టిన సింగర్
న్యూయార్క్: అమెరికన్ రాప్ సింగర్, యాక్టర్ ఐస్ క్యూబ్ పోలీసులపై విరుచుకుపడ్డాడు. చెడామడా ఏకిపారేశాడు. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసే దుర్మార్గాలని ఎండగట్టాడు. అయితే ఇదంతా నిజంగా కాదు. ఐస్‌క్యూబ్ లేటెస్ట్ ఆల్బంకు సంబంధించిన సంగతి ఇది. ఐస్ క్యూబ్ లేటెస్ట్ ఆల్బం డెత్ సర్టిఫికేట్ 25 ఎడిషన్. ఇందులో ’గుడ్ కాప్ బ్యాడ్ కాప్’ పేరుతో ఉన్న ఓ సాంగ్‌లో నల్లజాతీయులపై పోలీసుల దాష్టికంపై ఐస్ క్యూబ్ విరుచుకుపడ్డాడని బిల్బోర్డ్ మేగజైన్ వెల్లడించింది. ఐస్ క్యూబ్ సాంగ్‌పై కొంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నా.. దీనిని వేదికలపై ప్రదర్శిచడంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నాడు. ఐస్‌క్యూబ్.. డెత్ సర్టిఫికేట్ 25 ఎడిషన్ ఈ నెలలోనే విడుదలవుతోంది. -
'ఏదో ఒక రోజు ముసలివాళ్లం అయిపోతాంగా..'
లాస్ ఎంజెల్స్: తాను చూసేందుకు కఠినంగా కనిపించినా అవసరానికి తగినట్లే ఉంటానని, అది మంచి ఫలితాలు ఇస్తుందని ప్రముఖ హాలీవుడ్ నటుడు ఐస్ క్యూబ్ (షియా జాక్సన్) అన్నారు. తనకు ఇప్పుడు ఐదుగురు సంతానం అని చెప్పిన ఆయన పిల్లల పెంపకం విషయంలో ఎవరెన్ని చెప్పినా తాను మాత్రం సామాజిక స్పృహతోనే వారిని పెంచుతానని చెప్పారు. అదే సమయంలో వారికి అవసరమైనవేమిటో గుర్తిస్తానని, విచక్షణ పాటిస్తానని చెప్పారు. 'నేను కఠినంగా ఉంటాను. కానీ, సరైన వాడిని. నా పిల్లలను గౌరవిస్తాను. ఇలాంటి దృక్పథాన్ని ప్రతిఒక్కరూ అనుసరిస్తే బాగుంటుందని నేను భావిస్తాను. ఇది అన్ని సమయాల్లో నియంతృత్వం అనిపించుకోదు. పిల్లలు చిన్నవాళ్లు. వారికి పెద్దగా ఏం తెలియదు. వారికి యువకుల్లో ఉన్నట్లువంటి ఆలోచనలు ఉండవు. ఒక తెలివైన వ్యక్తి నాతో ఏం చెప్పారంటే.. నీ పిల్లల విషయంలో మంచిగా ఉండండి. ఎందుకంటే ఏదో ఒక రోజు నీవు ముసలివాడివి అయిపోతావు. వారిని మంచి పిల్లలుగా చూడాలంటే నువ్వు మంచి తండ్రిగా ఉండాలి. ఈ విషయం ఎప్పటికీ మనసులో పెట్టుకో అని' ఆయన చెప్పారు. -
రోజంతా మేకప్ తాజాగా..?
