Human Rights Watch organization
-
సౌదీ సైన్యం కాల్పుల్లో వందలాది మంది మృతి !
దుబాయ్: సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యతి్నంచిన ఇథియోపియా వలసదారులపై సౌదీ బలగాలు జరిపిన కాల్పుల్లో వందలాదిమంది మృతి చెందినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ మంగళవారం తెలిపింది. సైన్యం మెషిన్స్ గన్లు, మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. యెమెన్ వైపు ఉన్న సరిహద్దు నుంచి వస్తున్న వలసదారులపైకి సౌదీ బలగాలు కాల్పులు జరపడంపై ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. హ్యూమన్ రైట్స్ వాచ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోందని సౌదీ అధికారి ఒకరు ఖండించారు. సౌదీలో ప్రస్తుతముంటున్న 7.50 లక్షల మంది ఇథియోపియన్ శరణార్థుల్లో 4.50 లక్షల మంది అనధికారికంగా ఉంటున్నవారే. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సౌదీ ప్రభుత్వం వీరిని వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
160 మంది బందీల ఊచకోత
ఇరాక్ మిలిటెంట్ల ఘాతుకం హ్యూమన్ ైరె ట్స్ వాచ్ వెల్లడి బాగ్దాద్: ఇరాక్ మిలిటెంట్ల మారణకాండను హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ధ్రువీకరించింది. మిలిటెంట్లు ఈ నెల 11-14 మధ్య తిక్రిత్ నగరంలో 160 మందికిపైగా బందీలను హతమార్చారని శుక్రవారం వెల్లడించింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, మిలిటెంట్లు విడుదల చేసిన ఫొటోల ఆధారంగా ఈ సంగతి తెలుస్తోందని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని, అయితే మృతదేహాలున్న ప్రాంతాలను గుర్తించడం కష్టమవుతోందని సంస్థ ప్రతినిధి పీటర్ బొకేర్ట్ ఓ ప్రక టనలో పేర్కొన్నారు. ఉత్తర ఇరాక్‌లో పలు ప్రాంతాలను చేజిక్కించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్) జిహాదీలు తాము పట్టుకున్న సైనికులను నేలపై పడుకోబెట్టి కాల్చి చంపుతున్నట్లున్న ఫొటోలను వెబ్సైట్లో పెట్టడం తెలిసిందే.