కౌన్సెలింగ్ ఈ మాసంలో పెళ్లిళ్లు, పండగలు ఎక్కువగా ఉన్నాయి. మేకప్ తప్పనిసరి అవుతుంది. కానీ చెమట, ఉక్కపోత వల్ల చికాకుగా ఉంటుంది. మేకప్ ఎక్కువసేపు తాజాగా, చికాకు కలిగించని విధంగా ఉండాలంటే ఏం చేయాలి? - వనజాక్షి, సీతాఫల్మండి సాయంకాలం వేడుకలలో మేకప్ పెద్దగా ఇబ్బంది అనిపించదు. కాని పగలు వేడుకలకు మాత్రం వాటర్ ఫ్రూఫ్ లేదా స్వెట్ ఫ్రూఫ్ మేకప్ వాడాలి. అయితే వీటిలో అంత లుక్ రాదు. కానీ ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. మేకప్ కి ముందు ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మృదువుగా రాయాలి. కళ్లకు ఐ లైనర్, ఐ లాష్, పెదవులకు లిప్‌స్టిక్ వాడితే చాలు. వీటితో పాటు హెయిర్ స్టైల్, డెస్సింగ్ సౌకర్యవంతంగా ఉంటే చికాకు కలగదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. పనిలో అలసట, బయట దుమ్ము ధూళి వల్ల ముఖం శుభ్రపరుచుకున్న కాసేపటికే తాజాదనం కోల్పోయినట్టుగా ఉంటోంది. ‘రోజూ పడుకునేముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, ఆ త ర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచిదని, ముఖ చర్మం చాలా బాగా శుభ్రపడుతుంద’ని నా స్నేహితురాలు చెబుతోంది. రోజూ క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించవచ్చా? ఏయే సందర్భాలలో ఉపయోగించాలో చెప్పగలరు. - సీమ, ఈమెయిల్ క్లెన్సింగ్ మిల్క్ చర్మంలోని పోర్స్ వరకు వెళ్లి మలినాలను తొలగించి, శుభ్రం చేస్తుంది. దీనిని రోజూ వాడితే చర్మంలోని సహజసిద్ధమైన ఆయిల్స్ పోయి పొడిగా తయారవుతుంది. పొడిగా మారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. దీంతో త్వరగా వయసు పైబడినట్టుగా కనిపిస్తారు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు క్లెన్సింగ్ మిల్క్‌ను వాడకూడదు. చర్మతత్త్వాన్ని బట్టి పదిహేను, నెలరోజులకు ఒకసారి ఉపయోగించడం మేలు. చర్మకాంతి పెరగాలంటే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సమతుల ఆహారం, సరైన నిద్ర... అవసరం అవుతాయి. ముందు జీవనశైలి మీద దృష్టి పెట్టి, ఆ తర్వాత బ్యూటీ నిపుణుల సలహాలు పాటించండి. ముఖానికి పండ్లగుజ్జుతో మసాజ్ చేసుకోవడం, ఫేస్‌ప్యాక్‌గా వాడటం వల్ల చర్మకాంతి పెరుగుతుందంటారు. నిజమేనా? అయితే ఎలాంటి పండ్లు వాడాలి? - రశ్మి, ఈమెయిల్ మన చర్మతత్త్వం ఎలాంటిదో తెలుసుకోకుండా రకరకాల పండ్లను మసాజ్‌లకు వాడితే చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. పైగా ఆ పండ్లలోని రకరకాల ఆమ్లాలకు మన చర్మం ఎలా ప్రభావితం అవుతుందో కూడా తెలియదు. ఆ పండ్లలో ఉండే ఆమ్లాలు చర్మాన్ని దెబ్బతీయవచ్చు. ఉదాహరణకు చాలామంది పసుపు రాసుకుంటారు. కాని కొందరికి ఆ పసుపులోని గుణాలు పడక మొటిమలు రావచ్చు. అంటే ఎవరి చర్మతత్త్వానికి తగ్గట్టుగా వారు ఆ ఉత్పత్తులను వాడితేనే సరైన ఫలితాలు లభిస్తాయి. మసాజ్ విషయానికి వస్తే నిపుణులు చేసే మసాజ్‌లో స్ట్రోక్స్ చర్మానికి తగ్గట్టుగా ఉంటాయి. వాళ్లు వాడే నాణ్యమైన ఉత్పత్తులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తాజా పండ్లు తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం చర్మకాంతిని పెంచుతుంది. అందుకని పండ్లను మసాజ్‌లకు కాకుండా తినడానికి ఉపయోగించడం మంచిది. అంతగా అయితే కొన్ని రకాల పండ్లను మాత్రమే ఆ చర్మతత్వానికి తగ్గట్టు ఫేస్ ప్యాక్ మాత్రమే వేసుకోవచ్చు. మసాజ్‌లు చేసుకోకూడదు. - గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్


